E-Paper
Advertisement

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!
Advertisement

Railway Travel Insurance: సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇకపై రైల్వే స్టేషన్‌ కౌంటర్లలో తీసే ఆఫ్‌లైన్ రైలు టిక్కెట్లకు కూడా ప్రయాణ బీమా వర్తింపజేయాలని భారతీయ రైల్వేను ఆదేశించింది. ఈ ఆదేశాలు 2026 అక్టోబరు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఆన్‌లైన్‌ రిజర్వేషన్ల తరహాలోనే ఆఫ్‌లైన్ ప్రయాణికులకు కూడా బీమా రక్షణ లభించనుంది.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం..

ఒడిశాలో 2023 జూన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తర్వాత దాఖలైన భద్రతా పిటిషన్‌పై జస్టిస్ అహ్సానొద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్.మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం అక్టోబరు 6న ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఆఫ్‌లైన్ ప్రయాణికులకు బీమా కల్పించేందుకు రైల్వే శాఖకు తగినంత సమయం ఇచ్చినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సారి కచ్చితంగా అమలు చేయాల్సిందేనని, విఫలమైతే రైల్వే బోర్డే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.

పాలసీబజార్ ట్రావెల్ ఇన్సూరెన్స్

Advertisement

మరోవైపు కోర్టు తీర్పును స్వాగతిస్తూ పాలసీబజార్ ట్రావెల్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ మానస్ కపూర్ మాట్లాడారు. ‘ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఏదో అదనపు ఆప్షన్ మాత్రమే కాదని, అదొక అత్యవసర రక్షణ అని ఈ తీర్పు నిరూపించింది. రైల్వేలపై ఆధారపడే కోట్లాది మంది సామాన్యులకు తక్కువ ప్రీమియంతో బీమా రక్షణ లభించడం వల్ల అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఆసరా లభిస్తుంది’ అని పేర్కొన్నారు.

ప్రయాణికులకు ఎంత బీమా లభిస్తుంది?

ప్రస్తుతం రైళ్లలో ఆన్‌లైన్‌ టికెట్లపై అమల్లో ఉన్న బీమా పథకం ప్రకారం ప్రయాణంలో ప్రమాదాలు జరిగితే గరిష్టంగా రూ.10 లక్షల వరకు బీమా పరిహారం అందనుంది. వైకల్య తీవ్రతను బట్టి నిర్దిష్ట మొత్తంలో పరిహారం అందనుంది. గాయాల పాలై ఆసుపత్రి చేరితే వైద్య ఖర్చుల నిమిత్తం కొంత మొత్తం కవరేజ్ లభిస్తుంది. అయితే స్టేషన్ కౌంటర్లలో కొనే ఆఫ్‌లైన్ టిక్కెట్లకు సంబంధించి పాలసీ జారీ చేయడం, నిర్వహించడం ఎలా ఉంటుందో రైల్వే శాఖ త్వరలోనే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Advertisement

Also Read: లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

ఆఫ్‌లైన్ బీమా కోసం అదనంగా డబ్బులు చెల్లించాలా?

ప్రస్తుత ఆన్‌లైన్ విధానంలో బీమా అనేది ప్రయాణికుడి ఇష్టం పై ఆధారపడి ఉంటుంది. దీనికి పన్నులతో కలిపి ప్రయాణికుడికి కేవలం 45 పైసలు మాత్రమే వసూలు చేస్తున్నారు. ప్రయాణికులు బుకింగ్ సమయంలో ఈ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆఫ్‌లైన్ టిక్కెట్లకు కూడా బీమా అందించాలని చెప్పినప్పటికీ కౌంటర్ వద్ద ఈ రుసుమును టిక్కెట్ ధరలోనే కలిపి వసూలు చేస్తారా? లేదా ప్రయాణికుడి నుంచి విడిగా ప్రీమియం తీసుకుంటారా అనేది రైల్వే శాఖ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించాల్సి ఉంది.

Also Read: రిపోర్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. రూ.12 లక్షలు ఇచ్చి ఆదుకున్న బిగ్ టీవీ ఛైర్మన్.. సర్వత్రా ప్రశంసలు!

Tags

Related News

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

మొబైల్ కొట్టేయబోతే.. ప్రాణాల మీదికి వచ్చింది.. రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన!

రైలు ప్రయాణంలో నవరాత్రి జోష్.. లోకల్ ట్రైన్‌లో మహిళల ‘గర్భా’ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

సినిమా చూస్తూ ఆటో డ్రైవింగ్.. డ్రైవర్‌పై సీపీ సజ్జనార్ సీరియస్!

భక్తుల కోసం టీటీడీ కొత్త యాప్.. ‘వేంకటాద్రి’ ప్రత్యేకతలు ఇవే!

బీహార్ యువకుడితో రష్యా యువతి ప్రేమ.. గుడిసెలోనే ఉంటానంటూ ఇండియాకు వచ్చేసి..

ఎయిరిండియా విమానానికి హైజాక్ ముప్పు.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలు ఏం జరిగింది?

Big Stories

Advertisement
×