E-Paper
Advertisement

War Impact: బాంబుల హోరు, మిస్సైళ్ల జోరు.. కాలుష్య కోరల్లో మిడిల్ ఈస్ట్ దేశాలు!

War Impact: బాంబుల హోరు, మిస్సైళ్ల జోరు.. కాలుష్య కోరల్లో మిడిల్ ఈస్ట్ దేశాలు!
Advertisement

Environmental Impact of War: గత కొద్ది వారాలుగా కొనసాగుతున్న ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా పర్యావరణం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఇప్పటి వరకు యుద్ధం కారణంగా మనుషుల ప్రాణాలు పోగా, ప్రకృతికి కూడా భారీ ముప్పుగా మారుతుంది. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణలు పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.  ముఖ్యంగా ఇరాన్ సహా పశ్చిమాసియా ప్రాంతాల్లో కొనసాగుతున్న వార్ భారీ స్థాయిలో కాలుష్యాన్ని సృష్టించాయి. ఈ ప్రాంతం ఇప్పటికే ఎడారి వాతావరణం, తక్కువ వర్షపాతం వంటి సమస్యలతో బాధపడుతుండగా, తాజా యుద్ధం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది.

2 వారాల్లో 5 మిలియన్ టన్నుల కాలుష్య ఉద్గారాలు

యుద్ధ సమయంలో బాంబులు, క్షిపణులు పేలడం వల్ల గాల్లో భారీగా కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి హానికర వాయువులు విడుదల అవుతున్నాయి. ఆయిల్ రిఫైనరీలు, గ్యాస్ ప్లాంట్లు ధ్వంసం కావడం వల్ల వేల టన్నుల ఇంధనం దగ్ధమై గాల్లో విషపూరిత పొగ వ్యాపిస్తుంది. కేవలం 2 వారాల్లో 5 మిలియన్ టన్నుల గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు వెలువడ్డాయి. ఇరాన్ లో సుమారు 20 వేల భవనాలు దెబ్బతినడంతో 2.4 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అయ్యింది. 2.5- 5.9 మిలియన్ బ్యారెళ్లల ముడి చమురు ధ్వంసం కావడంతో 1.88 మిలియిన్ టన్నుల కార్బన్ డైయాక్సైడ్ గాల్లో కలిసింది. మిసైల్స్, బాంబు పేలుళ్లతో పెద్ద మొత్తంలో విష వాయువులు వెలువడ్డాయి.

ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

Advertisement

విష వాయువులు గాలిలో కలిసిపోయి, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. శ్వాసకోశ వ్యాధులు, చర్మ సమస్యలు, హృదయ సంబంధిత వ్యాధులు పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ఆయిల్ నిల్వలపై దాడులు జరగడం వల్ల పెద్దఎత్తున నూనె లీకులు జరుగుతాయి. ఇవి నేల, నీటిని కాలుష్యం చేసి, జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తాయి. నీటి వనరులు కూడా యుద్ధ ప్రభావానికి గురవుతాయి. రసాయన పదార్థాలు, పేలుడు అవశేషాలు నదులు, భూగర్భ జలాల్లో కలవడం వల్ల తాగునీటి నాణ్యత పడిపోతుంది. ఇది ప్రజల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పటికే నీటి కొరత ఉన్న పశ్చిమాసియాలో ఇది మరింత తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టిస్తుంది. అటు యుద్ధం వల్ల అడవులు నాశనం అవడం, వన్యప్రాణులు తమ నివాసాలను కోల్పోతున్నాయి. పేలుళ్లు, అగ్నిప్రమాదాలు కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. దీని ప్రభావం భవిష్యత్ తరాలపై కూడా పడుతుంది.

మొత్తంగా ఈ యుద్ధం కారణంగా కేవలం దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదు, పర్యావరణంపై తీవ్రమైన దెబ్బ పడుతోంది. ఇరాన్ సహా పశ్చిమాసియా ప్రాంతం ఈ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. వీలైనంత త్వరగా యుద్ధానిక ఫుల్ స్టాఫ్ పడకపోతే, పరిస్థితి చేదాటిపోయే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు.

Advertisement

Read Also:  యుద్ధ సమయంలో సంపన్నులు తలదాచుకొనే దేశాలివే.. ఈ ప్రాంతాలు అంత సేఫా?

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×