E-Paper
Advertisement

Triple 200MP Camera Phone: ఫొటోగ్రఫీ పీక్స్.. 600MP కెమెరాలతో ఒప్పో అద్భుత ఫోన్.. శాంసంగ్, ఆపిల్‌కు షాక్

Triple 200MP Camera Phone: ఫొటోగ్రఫీ పీక్స్.. 600MP కెమెరాలతో ఒప్పో అద్భుత ఫోన్.. శాంసంగ్, ఆపిల్‌కు షాక్
Advertisement

Oppo Triple 200MP Camera| స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒప్పో కొత్త జనరేషన్ Find X సిరీస్ ఫోన్లు త్వరలో లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో మూడు మోడల్స్ ఉంటాయని సమాచారం. ఒప్పో Find X10, Find X10 Pro, Find X10 Pro Max. ఇంకా అధికారిక లాంచ్ డేట్ ప్రకటించలేదు. కానీ లీక్‌లు, రిపోర్టుల ద్వారా ఈ ఫోన్ల గురించి ఆసక్తికర వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రసిద్ధ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఇటీవల కెమెరా సెటప్ గురించి కొత్త సమాచారం షేర్ చేశాడు.

600MP కెమెరా.. ట్రిపుల్ 200MP సెటప్

లీక్ ప్రకారం Find X10 Pro Maxలో మూడు 200 మెగాపిక్సెల్ కెమెరాలు అంటే ఏకంగా 600MP కెమెరా ఉండవచ్చు. ఇదే నిజమైతే స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీలో అత్యంత పవర్‌ఫుల్ ఫోన్లలో ఒకటిగా మారవచ్చు. ఇంత హై-రిజల్యూషన్ కెమెరాలు ఇమేజ్ క్వాలిటీని చాలా మెరుగుపరుస్తాయి. ఫోటోగ్రఫీ ఔత్సాహికులను ఆకర్షించేందుకు ఒప్పో కెమెరా టెక్నాలజీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.

పెద్ద 200MP అల్ట్రా-వైడ్ సెన్సార్

Advertisement

లీక్‌లో ఉన్న వివరాల ప్రకారం.. ఒక 200 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ సైజు సుమారు 1/1.56 ఇంచ్‌లు ఉండవచ్చు. ఇది ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలోని చాలా అల్ట్రా-వైడ్ సెన్సార్ల కంటే పెద్దది. పెద్ద సెన్సార్ ఎక్కువ లైట్ తీసుకుంటుంది, ఫోటో క్వాలిటీ మెరుగవుతుంది. మరొక సెన్సార్ సైజు 1/1.3 ఇంచ్‌లు ఉండవచ్చని టిప్‌స్టర్ గతంలో చెప్పాడు. ఇవన్నీ ఒప్పో అడ్వాన్స్‌డ్ కెమెరా టెక్నాలజీపై పనిచేస్తున్నట్లు సూచిస్తున్నాయి.

అడ్వాన్స్‌డ్ ఇమేజింగ్ టెక్నాలజీ

ఈ సెన్సార్‌లో 4*4 RMSC టెక్నాలజీ ఉండవచ్చు. ఇది పిక్సెల్ కలర్ ఇన్ఫర్మేషన్‌ను మెరుగుపరుస్తుంది. UFCC టెక్నాలజీతో ఫుల్-కలర్ ఫోటోలు మెరుగవుతాయి. ఇవి కలర్ అక్యురసీ, డైనమిక్ రేంజ్‌ను పెంచుతాయి. బ్రైట్, డార్క్ ఏరియాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఫోటోలు మరింత నేచురల్‌గా, డీటెయిల్డ్‌గా వస్తాయి. అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్‌తో ఇమేజ్ క్వాలిటీ మరింత మెరుగవుతుంది.

200MP టెలిఫోటో లెన్స్ రూమర్

Advertisement

టెలిఫోటో లెన్స్ కూడా 200 మెగాపిక్సెల్ ఉండవచ్చని లీక్‌లు చెబుతున్నాయి. సెన్సార్ సైజు గురించి ఇంకా స్పష్టత లేదు. మాన్యుఫాక్చరర్ గురించి కూడా పూర్తి వివరాలు లేవు. ఈ కెమెరా సెటప్‌తో పవర్‌ఫుల్ జూమ్ ఫోటోగ్రఫీ సాధ్యమవుతుంది.

డైమెన్సిటీ 9600 ప్రాసెసర్ రూమర్

ఈ సిరీస్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9600 సిరీస్ ప్రాసెసర్ ఉండవచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. ఇది ఆ సిరీస్‌లో మొదటి స్మార్ట్‌ఫోన్ లైనప్ అవుతుంది. అయితే ఇది ఇంకా ధృవీకరించబడలేదు.

Also Read: బంగారం, విలువైన వస్తువులు బ్యాంక్‌లో పెడుతున్నారా? బ్యాంక్ లాకర్లు పూర్తిగా సురక్షితం కాదు.. ఎందుకంటే

ఒప్పో K14 5G భారత్‌లో లాంచ్

ఇంతలో ఒప్పో మరో ఫోన్ లాంచ్ చేయనుంది. ఒప్పో K14 5Gని మార్చి 9న భారత్‌లో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉంటుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉండవచ్చు. పెద్ద 7000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటాయి. 50MP మెయిన్ కెమెరా ఉంటుంది.

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×