E-Paper
Advertisement

Realme 16 5G: అబ్బే, ఇలాంటి ఫోన్ ఎప్పుడూ చూసుండరు.. రియల్‌మీ సెల్ఫీ మిర్రర్ ఫోన్ వచ్చేస్తోందిరోయ్!

Realme 16 5G: అబ్బే, ఇలాంటి ఫోన్ ఎప్పుడూ చూసుండరు.. రియల్‌మీ సెల్ఫీ మిర్రర్ ఫోన్ వచ్చేస్తోందిరోయ్!
Advertisement

Realme 16 5G: రియల్‌మీ ప్రియులకు క్రేజీ అప్‌డేట్. ఈ ఏడాది జనవరిలో వియత్నాంలో లాంచ్ అయిన Realme 16 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్ కేవలం ఫీచర్ల పరంగానే కాకుండా.. వినూత్నమైన డిజైన్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఇండియాలోనే తొలి ‘సెల్ఫీ మిర్రర్’ స్మార్ట్‌ఫోన్‌గా దీనిని కంపెనీ ప్రచారం చేస్తోంది.

సెల్ఫీ మిర్రర్ హైలైట్..

సాధారణంగా మనం ఫోన్ వెనుక కెమెరాతో ఫొటోలు తీసేటప్పుడు మన ముఖం ఎలా ఉందో చూసుకోవడం కష్టం. కానీ ఈ రిRealme 16లో ఒక ప్రత్యేకమైన సెల్ఫీ మిర్రర్‌ను ఇచ్చారు. ఇది గూగుల్ పిక్సెల్ ఫోన్లను పోలి ఉండే హారిజాంటల్ కెమెరా బార్‌తో వస్తుంది. ఈ మిర్రర్ సాయంతో వెనుక ఉన్న మెయిన్ కెమెరా ద్వారా అత్యుత్తమ క్వాలిటీతో సెల్ఫీలు తీసుకోవచ్చు. చూడటానికి ఇది చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, కంటెంట్ క్రియేటర్లకు బాగా ఉపయోగపడుతుంది.

Advertisement

Also Read: ఒప్పో నుంచి రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్స్ లీక్!

మెరుగైన పనితీరు..

ఈ Realme 16 ఫోన్ 6.57 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల ఫోన్ వాడేటప్పుడు చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1,400 నిట్స్ బ్రైట్‌నెస్ ఇచ్చారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, దీనిలో డైమెన్సిటీ 6400 టర్బో చిప్‌సెట్‌ను వాడారు. ఇది రోజువారీ పనులతో పాటు గేమింగ్‌కు కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

బ్యాటరీ విషయానికొస్తే..

Advertisement

Realme 16 ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 7,000mAh భారీ బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చు. దీనికి తోడు 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కెమరా పరంగా చూసుకుంటే.. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ సోనీ IMX852 మెయిన్ కెమెరాను అందించారు. ఇక ముందు భాగంలో కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండటం విశేషం.

ధర ఎంత ఉండొచ్చు?

రియల్‌మీ 16లో డ్యూయల్ స్పీకర్లు, వేడిని తగ్గించే హీట్ డిస్సిపేషన్ యూనిట్, నీటి నుంచి రక్షణ ఇచ్చే IP69 రేటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. మన దేశంలో ఈ ఫోన్ ధర రూ.20,000 లోపే ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. తక్కువ ధరలో వినూత్నమైన డిజైన్, మంచి బ్యాటరీ కావాలనుకునే వారికి ఈ ఫోన్ బాగా నచ్చుతుంది.

Also Read: యాపిల్ హిస్టరీలోనే రికార్డ్ సేల్స్.. ‘మ్యాక్‌బుక్ నియో’కు ఎందుకంత క్రేజ్?

 

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×