Naa Anveshana Arrest:ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తనకంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న యూట్యూబర్ అన్వేష్ అటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా మరింత పేరు దక్కించుకున్నారు. విదేశాలను చుట్టేస్తూ అక్కడి విషయాలను ఫాలోవర్స్ తో పంచుకునే ఈయన.. గత కొన్ని రోజులుగా వివాదాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా శివాజీ వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఇబ్బందుల్లో పడ్డ ఈయన..దీనికి తోడు గరికపాటి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. దీనిపై మండిపడ్డ ప్రవచనకర్త గరికపాటి టీం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. అన్వేష్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
అయితే అన్వేష్ అక్కడితో ఆగకుండా ఏకంగా ఇండియా పైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇండియాకి ఆడవాళ్లు వస్తే రే*ప్ అయిపోతున్నారు అంటూ ఇండియాని అత్యంత దారుణంగా తక్కువ చేసి మాట్లాడడం సంచలనంగా మారింది. అలాగే హిందూ దేవీదేవత మూర్తులైన సీత, ద్రౌపది వంటి వారిపై సగటు భారతీయుడు వినలేని పదజాలంతో మాటలు మాట్లాడి రెచ్చిపోయాడు. దీంతో కరాటే కళ్యాణి రంగంలోకి దిగింది. ఏకంగా హైదరాబాదులోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై కేసు పెట్టింది. ప్రస్తుతం ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
ALSO READ:Shahrukh Khan: షారుక్ ఒక దేశద్రోహి.. బహిష్కరించాలంటూ డిమాండ్!
కేస్ ఫైల్ చేసుకున్న పోలీసులు నా అన్వేషణ పేజ్ యూట్యూబర్ అన్వేష్ కేసులో దర్యాప్తు చేపట్టారు. హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చిక్కుల్లో ఇరుక్కున్న ఈయనపై ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇక దర్యాప్తు చేపట్టిన పంజాగుట్ట పోలీసులు ఇన్స్టాగ్రామ్ కు లేఖ రాశారు. వీడియో కంటెంట్ లింకు ఉన్న అన్వేష్ యూజర్ ఐడి వివరాలు ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక విదేశాల్లో ఉంటూ ఇష్టానుసారంగా వీడియోలు పోస్ట్ చేసిన అన్వేష్ పై హిందూ సంఘాలు కూడా రగిలిపోతున్నాయి. అటు ఇంస్టాగ్రామ్ నుండి రిప్లై కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. రిప్లై వచ్చిన వెంటనే అతడి పై యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే అన్వేష్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది అని చెప్పవచ్చు.