E-Paper
Advertisement

8 ఏళ్లకే తల్లి మరణం.. ఆపై తండ్రి కూడా..బిగ్ బాస్ కంటెస్టెంట్ జీవితంలో అన్నీ కన్నీళ్లే!

8 ఏళ్లకే తల్లి మరణం.. ఆపై తండ్రి కూడా..బిగ్ బాస్ కంటెస్టెంట్ జీవితంలో అన్నీ కన్నీళ్లే!
Advertisement

Bigg Boss 10: సాధారణంగా రియాలిటీ షో లలో కంటెస్టెంట్స్.. పార్టిసిపేట్ చేసేటప్పుడు కొంతమంది తమ కష్టాలను చెప్పుకొని సింపతీ కొట్టేస్తే.. మరి కొంతమంది ఆ సింపతీ పొందడం ఇష్టం లేక జీవితంలో ఎవరు ఊహించని కష్టాలను అనుభవిస్తున్నా.. బయటకు మాత్రం పొగరుగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే వారందరూ వారిని చూసిన ప్రతి ఒక్కరు వారికి పొగరెక్కువ అని కామెంట్లు చేస్తారే కానీ ఆ పొగరు వెనుక ఉన్న కఠిన హృదయం పడ్డ కష్టాన్ని ఎవరు గుర్తించరు.. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఇప్పుడు అడుగుపెట్టి.. తన క్యూట్ లుక్స్ తో, పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఒక కంటెస్టెంట్ జీవితంలో అన్నీ కన్నీళ్లే. తల్లిని కోల్పోయి.. ఆపై తండ్రిని కూడా దూరం చేసుకుని సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్న ఈ బ్యూటీ తన జీవితంలో పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.. ఆమె ఎవరో కాదు బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లోకి అగ్నిపరీక్ష ద్వారా కామన్ కేటగిరిలో అడుగుపెట్టిన యూట్యూబర్ షాలిని పటేల్.

బిగ్ బాస్ కంటెస్టెంట్ జీవితంలో ఇంత విషాదమా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి అగ్ని పరీక్ష సీజన్ 2లో సత్తా చాటి, మెయిన్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ఆరుగురిలో ఈమె కూడా ఒకరు. ఆస్ట్రేలియాలో ఉండే ఈ తెలుగమ్మాయి సోషల్ మీడియాలో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఊహించని పాపులారిటీ అందుకున్న ఈమె.. తన ఆట మాట తీరుతో జడ్జీలతో పాటు బిగ్ బాస్ అభిమానులను ఇంప్రెస్ చేసి హౌస్ లోకి అడుగు పెట్టింది. వాస్తవానికి అగ్నిపరీక్ష 2 లో ఈవిడను చూసి.. చాలా పొగరు, ఆటిట్యూడ్ ఎక్కువ అని కూడా అనుకున్నారు.

Advertisement

ALSO READ:బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?

చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి..

అసలు ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకూడదు అని కోరుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అంతేకాదు ఎంతోమంది రివ్యూయర్స్ తో పాటు నెటిజన్లు కూడా ఈమె పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈమె జీవితంలో కొన్ని విషాద సంఘటనలు ఉన్నాయి . వాటి కారణంగానే ఈమె ఎప్పుడు ఇలా సీరియస్ గా కనిపిస్తుందేమో అని కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే అగ్నిపరీక్ష సీజన్ 2 పూర్తయ్యాక బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో షాలిని మాట్లాడుతూ..” నాకు 8 ఏళ్ల వయసున్నప్పుడే మా అమ్మ చనిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్ళకు మా నాన్న కూడా చనిపోయాడు. అయితే ఈ విషయాన్ని నేను అగ్నిపరీక్ష కాంటెస్ట్ లో చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే సానుభూతితో ఓట్లు సంపాదించుకుంటుంది అనే మాటలు వినాల్సి వచ్చేది “అంటూ తెలిపింది.

అయినా ఆగని ట్రోల్స్..

Advertisement

మొత్తానికి అయితే తన జీవితంలో ఇంత నరకం అనుభవించిన ఈమె.. ఇప్పుడు ఎట్టకేలకు హౌస్ లోకి అడుగుపెట్టింది. ఇకపోతే సానుభూతి పొందడం ఇష్టం లేదని చెప్పిన ఈమె.. తన బాధను వెళ్ళబుచ్చినా సరే కొంతమంది ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు హౌస్ లోకి ఈ సానుభూతి వర్కౌట్ అవుతుందిలే అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా షాలిని పటేల్ జీవితంలో ఇంత విషాదం జరిగిందా అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related News

బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?

Ye devi varamo Neevu : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. హీరో అవుట్..

Podarillu Manisha : అమ్మబాబోయ్.. మనీష బాగా రిచ్.. హీరోయిన్ల కంటే ఎక్కువే..

Nindu Noorella Saavasam Serial Today Episode September 10th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ ఆత్మను వేరు చేసిన ప్రచండ 

సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. శుభం కార్డు పడుతుందా..?

Karthika Deepam 2 Serial Today Episode September 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఒకరినొకరు కొట్టుకున్న శివనారాయణ, దక్షిణమూర్తి      

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. బాలు దెబ్బకు గుణ ఫ్యూజుల్ అవుట్.. చివరిలో ట్విస్ట్..

Big Stories

Advertisement
×