E-Paper
Advertisement

ఐఫోన్ లుక్‌లో ఒప్పో కొత్త ఫోన్.. Oppo Reno 16 అదిరిపోయే డిజైన్, ఫీచర్లు ఇవే!

ఐఫోన్ లుక్‌లో ఒప్పో కొత్త ఫోన్.. Oppo Reno 16 అదిరిపోయే డిజైన్, ఫీచర్లు ఇవే!
Advertisement

Oppo Reno 16 series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో, తన ప్రీమియం రెనో సిరీస్‌లో సరికొత్త మోడళ్లను ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. ఈ నెలాఖరున Oppo Reno 16, Oppo Reno 16 Pro స్మార్ట్‌ఫోన్‌లు అధికారికంగా మార్కెట్లోకి రానున్నాయి. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్ల కోసం ప్రీ-రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు కేవలం 1 యువాన్ (సుమారు రూ.11) చెల్లించి తమ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇలా ముందుగానే రిజర్వ్ చేసుకున్న వారికి దాదాపు 278 యువాన్ల విలువైన గిఫ్ట్ బాక్స్‌లు, అదనపు వారంటీ వంటి ప్రయోజనాలను ఒప్పో అందిస్తోంది.

అద్భుతమైన డిస్‌ప్లే, సరికొత్త డిజైన్:

ఒప్పో రెనో 16 సిరీస్ డిజైన్ పరంగా యూజర్లను ఆకట్టుకోనుంది.ముఖ్యంగా ప్రో వేరియంట్‌లో 6.78-అంగుళాల 1.5K LTPO OLED కర్వ్డ్ డిస్‌ప్లేను అమర్చినట్లు సమాచారం. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల స్క్రోలింగ్ , గేమింగ్ ఫీల్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఈసారి ఒప్పో తన ఫోన్లలో ఐఫోన్ తరహాలో ‘యాక్షన్ బటన్’ను ప్రవేశపెట్టబోతున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ బటన్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన షార్ట్‌కట్ యాప్స్‌ను కేవలం ఒక క్లిక్‌తో ఓపెన్ చేయవచ్చు.

Advertisement

పవర్ ఫుల్ ప్రాసెసర్, పర్ఫార్మెన్స్:
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే..ఈ మోడల్‌లో లేటెస్ట్ చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. ఇది ఫాస్ట్ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తద్వారా భారీ గేమింగ్, మల్టీ టాస్కింగ్‌ను సింపుల్‌గా హ్యాండిల్ చేయగలదు. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16.1 పై రన్ అవుతాయి. ఇందులో మెరుగైన ప్రైవసీ ఫీచర్లు , ఏఐ ఆధారిత ఆప్టిమైజేషన్లు ఉండనున్నాయి.

200MP కెమెరాతో ఫోటోగ్రఫీలో విప్లవం:
రెనో సిరీస్ ఎప్పుడూ కెమెరా ఫీచర్లకు పెట్టింది పేరు. ఈ క్రమంలోనే రెనో 16 ప్రోలో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను ఒప్పో అందిస్తోంది. దీంతో పాటు భారీ జూమింగ్ సామర్థ్యం కలిగిన పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కూడా యాడ్ చేయనున్నారు. ఇది దూరంగా ఉన్న వస్తువులను కూడా క్లారిటీ తగ్గకుండా షూట్ చేయడానికి ఉపయోగ పడుతుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP హై-రిజల్యూషన్ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇది వ్లాగర్లు , సోషల్ మీడియా ఎక్కువగా వాడే వారికి గొప్ప ఫీచర్ అని చెప్పవచ్చు.

Advertisement

Also Read: రాత్రి పూట ఏసీ టెంపరేచర్ ఇలా సెట్ చేస్తున్నారా? జాగ్రత్త!

భారీ బ్యాటరీ , ఫాస్ట్ ఛార్జింగ్ :
ప్రస్తుత కాలంలో యూజర్లు బ్యాటరీ లైఫ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఒప్పో రెనో 16 ప్రోలో ఏకంగా 7000mAh భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంత పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 100W సూపర్ వూక్ (SuperVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా యాడ్ చేయొచ్చు. దీనివల్ల ఫోన్ కేవలం 30-40 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్ అవుతుంది. బేస్ మోడల్ అయిన రెనో 16లో 6000mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది.

లాంచ్ , ధర అంచనా:
చైనాలో ఈ నెలాఖరున లాంచ్ అయినప్పటికీ.. ఇండియన్ మార్కెట్లోకి ఈ ఫోన్లు జూలై లేదా ఆగస్టు 2026 నాటికి వచ్చే అవకాశం ఉంది. భారత్‌లో ఒప్పో రెనో 16 సిరీస్ ధర సుమారు రూ.45,000 నుంచి రూ. 65,000 మధ్యలో ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లేటెస్ట్ కెమెరా, శక్తివంతమైన బ్యాటరీ, అదిరిపోయే డిజైన్‌తో వస్తున్న ఈ ఫోన్లు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో గట్టి పోటీనిచ్చేలా కనిపిస్తున్నాయి.

Related News

5 స్టార్ ఏసీ బెనిఫిట్స్, ఎక్కువ ధర పెట్టినా.. ఆ తర్వాత అంతా లాభమే!

కొత్త ఏసీ లేదా కూలర్ మెురాయిస్తోందా? రూపాయి ఖర్చు లేకుండా.. మరో ఏసీ, రూ.1 లక్ష పొందే ఛాన్స్!

iPhone 18 సిరీస్‌ కోసం క్రిస్మస్ వరకు ఆగాల్సిందేనా? యాపిల్ కొత్త రిలీజ్ క్యాలెండర్‌లో షాకింగ్ అప్డేట్స్!

కూలర్ గాలి ఏసీలా రావాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి.. మీ గది ఐస్‌లా మారిపోతుంది!

కారు,హోమ్ క్లీనింగ్ కోసం.. బెస్ట్ పోర్టబుల్ వైర్‌లెస్ వాక్యూమ్ క్లీనర్స్

ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ కూడా వేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే!

చేతితో పని లేకుండా ఇల్లు క్లీన్.. 2026లో ట్రెండింగ్‌లో ఉన్న రోబోట్ క్లీనర్స్!

BSNL కొత్త ప్లాన్ చూశారా? రూ.225 చెల్లిస్తే చాలు.. నెలంతా ఇక జాతరే!

Big Stories

Advertisement
×