E-Paper
Advertisement

వివాదంలో ‘కరుప్పు’ సినిమా.. ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన మూవీ టీం.. ఏం జరిగిందంటే?

వివాదంలో ‘కరుప్పు’ సినిమా.. ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన మూవీ టీం.. ఏం జరిగిందంటే?
Advertisement

Karuppu Controversy: సూర్య కథానాయకుడిగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘కరుప్పు’ (Karuppu) బాక్సాఫీస్ వద్ద రూ. 147 కోట్లకు పైగా వసూళ్లతో మంచి విజయాన్ని అందుకుంటోంది. అయితే, ఈ సినిమాలో సంగీత బ్రహ్మ ఇళయరాజా కాపీరైట్ వివాదాలను ఎగతాళి చేస్తూ పెట్టిన ఒక డైలాగ్ సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై ఇళయరాజా అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో చిత్ర నిర్మాతలు స్పందించి, క్షమాపణలులు తెలిపారు.

Read also-ఆ సాంగ్ కోసం మాధురి దీక్షిత్ పడిన కష్టం చూస్తే కన్నీళ్ళాగవు భయ్యా.. గర్భవతిగా ఉన్నా

అసలు వివాదం..

Advertisement

ఈ సినిమాలో 1985 నాటి ‘అలై ఓసై’ చిత్రంలోని ‘పోరాడడా’ అనే పాటను ఉపయోగించారు. ఆ పాట వచ్చిన వెంటనే ఇళయరాజా పేరు ప్రస్తావిస్తూ ఒక డైలాగ్ వస్తుంది. తమిళ సినిమాల్లో తన పాటలను అనుమతి లేకుండా వాడుకుంటే ఇళయరాజా లీగల్ నోటీసులు (కాపీరైట్ స్ట్రైక్స్) పంపడాన్ని ఉద్దేశించి వ్యంగ్యంగా (సెటైర్) ఈ డైలాగ్ రాశారు. ఇది ఇళయరాజాను అవమానించేలా ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

చిత్ర నిర్మాతల క్షమాపణలు

వివాదం ముదరడంతో ‘కరుప్పు’ చిత్ర నిర్మాణ సంస్థ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. త 50 ఏళ్లకు పైగా సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ఇళయరాజాని తక్కువ చేయాలనే ఉద్దేశం తమకు అస్సలు లేదని, ఆయనపై తమకు ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. ఆ సన్నివేశంలో ఇళయరాజా పేరును వాడటం కేవలం కథా సందర్భాన్ని వివరించడానికే తప్ప, ఆయనను వ్యక్తిగతంగా విమర్శించడానికి కాదని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ డైలాగ్ వల్ల ఇళయరాజాకి, ఆయన కుటుంబ సభ్యులకు లేదా ఆయన అభిమానుల మనోభావాలు దెబ్బతిని ఉంటే.. హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నామని ప్రకటించారు.

Advertisement

Read also-నా క్లిప్స్ పోర్న్ సైట్‌లో పెట్టి.. ఆ చేదు జ్ఞాపకాలపై నోరు విప్పిన రాజశ్రీ దేశ్‌పాండే!

ఇళయరాజా గారి భావాలను గౌరవిస్తూ, ఈ వివాదానికి ముగింపు పలకడానికి ‘కరుప్పు’ చిత్రబృందం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో థియేటర్లలో ప్రదర్శించే వెర్షన్లలో, ఓటీటీ, శాటిలైట్ వంటి తదుపరి ప్రసారాల్లో ఆ వివాదాస్పద డైలాగ్‌ను పూర్తిగా తొలగించనున్నట్లు లేదా మార్చనున్నట్లు నిర్మాతలు హామీ ఇచ్చారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ ‘కరుప్పు’ సినిమాలో సూర్యతో పాటు త్రిష, ఇంద్రన్స్, అనఘా మాయా రవి ముఖ్య పాత్రలు పోషించారు. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×