E-Paper
Advertisement

ఊహించని ఫీచర్లు.. ఏకంగా 8000mAh బ్యాటరీతో Oppo K15 లాంచ్, ధర ఎంతంటే?

ఊహించని ఫీచర్లు.. ఏకంగా 8000mAh బ్యాటరీతో Oppo K15 లాంచ్, ధర ఎంతంటే?
Advertisement

Oppo K15: బడ్జెట్ ధరలో మంచి ప్రీమియం లుక్ ఉన్న ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఒప్పో గుడ్ న్యూస్ చెప్పింది. తమ K సిరీస్‌లో భాగంగా Oppo K15 మోడల్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే లాంచ్ అయిన K15 Pro, Pro Plus మోడళ్లకు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో, ముఖ్యంగా ఊహించని రేంజ్ బ్యాటరీతో ఈ ఫోన్ టెక్ లవర్స్ దృష్టిని విపరీతంగా ఆకర్శిస్తోంది.

ధర ఎంతంటే?

ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనాలో అందుబాటులోకి వచ్చింది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉన్న ఏకైక వేరియంట్ ధరను రూ.33,000గా నిర్ణయించారు. గేల్ గ్రే, రాపిడ్ వైట్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో ఒప్పో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఇది విక్రయానికి సిద్ధంగా ఉంది.

Advertisement

Also Read: పవర్‌ఫుల్ ప్రాసెసర్లతో POCO F9 సిరీస్.. సర్టిఫికేషన్ సైట్లలో లీకైన వివరాలు ఇవే!

డిస్‌ప్లే, పనితీరు అదరహో..

ఈ ఫోన్ 6.59 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. స్క్రీన్ స్మూత్‌గా పనిచేయడానికి 120Hz రీఫ్రెష్ రేట్ ఇచ్చారు. ఎండలో చూసినా స్పష్టంగా కనిపించేలా బ్రైట్‌నెస్ అందించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16తో పనిచేసే ఈ ఫోన్‌లో గేమింగ్ ప్రియుల కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7360 సూపర్‌ ప్రొసెసర్‌ను వాడారు. ఫోన్ వేడెక్కకుండా కూలింగ్ సిస్టమ్ కూడా అమర్చడం విశేషం.

బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

Advertisement

ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం ఈ ఫోన్‌లో వెనుక వైపు రెండు 50MP కెమెరాలు ఇచ్చారు. ప్రధాన కెమెరాకు ఓఐఎస్ సపోర్ట్ ఉండటం వల్ల ఫొటోలు, వీడియోలు చాలా క్లారిటీగా వస్తాయి. అలాగే సెల్ఫీల కోసం కూడా 50MP ఫ్రంట్ కెమెరానే అందించడం ప్లస్ పాయింట్. ఇక ఈ ఫోన్ ప్రధాన హైలైట్ దీని 8,000mAh బ్యాటరీ. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ69 రేటింగ్ ఇవ్వడంతో నీటిలో పడినా భయం ఉండదు.

Also Read: బాక్స్ ఓపెన్ చేయగానే మైండ్ పోయింది.. ఐఫోన్ ప్లేస్‌లో ఆయిల్ డబ్బా, ఫ్లిప్‌కార్ట్‌కు ఇచ్చిపడేసిన కోర్టు!

Related News

మానవ వ్యర్థాలతో.. అత్యంత బలమైన కాంక్రీట్‌.. శాస్త్రవేత్తల నెవర్ బిఫోర్ ప్రయోగం!

జియో రూ.500 vs రూ.550 ప్లాన్స్.. ఉచిత ఓటీటీలు, అపరిమిత 5G.. యూజర్లకు పండగే!

ఖరీదైన గ్యాడ్జెట్లు అక్కర్లేదు.. 3D ప్రింటర్‌తో మీ హోమ్ థియేటర్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేసుకోండి!

సుప్రీంకోర్టులో Vi కి భారీ ఊరట.. రూ.363 కోట్ల జీఎస్టీ వివాదంలో కేంద్రానికి షాక్!

ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!

Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?

రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×