E-Paper
Advertisement

Medchal News: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష.. రూ.5 లక్షల పరిహారం

Medchal News: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష..  రూ.5 లక్షల పరిహారం
Advertisement

Medchal News:  మేడ్చల్, స్వేచ్ఛ, బ్యూరో: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రూ.5,000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని జడ్జి కె వెంకటేష్ ఆదేశించారు. ప్రభుత్వ తరఫున న్యాయవాది ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, 2021లో నిందితుడు మైనర్ బాలికను బెదిరింపులకు గురిచేసి ముంబైకు తీసుకెళ్లి లైంగిక దుర్వినియోగానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

Also Read: Traffic Challans: ట్రాఫిక్ చలాన్లపై 80% డిస్కౌంట్.. ఇదీ అసలు మ్యాటర్!

నిందితుడిపై బాధితురాలి తండ్రి హత్య

Advertisement

నిందితుడు షేక్ నజీర్ అలియాస్ అమిత్. ప్రస్తుతం దుండిగల్ మండలం చర్చి గాగిల్లాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. స్వగ్రామం వికార్‌బాద్ జిల్లా యలాల్ మండలం విశ్వనాథ్‌పూర్ గ్రామమని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. విచారణలో సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో నిందితుడిపై బాధితురాలి తండ్రి హత్యకు సంబంధించిన మరో కేసు పెండింగ్‌లో ఉన్నట్లు ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

Also Read: Attack on Amazon Data Centre: అమెజాన్ క్లారిటీ.. గల్ఫ్‌లో డేటా సెంటర్లపై దాడులు నిజమే, కాకపోతే

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×