E-Paper
Advertisement

Portronics Adapto 100D: కేబుల్స్ చిక్కుముడి సమస్య ఇక ఉండదు.. ఒకేసారి 4 డివైజ్‌లు ఛార్జ్ చేసే చిన్న అడాప్టర్.. LCD డిస్‌ప్లే కూడా

Portronics Adapto 100D: కేబుల్స్ చిక్కుముడి సమస్య ఇక ఉండదు.. ఒకేసారి 4 డివైజ్‌లు ఛార్జ్ చేసే చిన్న అడాప్టర్.. LCD డిస్‌ప్లే కూడా
Advertisement

Portronics Adapto 100D| ఆఫీసు లేదా ఇంట్లో కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌, టివిల వద్ద చార్జర్లు, కేబుల్స్ ఎక్కువగా ఉంటే గందరగోళం సృష్టిస్తాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి పోర్ట్రానిక్స్ కొత్త ఛార్జర్ తీసుకొచ్చింది. భారత్‌లో పోర్ట్రానిక్స్ అడాప్టో 100D డెస్క్‌టాప్ ఛార్జర్‌ను లాంచ్ చేసింది. ఈ చిన్న ఛార్జర్ ఒకేసారి ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, టాబ్‌లెట్, ఇతర పరికరాలను ఛార్జ్ చేయగలదు. ఆధునిక ఆఫీస్, హోమ్ ఆఫీస్ యూజర్ల కోసం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ధర, లభ్యత

పోర్ట్రానిక్స్ అడాప్టో 100D ధర రూ.3,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది ప్రారంభ ఆఫర్ ధర. పోర్ట్రానిక్స్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఛార్జర్ లభిస్తుంది. కొన్ని ఆఫ్‌లైన్ దుకాణాల్లో కూడా అందుబాటులో ఉంది. ఉత్పత్తితో వారంటీ కూడా లభిస్తుంది.

పవర్‌ఫుల్ ఔట్‌పుట్, మల్టీ పోర్ట్ సిస్టమ్

Advertisement

ఈ ఛార్జర్‌లో మొత్తం ఐదు ఛార్జింగ్ పోర్టులు ఉన్నాయి. మూడు USB Type-C Power Delivery పోర్టులు, రెండు సాధారణ USB-A పోర్టులు ఉన్నాయి. గరిష్టంగా 100 వాట్స్ పవర్ ఇస్తుంది. దీంతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ల్యాప్‌టాప్‌లు వేగంగా ఛార్జ్ అవుతాయి. స్మార్ట్‌ఫోన్లు, టాబ్‌లెట్లు కూడా త్వరగా ఛార్జ్ అవుతాయి. ఒకేసారి ఎక్కవ పరికరాలను ఛార్జ్ చేయవచ్చు.

స్మార్ట్ పవర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్

ఛార్జర్‌లో ఇంటెలిజెంట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది. దీనివల్ల కనెక్ట్ చేసిన పరికరాలకు సురక్షితంగా, అవసరమైన పవర్ సరిగ్గా విడుదల అవుతుంది. ఓవర్‌లోడింగ్ లేదా తక్కువ ఛార్జింగ్ సమస్య ఉండదు. పరికరాల అవసరాలకు అనుగుణంగా ఆటోమేటిక్‌గా పవర్ సర్దుబాటు అవుతుంది.

స్మార్ట్ LCD డిస్‌ప్లే

Advertisement

ఈ ఛార్జర్‌లో ప్రత్యేకమైన స్మార్ట్ LCD డిస్‌ప్లే ఉంది. ఇది రియల్-టైమ్‌లో ఛార్జింగ్ సమాచారాన్ని చూపిస్తుంది. వోల్టేజ్, వాటేజ్ వివరాలు సులభంగా తెలుస్తాయి. ఏ పరికరం ఎంత పవర్ తీసుకుంటోందో కూడా డిస్‌ప్లేలో కనిపిస్తుంది. ఇది యూజర్లకు ఛార్జింగ్ ప్రాసెస్‌ను సులభంగా ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది.

GaN టెక్నాలజీతో ఎఫిషియెన్సీ

అడాప్టో 100Dలో గాలియం నైట్రైడ్ (GaN) టెక్నాలజీ ఉపయోగించారు. దీనివల్ల ఎనర్జీ ఎఫిషియెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఛార్జింగ్ సమయంలో వేడి తక్కువగా ఉత్పత్తి అవుతుంది. హెవీ లోడ్‌లో కూడా ఛార్జర్ చల్లగా ఉంటుంది. ఇది చిన్నగా, తేలికగా ఉండేలా చేసింది.

Also Read: మొబైల్ ఫోన్ చోరీ అయిందా? వెంటనే ఇలా చేస్తే తిరిగి వస్తుంది

బ్యూటిఫుల్ డిజైన్, వైడ్ కంపాటిబిలిటీ

ఛార్జర్ డిజైన్ చాలా క్లీన్‌గా, అందంగా ఉంది. డెస్క్‌పై కేబుల్ గందరగోళం తగ్గుతుంది. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, టాబ్‌లెట్లు, వెరబుల్స్, ఇయర్‌బడ్స్, USB పరికరాలను ఛార్జ్ చేయవచ్చు.

అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు

ఓవర్‌వోల్టేజ్, ఓవర్‌కరెంట్, షార్ట్ సర్క్యూట్, ఓవర్‌హీటింగ్ నుండి పరికరాలను రక్షిస్తుంది. ఇది సురక్షితమైన, నమ్మదగిన ఛార్జింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

Also Read: ఆన్‌లైన్‌లో కొత్త ఐఫోన్ కొంటే పాత ఫోన్ డెలివరీ.. ఎలా గుర్తుపట్టాలంటే

ఆధునిక యూజర్లకు స్మార్ట్ సొల్యూషన్

పోర్ట్రానిక్స్ అడాప్టో 100D ఒకే ఛార్జర్‌తో బహుళ పరికరాల అవసరాలను సులభతరం చేస్తుంది. ప్రొఫెషనల్స్, హోమ్ యూజర్లకు ఇది పవర్, సేఫ్టీ, కన్వీనియన్స్‌ కలిపి అందిస్తుంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×