E-Paper
Advertisement

Oppo Dual 200MP Camera: కెమెరా ఫోన్స్‌లో గేమ్ ఛేంజర్.. ఒప్పో కొత్త ఫ్లాగ్‌షిఫ్‌లో రెండు 200MP కెమెరాలు

Oppo Dual 200MP Camera: కెమెరా ఫోన్స్‌లో గేమ్ ఛేంజర్.. ఒప్పో కొత్త ఫ్లాగ్‌షిఫ్‌లో రెండు 200MP కెమెరాలు

Oppo Dual 200MP Camera| స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కెమెరా ఫీచర్ పరంగా చాలా బ్రాండ్స్ పోటీపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని టాప్ కంపెనీలు అడ్వాన్స్ లెన్స్ కెమెరాలు తమ ఫోన్స్‌లో తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పో తన తదుపరి ఫ్లాగ్‌షిప్ సిరీస్ ఫైండ్ X10ని(Oppo Find X10) సిద్ధం చేస్తోంది. తాజాగా వచ్చిన లీక్స్ ప్రకారం ఒప్పో ఇప్పటికే అంతర్గత టెస్టింగ్ ప్రారంభించింది.

ఈ సారి కెమెరా పర్‌ఫామెన్స్‌పై  ఎక్కువ దృష్టి పెట్టింది. ఫైండ్ X10 ప్రో మోడల్‌కు ఇప్పటివరకు లేనంత పెద్ద కెమెరా అప్‌గ్రేడ్ రావచ్చు. ఇదే నిజమైతే స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయవచ్చు.

కొత్త కెమెరా సిస్టమ్ టెస్టింగ్ జరుగుతోంది

చైనాలో ప్రసిద్ధ టిప్‌స్టర్ ఫ్రెష్ సమాచారం షేర్ చేశారు. ఒప్పో ఫైండ్ X10 సిరీస్ కోసం పూర్తిగా కొత్త కెమెరా కాన్ఫిగరేషన్ టెస్ట్ చేస్తోంది. ఇంజినీర్లు మెరుగైన ఇమేజ్ క్వాలిటీ కోసం అడ్వాన్స్‌డ్ హార్డ్‌వేర్ టెస్ట్ చేస్తున్నారు. టాప్ ఫ్లాగ్‌షిప్ రైవల్స్‌తో పోటీ పడేందుకు కెమెరా సిస్టమ్‌ను రీడిజైన్ చేయవచ్చు. ఫైండ్ X10 ప్రో మోడల్‌కు అతి పెద్ద మార్పులు రావచ్చు.

రెండు 200MP కెమెరాలు ప్రధాన హైలైట్

లీక్స్ ప్రకారం ఫైండ్ X10 ప్రోలో రెండు 200 మెగాపిక్సెల్ రియర్ కెమెరాలు ఉండవచ్చు. 200MP ప్రైమరీ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండవచ్చు. రెండూ పెద్ద 1/1.3 ఇంచ్ టైప్ సెన్సార్లను ఉపయోగించవచ్చు. పెద్ద సెన్సార్ల వల్ల ఎక్కువ లైట్, డీటెయిల్ క్యాప్చర్ అవుతుంది. లో-లైట్ ఫోటోగ్రఫీ చాలా మెరుగుపడుతుంది. జూమ్ చేసిన ఫోటోలు షార్ప్‌గా, డీటెయిల్‌గా వస్తాయి.

మునుపటి మోడల్ కంటే పెద్ద మెరుగుదల

ప్రస్తుత ఒప్పో ఫైండ్ X9 ప్రోలో 50MP ప్రైమరీ కెమెరా (1/1.28 ఇంచ్ సెన్సార్) ఉంది. టెలిఫోటో కెమెరా 200MP ఉంది కానీ చిన్న 1/1.56 ఇంచ్ సెన్సార్ మాత్రమే. ఫైండ్ X10 ప్రోలో టెలిఫోటో సెన్సార్ సైజ్ చాలా పెద్దదిగా అప్‌గ్రేడ్ అవుతుంది. పెద్ద టెలిఫోటో సెన్సార్ వల్ల నైట్ జూమ్ ఫోటోలు మెరుగవుతాయి. జూమ్ చేసిన ఇమేజ్‌లలో నాయిస్ కూడా తగ్గుతుంది.

కెమెరా పర్‌ఫామెన్స్ కొత్త స్టాండర్డ్ సెట్ చేయవచ్చు

లీక్ నిజమైతే.. ఒప్పో మొబైల్ కెమెరా ఇన్నోవేషన్‌లో ముందుండవచ్చు. రెండు 200MP కెమెరాలు స్మార్ట్‌ఫోన్లలో చాలా అరుదు. వైడ్, జూమ్ షాట్‌లలో బెటర్ డీటెయిలింగ్ ఇస్తాయి. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్లు ఈ సిస్టమ్‌ను ఇంప్రెసివ్‌గా భావిస్తారు. ఒప్పో ఎప్పటినుంచీ కెమెరా టెక్నాలజీపై బలంగా దృష్టి పెడుతోంది. ఫైండ్ X10 ప్రో ఆ సంప్రదాయాన్ని మరింత బలపరుస్తుంది.

ప్రాసెసర్, పర్‌ఫామెన్స్ వివరాలు

ఫైండ్ X10 సిరీస్ ఇతర స్పెసిఫికేషన్స్ గురించి పూర్తిగా వెల్లడికాలేదు. లీక్‌ల ప్రకారం.. మీడియాటెక్ డైమెన్సిటీ 9600 చిప్‌సెట్ ఉపయోగించవచ్చు. ఒప్పో తన ఫ్లాగ్‌షిప్‌లలో లేటెస్ట్ డైమెన్సిటీ ప్రాసెసర్లను ఉపయోగిస్తుంది. ఈ చిప్‌సెట్ బలమైన పర్‌ఫామెన్స్, మంచి బ్యాటరీ ఎఫిషియెన్సీ ఇస్తుంది. హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ సులభంగా జరుగుతాయి.

ఫైండ్ X9 ప్రో రిఫరెన్స్

ఒప్పో ఫైండ్ X9 ప్రోని నవంబర్ 2025లో భారతదేశంలో లాంచ్ చేసింది. ధర రూ.1,09,999 నుంచి మొదలైంది. హాసెల్‌బ్లాడ్ ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. పెద్ద 7,500mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

లాంచ్ టైమ్‌లైన్, అంచనాలు

రిపోర్టుల ప్రకారం.. ఫైండ్ X10 సిరీస్ ఈ సంవత్సరం చివర్లో లాంచ్ అవుతుంది. సెన్సార్ సైజ్‌లలో మార్పులు రావచ్చని లీక్‌లు చెబుతున్నాయి. ఫైనల్ హార్డ్‌వేర్ వివరాలు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒప్పో ఈ లీక్‌లపై అధికారికంగా ఏమీ చెప్పలేదు. అయినప్పటికీ ఫైండ్ X10 ప్రోపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×