E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: ప్రజల కోసమైనా కేసీఆర్ మౌనం వీడాలి!

Kalvakuntla Kavitha: ప్రజల కోసమైనా కేసీఆర్ మౌనం వీడాలి!
Advertisement

Kalvakuntla Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీలో జరిగిన చిట్‌చాట్‌లో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఉరి తీయాల్సి వస్తే.. రేవంత్ రెడ్డిని ఒకసారి కాదు.. రెండుసార్లు ఉరి తీయాలని కవిత ఘాటుగా స్పందించారు. పాలమూరు ప్రాంతానికి రేవంత్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారని, ఉద్యమ నాయకులను పట్టుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు.

తాను తన ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3వ తేదీనే రాజీనామా లేఖ ఇచ్చానని కవిత వెల్లడించారు. అయితే, మండలిలో  చివరిసారిగా మాట్లాడేందుకు అనుమతి కోరానని, అందుకే ఛైర్మన్‌ను కలిసేందుకు వచ్చానని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడిన వారిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా చేయడం అన్యాయమని విమర్శించారు.

Advertisement

ప్రస్తుత రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా వచ్చి మాట్లాడితేనే బాగుంటుందని కవిత అభిప్రాయపడ్డారు. “ప్రజల కోసమైనా కేసీఆర్ ఒక క్లారిటీ ఇవ్వాలి. పిల్ల కాకుల మీద వదిలేస్తే వాళ్లకు ఏం తెలుస్తుంది?” అని పరోక్షంగా పార్టీలోని కొందరి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తెలంగాణ జాగృతి మళ్లీ యాక్టివ్ అయితే, బీఆర్ఎస్‌కు గడ్డుకాలం తప్పదని హెచ్చరించారు. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కేసీఆర్‌పైనే ఉందన్నారు.

Read Also: Telangana Assembly Sessions: మూసీ సుందరీకరణ.. బీఆర్ఎస్ ప్రశ్నలపై సీఎం రేవంత్ క్లారిటీ

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×