E-Paper
Advertisement

Tamil Nadu Elections: బాబు ఏమో అటు.. ఆ పార్టీతో జతకట్టిన రోజా.. జగన్ రూటు ఎటు?

Tamil Nadu Elections: బాబు ఏమో అటు.. ఆ పార్టీతో జతకట్టిన రోజా.. జగన్ రూటు ఎటు?
Advertisement

Tamil Nadu Elections: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ప్రజలు.. రెండు పార్టీల (టీడీపీ, వైసీపీ) కేంద్రంగా నిలువునా చీలిపోయిన సంగతి తెలిసిందే. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య వైరం రాజకీయాలను దాటి వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోవడం ఇటీవల చూస్తూనే ఉన్నాం. వైసీపీ అధినేత జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినాయకుడు చంద్రబాబును జైల్లో పెట్టించడం.. టీడీపీ నేతృత్వంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో వైసీపీ నేతలను వరుస కేసులతో ఉక్కిబిక్కిరి చేయడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ-వైసీపీ మధ్య ఉన్న ఈ రాజకీయ శత్రుత్వం.. తాజాగా తమిళనాడుకు సైతం విస్తరించినట్లు కనిపిస్తోంది. ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ నేత చంద్రబాబుతో పాటు వైసీపీ అధినేత జగన్, రోజా తలో పార్టీకి మద్దతుగా నిలవడం రాజకీయంగా చర్చకు తావిస్తోంది.

ఎన్డీఏ చంద్రబాబు మద్దతు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) కూటమికి తన మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా కోయంబత్తూరులో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించారు. వాస్తవానికి డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో చంద్రబాబుకు సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు స్వయంగా హజరయ్యారు. అయితే ప్రస్తుతం ఎన్డీయేతో భాగస్వామ్యంలో ఉన్నందున కూటమి ధర్మాన్ని పాటిస్తూ చంద్రబాబు తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ భాగస్వామ్యంగా ఉన్న పార్టీలకు మద్దతు ప్రకటించారు. తమిళనాడు అభివృద్ధి ఎన్డీయేతోనే సాధ్యమని.. రాష్ట్రంలో భారీ మెజారిటీతో కూటమిని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కాగా, తమిళనాట పోటీ చేస్తున్న ఎన్డీయే కూటమిలో బీజేపీతో పాటు ఏఐడీఎంకే, పీఎంకే, ఏఎంఎంకే పార్టీలు ఉన్నాయి.

విజయ్ ర్యాలీలో జగన్ ఫోటో!

Advertisement

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల్లో సింగిల్ గా పోటీచేస్తున్నారు. తన తమిళగ వెట్రి కజగం (Tamilaga Vettri Kazhagam – TVK) పార్టీ తరపున ఆయన సీఎం అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే తాజాగా విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో.. వైసీపీ అధినేత జగన్ ఫొటో కనిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో తాను జగన్ తో దిగిన ఫొటోను విజయ్ స్వయంగా ఎన్నికల ర్యాలీలో ప్రదర్శించారు. దీంతో ఒక్కసారిగా టీవీకే పార్టీ శ్రేణులు కేరింతలు కొట్టారు. దీంతో  తమిళపోరులో జగన్ మోహన్ రెడ్డి మద్దతు విజయ్ కు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులు సైతం జగన్ ఫొటోను విజయ్ ప్రదర్శించడాన్ని నెట్టింట హైలెట్ చేస్తుండటంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. అయితే జగన్ మాత్రం ఇప్పటివరకూ అధికారికంగా దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.

రోజా మద్దతు ఎవరికంటే?

