E-Paper
Advertisement

ఇంటర్నెట్ లేకపోయినా UPI పేమెంట్.. PhonePe తీసుకొచ్చిన ఈ సదుపాయం గురించి తెలుసా?

ఇంటర్నెట్ లేకపోయినా UPI పేమెంట్.. PhonePe తీసుకొచ్చిన ఈ సదుపాయం గురించి తెలుసా?
Advertisement

UPI Payments: స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ లేకపోయినా డిజిటల్ చెల్లింపులు చేయాలనుకునే ఫీచర్ ఫోన్ వినియోగదారులకు PhonePe కొత్త మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. UPI 123Pay ద్వారా మొబైల్ నంబర్, UPI ID లేదా QR కోడ్ ఉపయోగించి డబ్బు పంపుకోవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం పరిమితంగా ఉండే ప్రాంతాల్లో ఇది ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. దేశంలో 20 కోట్లకు పైగా ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఈ సేవ ఉపయోగపడుతుందని ఫోన్‌పే చెబుతోంది.

ఫీచర్ ఫోన్‌లోనే UPI రిజిస్ట్రేషన్:

UPI 123Pay కోసం స్మార్ట్‌ఫోన్ లేదా యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. సపోర్ట్ చేసే ఫీచర్ ఫోన్‌లో ఫోన్‌పే యాప్‌ను తెరిచి నిబంధనలను అంగీకరించిన తర్వాత బ్యాంక్ ఖాతాను ఎంచుకోవాలి. అనంతరం డెబిట్ కార్డు చివరి ఆరు అంకెలు, గడువు తేదీని నమోదు చేసి అవసరమైన ధృవీకరణ పూర్తి చేయాలి. తర్వాత UPI PIN సెట్ చేసుకుంటే UPI ID యాక్టివ్ అవుతుంది.

Advertisement

Also Read: ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

మొబైల్ నంబర్ లేదా UPI IDతో చెల్లింపు:

ఫోన్‌పేలో మొబైల్ నంబర్ లేదా యూపీఐ ఐడీ ద్వారా డబ్బు పంపవచ్చు. ముందుగా రిసీవర్ వివరాలను నమోదు చేసి.. పేరు, ఇతర వివరాలను పరిశీలించిన తర్వాత చెల్లించాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేయాలి. తర్వాత యూపీఐ పిన్ నమోదు చేసి నిర్ధారించిన వెంటనే లావాదేవీ పూర్తవుతుంది. కెమెరా ఉన్న ఫీచర్ ఫోన్లలో సపోర్ట్ చేసే QR కోడ్‌ను స్కాన్ చేసి స్కాన్ అండ్ పే ద్వారా కూడా చెల్లించవచ్చు.

మరిన్ని ఫోన్లకు సేవ విస్తరణ:

Advertisement

ఫోన్‌పే ఇప్పటికే Nokia, HMD, Lava International, Itel Mobile వంటి సంస్థలతో కలిసి UPI 123Payను సపోర్ట్ చేసే ఫీచర్ ఫోన్లలో అందిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని తయారీదారులకు సేవను విస్తరించే ప్రణాళిక ఉంది. బిల్ చెల్లింపులు, మొబైల్ రీచార్జ్‌లు, ఆధార్ ద్వారా యూపీఐ రిజిస్ట్రేషన్ వంటి సదుపాయాలను కూడా భవిష్యత్తులో తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.

AI వాయిస్ హెల్ప్‌లైన్ కూడా:

రిజిస్ట్రేషన్, యూపీఐకి సంబంధించిన సందేహాల కోసం ఫోన్‌పే ఏఐ ఆధారిత వాయిస్ హెల్ప్‌లైన్‌ను కూడా అందిస్తోంది. ఇది ఇంగ్లీష్‌తో పాటు 12 భారతీయ భాషల్లో సహాయం చేస్తుంది. సాధారణ IVRలా కేవలం నంబర్లు నొక్కమని చెప్పకుండా.. వినియోగదారులతో మాట్లాడి అవసరమైన దశలను వివరించేలా ఈ సేవను రూపొందించారు. ఇంటర్నెట్ అందుబాటులో లేని ప్రాంతాల్లో ఫీచర్ ఫోన్ వినియోగదారులకు UPI చెల్లింపులను సులభతరం చేయడమే 123Pay ప్రధాన లక్ష్యం.

Also Read: స్క్రీన్ లేకుండానే ఇన్ని పనులా? URBAN ARC NOTE AI బ్యాండ్ ఫీచర్లు ఇవే!

Tags

Related News

స్టూడెంట్స్, ఆఫీస్ వర్క్‌కు బెస్ట్.. ల్యాప్‌టాప్‌కు ప్రత్యామ్నాయంగా 5 బడ్జెట్ టాబ్లెట్స్!

స్క్రీన్ లేకుండానే ఇన్ని పనులా? URBAN ARC NOTE AI బ్యాండ్ ఫీచర్లు ఇవే!

చెత్తలో పడేసే ప్లాస్టిక్ బాటిళ్లతో.. అద్భుతమైన ఇల్లు.. కెనడా బిల్డర్ల క్రేజీ ఆవిష్కరణ!

సాధారణ ఫ్యాన్ vs బీఎల్‌డీసీ.. రెండింటికి తేడా ఏంటి? పవర్ ఆదాకు ఏది పర్ఫెక్ట్?

రూ.2,390లకే డైమండ్ కట్ డిజైన్ స్మార్ట్‌వాచ్..పెబుల్ వియన్నా స్పెషల్ లుక్!

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..4 మైక్ ENC ఫీచర్‌తో కొత్త బౌల్ట్ ఇయర్‌బడ్స్!

క్యాబేజీ, పండ్ల తొక్కలతో నివాసాలు.. ఉంటే నీడ, తింటే ఆహారం.. ఇదెక్కడి టెక్నాలజీ సామీ!

Big Stories

Advertisement
×