E-Paper
Advertisement

OPPO Find X9 సిరీస్ ఊరమాస్ ఎంట్రీ.. ఐఫోన్ రేంజ్‌లో ఫీచర్లు, ధర తెలిస్తే మాత్రం కళ్లు మెలేస్తారు!

OPPO Find X9 సిరీస్ ఊరమాస్ ఎంట్రీ.. ఐఫోన్ రేంజ్‌లో ఫీచర్లు, ధర తెలిస్తే మాత్రం కళ్లు మెలేస్తారు!
Advertisement

OPPO Find X9 Series: స్మార్ట్‌ఫోన్ అంటే కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికే కాదు.. అదొక స్టైల్ స్టేట్‌మెంట్ అని నమ్మే వాళ్ల కోసం ఒప్పో ఒక అదిరిపోయే న్యూస్ చెప్పింది. తమ మోస్ట్ ప్రీమియం మోడల్ Find X9 సిరీస్‌ను మే 21న ఇండియాలో లాంచ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఇందులో Find X9s, Find X9 Ultra అనే రెండు పవర్‌ఫుల్ ఫోన్లను తీసుకొస్తోంది. మార్కెట్లో ఇప్పటికే పాతుకుపోయిన శాంసంగ్, వివో లాంటి బ్రాండ్లకు చుక్కలు చూపించడమే లక్ష్యంగా ఒప్పో ఈసారి గట్టిగానే ప్లాన్ చేసింది.

కెమెరా అంటే ఇదే మరి:

Find X9 Ultra గురించి చెప్పుకోవాలంటే ముందుగా దాని కెమెరా గురించే మాట్లాడాలి. దీనిలో ఏకంగా 200MP కెమెరాను పెడుతున్నారు. అంటే ఇక DSLR కెమెరాను మోయాల్సిన పనిలేకుండానే, ఫోన్‌తోనే ప్రొఫెషనల్ ఫొటోలు తీసేయొచ్చన్నమాట. దూరాన ఉన్న వస్తువులను కూడా అస్సలు క్లారిటీ తగ్గకుండా షూట్ చేయడానికి 10x జూమ్ ఫీచర్ ఇచ్చారు. ఇక నైట్ టైమ్ ఫొటోలు కూడా పగలు తీసినట్టే క్లియర్‌గా వచ్చేలా ఏఐ టెక్నాలజీని వాడారు. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేసేవాళ్లకైతే 8K వీడియో రికార్డింగ్ ఒక పెద్ద వరం అని చెప్పొచ్చు.

భారీ బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

ఇక Find X9s విషయానికి వస్తే.. ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా, చేతిలో ఇమిడిపోయేలా ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌ని వాడుతున్నారు కాబట్టి గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో 7000mAh బ్యాటరీ ఉంటుందట. జనరల్‌గా మనం వాడే ఫోన్లలో ఇంత పెద్ద బ్యాటరీ చూడటం కష్టం. దీంతో ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఇక రెండ్రోజుల వరకు ఛార్జర్ ఎక్కడుందో వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు.

Also Read: రూ.3 వేల నుంచే బ్రాండెడ్ టవర్ కూలర్లు.. ఏసీ అంత చల్లదనం, తక్కువ విద్యుత్ వినియోగం!

అంతా ఏఐ మాయ:

Advertisement

ఇప్పుడు ఎక్కడ చూసినా AI మాటే వినిపిస్తోంది కదా.. ఒప్పో కూడా అదే బాటలో నడుస్తోంది. ఈ ఫోన్లలో స్మార్ట్ ఏఐ ఫీచర్లను ఇస్తున్నారు. ఇవి మన అలవాట్లను బట్టి ఫోన్ పనితీరును మార్చేస్తాయి. ఫొటోలు ఎడిట్ చేయడం నుంచి ఫోన్ సెట్టింగ్స్ వరకు అన్నీ చాలా స్మార్ట్‌గా జరిగిపోతాయి. సింపుల్‌గా చెప్పాలంటే.. మీ ఫోన్ మీకంటే ముందే ఆలోచించి పనులు చక్కబెడుతుందన్నమాట.

ధరలు ఎలా ఉన్నాయంటే?

ఇన్ని ఫీచర్లు ఉన్నాక రేటు కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది మరి. Find X9 Ultra ధర సుమారు రూ.1.3 లక్షల వరకు ఉండొచ్చని టాక్. ఇక కొంచెం తక్కువలో కావాలనుకునే వారి కోసం Find X9s మోడల్ రూ.70,000 నుండి రూ.80,000 మధ్యలో అందుబాటులో ఉంటుంది. ఇవి లాంచ్ అయిన తర్వాత అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్లలో మనకు దొరుకుతాయి. ప్రీమియం ఫోన్ కొనాలనుకునే వాళ్లు మే 21 వరకు వెయిట్ చేయడం బెటర్ కదా.

Also Read: భారత్‌లో Realme 16T 5G లాంచ్ కన్ఫర్మ్.. దీని అత్యాధునిక ఫీచర్లు, బ్యాటరీ పవర్ తెలిస్తే ఎగరేసుకుపోతారు!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×