వైసీపీ మహిళా ముఖ్యనేత, మాజీ మంత్రి రోజా సైతం.. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. వాస్తవానికి రోజాకు తమిళనాడులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఏపీలో రాజకీయాల్లో ఆమె జగన్ వెంటే ఉన్నప్పటికీ.. తమిళనాడులో ఆమెకు సీఎం స్టాలిన్ పార్టీకి చెందిన డీఎంకే నేతలతో పాత పరిచయాలు ఉన్నాయి. సీఎం ఎంకే స్టాలిన్ ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నెలా రూ. 1000 ఆర్థిక సహాయం వంటి సంక్షేమ పథకాలను రోజా తన ప్రచారంలో హైలైట్ చేస్తున్నారు. మేనిఫెస్టోలో డీఎంకే ప్రకటించిన ప్రజాకర్షక హామీలను తమిళనాడు ఓటర్లకు వివరిస్తున్నారు. అయితే జగన్ ఫొటోను విజయ్ తన ఎన్నికల ప్రచారంలో ప్రదర్శించడం రోజాను సైతం ఆశ్చర్యపరిచే అవకాశముందని పార్టీ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ జగన్ విజయ్ కు మద్దతు ప్రకటిస్తే ఆమె.. డీఎంకేను కాదని కోలీవుడ్ స్టార్ కు మద్దతు ప్రకటిస్తారా? లేదా? అన్నది మరింత ఆసక్తి రేపుతోంది.

Advertisement

Also Read: ఏపీలో రాజ్యసభ ఎన్నికలపై చర్చ.. రాజ్యసభ రేసులో అన్నామలై పేరు.. ఏపీ నుంచి

గేమ్ ఛేంజర్లు అవుతారా?

ప్రస్తుతం ఏపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు తలో పార్టీకి మద్దతు ప్రకటించడంతో.. ఎన్నికలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న చర్చ ఏపీలో మెుదలైంది. సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా స్టార్ క్యాంపైనర్లుగా సినీ నటులు, కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు రంగంలోకి దిగడం సహజం. ఈసారి ఎన్డీయే తరపున స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగడం, జగన్ ఫొటోను విజయ్ తన ప్రచార సభలో వాడుకోవడం, సీఎం స్టాలిన్ నాయకత్వాన్ని రోజా బలపరుస్తుండటం తమిళనాడులోని ముక్కోణపు రాజకీయ పోటీని మరింత రసవత్తరంగా మార్చిందని చెప్పవచ్చు. వీరు తమ ఉనికితో తమిళనాడు ఎన్నికల ఫలితాలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తారన్నది త్వరలోనే తేలనుంది. కాగా, తమిళనాడు ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుండగా.. ఫలితాలు మే 3న విడుదల కానున్నాయి.

Also Read: ఆర్టీసీ కార్మికులకు మంత్రి సీతక్క ‘ఆత్మీయ పిలుపు’.. సమ్మె విరమించాలని విజ్ఞప్తి!

Related News

జనం చెవిలో నాడు పునరేకీకరణ పువ్వు! అదే బాటలో పయనించి నేడు కాంగ్రెస్‌ బొక్క బోర్లా..!

ఆస్తులు విశాలం.. భవంతులు సువిశాలం.. మనసులే ఇరుకిరుకు..!

శ్రీమంతుడు మా బాపు.. నడిమంతరపు సిరి నీది.. ఎప్పటికైనా సిరి సంపదలు మావి.. మా జాతే …!

టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన కొత్తలో విపరీతమైన పేదరికంలో కేసీఆర్.. అప్పుడు పది రూపాయల మిత్తీకి బాకీలు ఎందుకు చేసినట్టు..?

అన్ని విచారణలు ఓ లెక్క.. ఫామ్ హౌజ్ భూముల లెక్కలు ఓ లెక్క.. నిగ్గుతేల్చాల్సిందే..! లేకపోతే……

ఆయనో భూస్వామి..నువ్వో పెయింటర్‌.. రా భూముల లెక్కలు తేల్చుకుందాం..! కేటీఆర్‌ వీరావేశం..

కేసీఆర్‌కు సొంత ఇల్లు కూడా లేదు..కానీ ఆయన వందల ఎకరాలున్న కుటుంబంలో పుట్టారు!

రేవంత్‌ విప్పిన బీఆర్‌ఎస్‌ భూ బాగోతం చిట్టా! నిషేధిత భూములపై క్లారిటీ.. భూదోపిడీపై ఖుల్లం ఖుల్లా..!

Big Stories

Advertisement
×