E-Paper
Advertisement

OPPO Find X9s – X9 Ultra: అధునాతన ఫీచర్లతో ఒప్పో కొత్త ఫోన్లు.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలు మీ కోసం..

OPPO Find X9s – X9 Ultra: అధునాతన ఫీచర్లతో ఒప్పో కొత్త ఫోన్లు.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలు మీ కోసం..
Advertisement

OPPO Find X9s – X9 Ultra: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో నుంచి రెండు కొత్త ఫోన్లు భారత మార్కెట్లోకి రానున్నాయి. ఈ క్రమంలో ఒప్పో Find X9s, ఒప్పో Find X9 Ultra స్మార్ట్‌ఫోన్‌లు ఒప్పో X సిరీస్ లైనప్‌లో వచ్చే ఏడాది(2026) ప్రారంభంలో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తాయని లీక్స్ సూచిస్తున్నాయి. హై-ఎండ్ Find X సిరీస్‌లో మరింత సరసమైన మోడల్‌గా ఉండే ఒప్పో Find X9s స్మార్ట్‌ఫోన్, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉండవచ్చు. అలాగే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9500+ SoC ప్రాసెసర్‌కు మద్ధతు ఇస్తుంది. రండి మరి.. ఒప్పో Find X9s – X9 Ultra ఫోన్‌ల ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం..

ఒప్పో ఫైండ్ X9s ఫీచర్లు:

ఒప్పో Find X9s స్మార్ట్‌ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.32-అంగుళాల 1.5K ఫ్లాట్ LTPS OLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9500+ SoC ప్రాసెసర్‌పై పనిచేస్తుందని లీక్స్ సూచిస్తున్నాయి. ఈ ఫోన్ OISతో ట్రిపుల్ 50MP వెనుక కెమెరా సెటప్, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండవచ్చు. దీనితో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో పెద్ద 10,000 ఎంఏహచ్ బ్యాటరీ ప్యాక్‌ లభిస్తుంది. ఒప్పో ఫైండ్ X9s ఫోన్.. ఆండ్రాయిడ్ v15 కలర్ఓఎస్ 15లో రన్ అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Read Also: అబ్బా ఏముంది హువావే మేట్‌ప్యాడ్ ఎడ్జ్.. 14.2 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరాలతో లాంచ్!

ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా ఫీచర్లు:

ఈ ఒప్పో Find X9 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ అగ్రశ్రేణి ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా లాంచ్ అవ్వనుంది. ఈ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.8-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే, 1440 × 3168 పిక్సెల్‌ల రిజల్యూషన్ వంటి అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంటుందని లీక్స్ సూచిస్తున్నాయి. ఇది ఫ్లాగ్‌షిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే ఈ ఒప్పో ఫైండ్ X9s అల్ట్రా క్వాడ్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

Advertisement

ఈ ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా ఫోన్‌లో 200MP ప్రధాన సెన్సార్ + 50MP అల్ట్రా-వైడ్ కెమెరా + డ్యూయల్ 50MP + 50MP టెలిఫోటో లెన్స్‌లు OISతో ఉంటాయి. దీంతో పాటు ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 125W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో భారీ 7000 mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 మీద రన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ IP68/IP69 డ్యూరబిలిటీ రేటింగ్‌ను కలిగి ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి.

Read Also: మరోసారి భారీ డిస్కౌంట్.. అమెజాన్‌ సేల్లో రూ.9వేల తగ్గింపుతో 5జీ ఫోన్!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×