E-Paper
Advertisement

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!
Advertisement

Play Store: సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ప్లే స్టోర్ ఓపెన్ చేసి నచ్చిన యాప్ కనిపించగానే Installపై క్లిక్ చేయడం చాలామందికి అలవాటే. రేటింగ్ బాగుందా? ఎవరు తయారు చేశారు? మన ఫోన్‌లోని ఏ సమాచారాన్ని యాప్ యాక్సెస్ చేస్తుంది? అనే విషయాలు మాత్రం పెద్దగా పట్టించుకోం. కానీ ఇదే చిన్న నిర్లక్ష్యం తర్వాత ఇబ్బందిగా మారొచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసే ముందు కేవలం ఒక్క నిమిషం కొన్ని వివరాలు చెక్ చేస్తే మన ఫోన్‌తో పాటు వ్యక్తిగత సమాచారం కూడా సురక్షితంగా ఉంటుంది. ఇంతకీ యాప్ ఇన్‌స్టాల్ చేసే ముందు ఏయే విషయాలు చూడాలంటే?

డెవలపర్ పేరు..

యాప్‌ను ఎవరు తయారు చేశారో ముందుగా చూడాలి. ప్రముఖ కంపెనీల పేర్లను పోలి ఉండే యాప్‌లు కూడా ఉండొచ్చు. అందుకే డెవలపర్ పేరు, కంపెనీ వివరాలు సరిగ్గా ఉన్నాయా అని పరిశీలించాలి. ముఖ్యంగా బ్యాంకింగ్, షాపింగ్ వంటి యాప్‌ల విషయంలో ఇది చాలా ముఖ్యం.

రేటింగ్, రివ్యూలు..

Advertisement

యాప్‌కు ఎన్ని స్టార్ రేటింగ్‌లు వచ్చాయో చూడటంతో పాటు రివ్యూలను కూడా చదవాలి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన రివ్యూలపై దృష్టి పెట్టాలి. యాప్‌లో సమస్యలు, ఎక్కువ ప్రకటనలు లేదా ఇతర ఇబ్బందులు ఉన్నాయని చాలామంది చెబుతున్నట్లయితే ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు ఆలోచించాలి.

Also Read: Vivo X500 Pro Max వచ్చేస్తోంది.. 200MP కెమెరా, భారీ డిస్‌ప్లేతో అదరగొట్టే ఫీచర్లు!

డేటా వివరాలు..

Advertisement

Play Storeలోని Data safety విభాగంలో యాప్ ఏ సమాచారాన్ని సేకరిస్తుంది? దాన్ని ఎలా ఉపయోగిస్తుంది? అనే వివరాలు ఉంటాయి. యాప్ మన వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుంటుందా, ఇతర సంస్థలతో పంచుకుంటుందా అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసే ముందు ఈ వివరాలను తప్పక చూడాలి.

అనుమతులు..

యాప్ అడిగే అనుమతులు కూడా చాలా ముఖ్యమైనవి. కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్, కాంటాక్ట్స్ వంటి వాటికి యాప్ ఎందుకు అనుమతి అడుగుతోందో ఆలోచించాలి. యాప్ పని చేయడానికి అవసరం లేని అనుమతులు అడిగితే జాగ్రత్తగా ఉండాలి.

అప్‌డేట్, పాలసీ..

యాప్ చివరిసారిగా ఎప్పుడు అప్‌డేట్ అయిందో చూడాలి. చాలా కాలంగా అప్‌డేట్ కాని యాప్‌ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. అలాగే Privacy Policy ఉందా, అందులో డేటాను ఎలా ఉపయోగిస్తామని స్పష్టంగా చెప్పారో పరిశీలించాలి. ఈ వివరాలు చూసిన తర్వాతే యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం మంచిది.

Also Read: 5 ఏళ్ల తర్వాత కూడా 80% బ్యాటరీ కెపాసిటీ.. Honor 600S 5Gలో మరెన్నో అదిరిపోయే ఫీచర్లు!

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×