E-Paper
Advertisement

OTT Movie : కేరళ స్టేట్ అవార్డు విన్నింగ్ సినిమాతో సహా ఈ వారం ఓటీటీలో చూడాల్సిన మలయాళం సినిమాలు

OTT Movie : కేరళ స్టేట్ అవార్డు విన్నింగ్ సినిమాతో సహా ఈ వారం ఓటీటీలో చూడాల్సిన మలయాళం సినిమాలు
Advertisement

OTT Movie : ఓటీటీలో కొత్త రిలీజ్ లు వస్తూనే ఉన్నాయి. వీటిలో ముందుగా మలయాళం సినిమాలనే సెర్చ్ చస్తున్నారు ఆడియన్స్. రీసెంట్ గా వచ్చిన ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన ‘డైస్ ఇరే’ మూవీని జియోహాట్ స్టార్ లో తెగ చూస్తున్నారు ఆడియన్స్. అలాగే మరిన్ని మలయాళం సినిమాల ఈ వారం ఓటీటీలోకి రాబోతున్నాయి. వీటిలో కేరళ బెస్ట్ స్టేట్ అవార్డ్ ఫిల్మ్ కూడా ఉంది. అదిరిపోయే థ్రిల్లర్లు కూడా ఉన్నాయి. మరి ఈ సినిమాలు ఎక్కడ ? ఎప్పుడు ? స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం పదండి.

‘ఫెమినిచి ఫాతిమా’

ఈ కథ కేరళలోని ఒక ముస్లిం కుటుంబంలో ఉండే ఫతీమా అనే మహిళ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆమెకి ఇంటి పనులు, భర్త ,తప్ప మరో లోకం తెలీదు. అయితే ఒక రోజు ఇంట్లో పరుపు పాడవడంతో కొత్త పరుపును కొనే క్రమంలో స్టోరీ ఆసక్తికరంగా నడుస్తుంది. ఇది విమెన్ ఎంపౌర్మెంట్ వంటి అంశాలను బలంగా చూపిస్తుంది. డెబ్యూ డైరెక్టర్ ఫసిల్ ముహమ్మద్ ఈ సోషల్ డ్రామాను సున్నితంగా తెరకెక్కించారు. ఇది 2024లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ (IFFK)లో అవార్డులు సాధించి, అక్టోబర్ 2025లో థియేటర్లలో విడుదలైంది. 55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో సెకండ్ బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్ట్రెస్ (షమ్లా హమ్జా), బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డులను గెలుచుకుంది. ఈ మూవీ మనోరమా మాక్స్ (Manorama Max)లో 2025 డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

‘ఫార్మా’

Advertisement

పిఆర్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫార్మా వెబ్ సిరీస్ తో నవిన్ పౌలీ ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ థ్రిల్లర్ లో రజిత్ కపూర్, నారాయణ్, శృతి రామచంద్రన్, వీణా నందకుమార్, ముత్తుమణి వంటి నటులు నటించారు. మలయాళంతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, తెలుగు భాషల్లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. జియోహాట్ స్టార్ లో డిసెంబర్ 19 నుంచి ఇది అందుబాటులోకి రానుంది.

Read Also : ఈ ఫ్యామిలిలో అందరూ తోపులే… టచ్ చేస్తే తోలు తీసుడే… ఈ కొరియన్ సినిమాను తెలుగులోనూ చూడొచ్చు

‘అంధకార’

Advertisement

గత ఏడాది థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 21 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ మలయాళ సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ కేక పెట్టిస్తాయి. ఒక డాక్టర్ అవయవ అక్రమ రవాణా కోసం దివ్యాంగుడైన ట్యాక్సీ డ్రైవర్ ను వాడుకుంటుంది. ఈ క్రమంలో ఆ లేడీ డాక్టర్ పై మరో ముఠా దాడి చేసింది. అప్పుడు ట్యాక్సీ డ్రైవర్ ను ఇరికించి ఆమె తప్పించుకుంటుంది. ఆ తరువాత ఈ ట్యాక్సీ డ్రైవర్ ఆ మాఫియా ముఠాతో ఎలా రివేంజ్ తీర్చుకున్నాడనేదే ఈ కథ. ఈ సినిమా సన్ నెక్ట్స్ లో డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

 

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×