E-Paper
Advertisement

Oppo 400MP Camera: ఇక ఫొటోగ్రఫీ కెమెరా అవసరం లేదు.. 400MP కెమెరా, 1.5k డిస్‌ప్లేతో ఓప్పో కొత్త ఫోన్

Oppo 400MP Camera: ఇక ఫొటోగ్రఫీ కెమెరా అవసరం లేదు.. 400MP కెమెరా, 1.5k డిస్‌ప్లేతో ఓప్పో కొత్త ఫోన్
Advertisement

Oppo Find X9s 400MP Camera| స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీ రంగంలో కెమెరా టెక్నాలజీ రోజురోజుకూ అనూహ్యంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కెమెరా పరంగా తమ కొత్త మోడల్స్ లో అడ్వాన్స్ కెమెరా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. తాజాగా చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఓప్పో త్వరలో 400MP కెమెరా తీసుకురాబోతోంది. అంతేకాదు అందులో భారీ బ్యాటరీతో పాటు స్మార్ట్ డిస్‌ప్లే కూడా ఉంటుంది.

ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. 2026 ప్రారంభంలో ఈ ఫోన్ లాంచ్ కావచ్చని తెలుస్తోంది. ఫైండ్ X9 సిరీస్‌లోని ఇతర మోడల్స్ కంటే ఇది చిన్నదిగా ఉంటుంది. ఓప్పో ఫైండ్ X8s లాగా కనిపించవచ్చు. ఓప్పో ఫైండ్ X9 ప్రోను నవంబర్‌లో స్టాండర్డ్ ఫైండ్ X9తో పాటు భారత్‌లో లాంచ్ చేసింది.

ఓప్పో ఫైండ్ X9s ఇండియా లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్లు లీక్

Advertisement

టిప్‌స్టర్ దేబయాన్ రాయ్ (@Gadgetsdata) ఎక్స్ పోస్ట్ ప్రకారం.. ఓప్పో ఫైండ్ X9s మార్చి 2026లో లాంచ్ అవుతుంది. భారత్‌లో కూడా విడుదల చేయవచ్చని చెప్పారు. కానీ కంపెనీ నుంచి అధికారిక సమాచారం లేదు కాబట్టి పూర్తిగా నమ్మకూడదు. గత మోడల్ ఫైండ్ X8s భారత్‌లో రాలేదు.

ఓప్పో ఫైండ్ X9sలో కాంపాక్ట్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్

ఓప్పో ఫైండ్ X9sలో 6.3 అంగుళాల AMOLED లేదా OLED డిస్‌ప్లే ఉండవచ్చు. 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. LTPS టెక్నాలజీ వల్ల ఫిక్స్‌డ్ రిఫ్రెష్ రేట్ మధ్య మారవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 9500+ చిప్‌సెట్‌తో ఫ్లాగ్‌షిప్ పనితీరు లభిస్తుంది.

ఫోన్‌లో రెండు 200MP కెమెరాలు

Advertisement

లీక్స్ ప్రకారం ఓప్పో ఫైండ్ X9sలో కొత్త రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉండవచ్చు. ఇది నిజమైతే ఫైండ్ X8sలోని హాసెల్‌బ్లాడ్ ట్యూన్డ్ ట్రిపుల్ 50MP సిస్టమ్ నుంచి పెద్ద మార్పు.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

ఫోన్‌లో 7000mAh పెద్ద బ్యాటరీ

ఓప్పో ఫైండ్ X9sలో 7000mAh బ్యాటరీ ఉండవచ్చు. 6.3 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఫోన్‌కు ఇది చాలా స్పెషల్. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండవచ్చు. ఫైండ్ X8sలో 5700mAh బ్యాటరీ ఉంది. ఇతర ఫీచర్లలో డిస్‌ప్లే కింద అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, మెటల్ ఫ్రేమ్, IP68 లేదా IP69 రేటింగ్ ఉన్నాయి.

భారత్‌లో కూడా ఫోన్ లాంచ్

ఓప్పో ఫైండ్ X9 సిరీస్‌లో ప్రస్తుతం ఫైండ్ X9, ఫైండ్ X9 ప్రో ఉన్నాయి. ఇవి నవంబర్ 18, 2025న భారత్‌లో లాంచ్ అయ్యాయి. గతంలో ఫైండ్ X8s భారత్‌లో రాలేదు కాబట్టి X9s లాంచ్ పై కూడా స్పష్టం లేదు.

Related News

పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

ఫోన్ కెమెరా బ్లర్‌గా ఉందా? వాటర్ మాయిశ్చర్ తొలగించే బెస్ట్ హ్యాక్స్!

120Hz డిస్‌ప్లే నిజంగానే ఎక్కువ ఛార్జింగ్ లాగేస్తుందా?అసలు నిజం ఇదే!

ఫోన్ ఛార్జింగ్ అవట్లేదా? ఈ చిన్న పొరపాట్లే USB పోర్ట్‌ను పాడుచేస్తాయి

ఆస్ట్రేలియాలో రాక్షస సాలీడు.. శాటిలైట్ ఫోటోతో అసలు సంగతి చెప్పేసి నాసా

వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!

ఒకప్పుడు భూమిపై అసలు ఆక్సిజనే ఉండేది కాదట, దీని పుట్టక భలే విచిత్రం

స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? డిజిటల్ డిటాక్స్ కోసం ఈ 5 మినీ గ్యాజెట్స్‌ను ట్రై చేయండి!

Big Stories

Advertisement
×