E-Paper
Advertisement

వీడు దొంగ కాదు.. టాలెంటెడ్! సెకన్లలో కుళాయి మాయం.. వీడియో వైరల్

వీడు దొంగ కాదు.. టాలెంటెడ్! సెకన్లలో కుళాయి మాయం.. వీడియో వైరల్
Advertisement

Temple Theft :ఎవరైనా డబ్బులు కొట్టేస్తారు, లేదంటే నగలు దొంగిలిస్తారు.కాదు కూడదంటే డ్రెస్సులో,షూసో,తినే ఫుడ్డో లేపేస్తుంటారు.కాని ఇక్కడ మీరు చూడబోతున్న దొంగతనం మాములు దొంగతనం కాదు. వెరీ చీప్ దొంగతనం .తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో బయట పడ్డ ఆ దొంగతనమే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతుంది.అదేంటంటారా.. అర్థరాత్రి సమయంలో టెంపుల్స్ లో ఉన్న నల్లాలని ( కుళాయి) లని కొట్టేయడం.

నల్లాని క్షణ కాలంలో విరగొట్టి

Advertisement

విషయంలోకి వెళ్తే …అది హాపూర్ జిల్లాలోని ఢిల్లీ రోడ్డు సమీపంలో ఉన్న ఒక పాతకాలం గుడి .అక్కడికి చాలా క్యాజువల్ గా ఒక ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేసే వ్యక్తి తన బైక్‌పై సరిగ్గా మిడ్ నైట్ ఒంటి గంటకి ఆ గుడి దగ్గరికి వచ్చాడు. ఎవరైనా చూస్తున్నారేమో అని అటూ ఇటూ చూసి తనలో ఉన్న మరో మనిషిని బయటపెట్టాడు.భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన నల్లాని క్షణ కాలంలో విరగొట్టి తన వెనకాల ఉన్న డెలివరీ బ్యాగ్ లో వేసుకొని జంప్ అయ్యాడు.

also read :యూట్యూబ్‌లో 3 కోట్లు.. రియాలిటీలో సున్నా! నెట్టింట వైరల్ అవుతున్న రాజశేఖర్ పంచ్‌లు

Advertisement

ఒక పావుగంట తర్వాత మరోసారి

అయితే అక్కడితో ఆగలేదండోయ్..ఇదేదో బాగుందే అనుకుంటూ ఒక పావుగంట తర్వాత మరోసారి అంటే దాదాపు 1:20 సమయంలో అక్కడికి మరోసారి వచ్చాడు.మొదటిది ఈజీగానే వచ్చిందిగా ఇదీ రాకపోతుందా అంటూ రెండో నల్లాని కూడా కొట్టేద్దామని గట్టిగానే ట్రై చేశాడు. కాని మనోడి బలం సరిపోలేదు..రెండోది రాలేదు.ఇక ఎంత ట్రై చేసినా రెండోది రాకపోవడంతో డిసప్పాయింట్ అయిపోయి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.

ఎంత పేదరికంలో ఉన్నాడో

ఇక ఈ వీడియో బయటికి రావడంతో దొంతనంపై రకరకాల కామెంట్స్ చేసుకుపోతున్నారు నెటిజన్లు.కొంతమంది కస్టమర్ ఫుడ్ తో పాటు నల్లా కూడా ఆర్డర్ చేశాడా అని సెటైర్లు వేస్తుంటే మరికొందరు నల్లాలు కొట్టేసేంత దీన స్థితిలో ఉన్నావా భయ్యా అంటూ మరికొంత మంది కామెంట్స్ వదులుతున్నారు.ఇంకొంత మంది అయితే పాపం నల్లాలని కొట్టేసున్నాడంటే ఎంత పేదరికంలో ఉన్నాడో అంటూ సానుభూతి చూపిస్తున్నారు.చూడాలి ముందు ముందు ఈ దొంగతనాలు ఇంకెంత చీప్ కి దిగాజారుతాయో !

also read :మైత్రీ వర్సెస్ దిల్ రాజు కోల్డ్ వార్.. బలైపోతున్నది ‘పెద్ది’ సినిమానేనా?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×