E-Paper
Advertisement

వన్‌ప్లస్ నుంచి క్రేజీ అప్డేట్ మావా.. ఈ కొత్త వాచ్ ధర, ఫీచర్లు తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే! 

వన్‌ప్లస్ నుంచి క్రేజీ అప్డేట్ మావా.. ఈ కొత్త వాచ్ ధర, ఫీచర్లు తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే! 
Advertisement

OnePlus Watch 4: స్మార్ట్‌వాచ్ అనగానే చాలామందికి గుర్తొచ్చే బ్రాండ్లలో వన్‌ప్లస్ ఒకటి. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి ‘వన్ ప్లస్ వాచ్ 4’ త్వరలో మార్కెట్లోకి రానుంది. గత కొద్దిరోజులుగా దీని గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నా.. తాజాగా వన్ ప్లస్ తన వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ వాచ్ ధర ఎంత? ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనేది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

3,000 నెట్స్ బ్రైట్‌నెస్..

ముందుగా దీని లుక్ గురించి చెప్పుకోవాలంటే.. టైటానియం అలాయ్ కేస్‌తో చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. దాదాపు 47 మిమీ సైజు ఉన్నా, బరువు మాత్రం కేవలం 43 గ్రాములే ఉంటుంది. దీంతో చేతికి పెట్టుకుంటే పెద్దగా బరువు అనిపించదు. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. గీతలు పడకుండా గట్టి గ్లాస్‌ను వాడారు. మామూలుగా లోపల ఉన్నప్పుడు బ్రైట్‌నెస్ సరిగ్గా ఉన్నా, మండుటెండలో స్పోర్ట్స్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపించేలా 3,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ పెరిగే ఫీచర్ ఇందులో ఉంది.

పాత ప్రాసెసరే కానీ..

Advertisement

సాధారణంగా కొత్త మోడల్ రాగానే కొత్త ప్రాసెసర్ ఉంటుందని అనుకుంటాం. కానీ వన్ ప్లస్ మాత్రం పాత వాచ్‌లలో వాడిన స్నాప్‌డ్రాగన్ డబ్ల్యూ 5 చిప్‌నే ఇందులోనూ కొనసాగించింది. దీనిలో 2GB RAM, 32GB మెమరీ ఇచ్చారు. ఇక బ్యాటరీ విషయంలో మాత్రం వన్ ప్లస్ అస్సలు తగ్గలేదు. హెవీగా వాడితే మూడు రోజులు.. అదే పవర్ సేవింగ్ మోడ్‌లో పెడితే ఏకంగా 16 రోజుల వరకు ఛార్జింగ్ వస్తుందని కంపెనీ చెబుతోంది.

Also Read: భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్.. OPPO Pad 5 Pro, Pad Mini ప్రత్యేకతలు ఇవే!

గూగుల్ జెమిని కూడా..

Advertisement

ఈ వాచ్‌లో అసలైన హైలైట్ ఏంటంటే దీని సాఫ్ట్‌వేర్. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే లేటెస్ట్ ‘వేర్ ఓఎస్ 6.0’తో వస్తున్న మొదటి వాచ్ ఇదే కావచ్చు. దీనివల్ల వాచ్ వాడటం చాలా స్మూత్‌గా ఉంటుంది. దీనికి తోడు గూగుల్ జెమిని ఏఐ ఫీచర్లు కూడా ఉండటంతో చాలా పనులు సింపుల్‌గా అయిపోతాయి. అలాగే నీళ్లు, దుమ్ము లోపలికి వెళ్లకుండా దీనికి ఐపి69 రేటింగ్ ఇచ్చారు.

ధర ఎంత ఉండొచ్చు?

ప్రస్తుతానికి ఇది ఎవర్ గ్రీన్ టైటానియం, మిడ్ నైట్ టైటానియం అనే రెండు రంగుల్లో దొరకనుంది. రేటు గురించి కంపెనీ ఇంకా చెప్పలేదు కానీ, పాత మోడల్ ధరను బట్టి చూస్తే రూ.30వేల లోపు ఉండొచ్చని అంచనా. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్, మంచి డిస్‌ప్లే, తక్కువ బరువు ఇవన్నీ చూస్తుంటే వన్ ప్లస్ ఫ్యాన్స్‌కు ఇది మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు. దీని సేల్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Also Read: గేమర్ల కోసం OnePlus సరికొత్త ప్రయోగం.. ఈ ఫోన్ కొంటే గేమింగ్ కన్సోల్‌ను ఫ్రీగా పట్టుకెళ్లొచ్చు!

Related News

బోస్ కొత్త ఇయర్‌బ‌డ్స్‌లో బిగ్ అప్‌గ్రేడ్.. మెరుగైన సౌండ్ నుంచి సినిమా మోడ్ వరకు

ఐఫోన్ డ్యుయో బదులు.. ఇవన్నీ కొనేయొచ్చు.. ఒక్కసారి ఈ లెక్క చూడండి!

లూనా బ్యాండ్ vs ఫిట్‌బిట్ ఎయిర్.. హెల్త్ ట్రాకింగ్‌లో దేని పనితీరు ఎలా ఉంటుందంటే?

PhonePe లేదా Google Payలో తప్పు నంబర్‌కు డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!

బడ్జెట్ ధరలో ఊహించని ఫీచర్లు..రూ.499లకే క్రేటోస్ పాప్ ఇయర్‌బడ్స్!

ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ..కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అదిరిపోయే ఫీచర్లు ఇవే!

పాకెట్ సైజులో పవర్ బ్యాంక్..నాయిస్ నుంచి అదిరిపోయే మోడల్!

లాంగ్ రోడ్ ట్రిప్‌లో పెట్రోల్ ఖర్చులు తగ్గించాలనుకుంటే.. ఈ 5 గాడ్జెట్లు వెంట పెట్టుకోండి!

Big Stories

Advertisement
×