E-Paper
Advertisement

Data Expiry Issue: అర్ధరాత్రి దాటితే.. మెుబైల్ డేటా మాయం.. రాజ్యసభలో గర్జించిన ఎంపీ

Data Expiry Issue: అర్ధరాత్రి దాటితే.. మెుబైల్ డేటా మాయం.. రాజ్యసభలో గర్జించిన ఎంపీ
Advertisement

Data Expiry Issue: టెలికాం సంస్థల దోపిడి పార్లమెంటు వేదికగా ఎండగడుతున్న యువ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా.. సోమవారం కీలక అంశాన్ని లేవనెత్తారు. రాజ్యసభలో మాట్లాడుతూ మొబైల్ వినియోగదారుల డేటా వినియోగానికి సంబంధించి ప్రధానమైన సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు అనుసరిస్తున్న ‘డైలీ డేటా ఎక్స్‌పైరీ’ విధానం వల్ల సామాన్యులు నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు.

డేటా రోల్‌ఓవర్ డిమాండ్

ప్రస్తుతం టెలికాం కంపెనీలు రోజుకు 1.5GB, 2GB లేదా 3GB వంటి పరిమితులతో ప్లాన్‌లను అందిస్తున్నాయని ఎంపీ రాఘవ్ చద్దా గుర్తు చేశారు. ఒకవేళ వినియోగదారుడు ఆ రోజుకు నిర్దేశించిన డేటాను పూర్తిగా వాడినా, వాడకున్నా అర్ధరాత్రి 12 దాటగానే మిగిలిన డేటా మెుత్తం మాయమవుతోందని పేర్కొన్నారు. ‘వాడని డేటాకు రీఫండ్ ఉండదు, మరుసటి రోజుకు బదిలీ (Rollover) ఉండదు. ఇది కంపెనీల దోపిడీ’ అని ఎంపీ మండిపడ్డారు. మిగిలిపోయిన డేటాను మరుసటి రోజుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

ఉపయోగించని డేటా.. ‘డిజిటల్ ఆస్తి’

వినియోగదారుడు డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన డేటా వారి ‘డిజిటల్ ఆస్తి’ అని ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు. మనం పెట్రోల్ కొట్టించుకుంటే అది వాడనంత కాలం ట్యాంకులోనే ఎలా ఉంటుందో డేటా కూడా అలాగే ఉండాలని ఉదాహరణగా చెప్పారు. ఒక వినియోగదారుడు నిరంతరం తన డేటాను తక్కువగా ఉపయోగిస్తే ఆ విలువను తదుపరి రీఛార్జ్ ప్లాన్‌లో తగ్గింపు (Discount) రూపంలో సర్దుబాటు చేసే మెకానిజం ఉండాలని ప్రతిపాదించారు.

డేటా బదిలీకి అవకాశం

Advertisement

మన దగ్గర ఉన్న డబ్బును ఇతరులకు బదిలీ చేసినట్లే మన డైలీ లిమిట్‌లో మిగిలిపోయిన డేటాను కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు బదిలీ చేసుకునే వెసులుబాటును టెలికాం సంస్థలు కల్పించాలని రాజ్యసభలో ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. ‘డిజిటల్ ఇండియా’ను నిర్మిస్తున్న ప్రస్తుత తరుణంలో చెల్లించిన సేవలు అర్థాంతరంగా మాయం కాకూడదని పేర్కొన్నారు.

Also Read: Free OTT Subscriptions: ఒక్క రీఛార్జ్‌తో.. Netflix, Hotstar, Prime ఫ్రీ.. ఓటీటీ ప్రియులూ ఇక రెచ్చిపోండి!

28 రోజుల రీఛార్జ్‌పై విమర్శలు

నెలవారీ ప్లాన్లను 28 రోజుల వ్యాలిడిటీకే పరిమితం చేయడాన్ని కూడా ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల పార్లమెంటులో తప్పుబట్టారు. దీనివల్ల వినియోగదారులు ఏడాదికి 12 సార్లకు బదులు 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. టెలికాం సంస్థలు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయని పార్లమెంట్‌లో గర్జించారు. మరోవైపు ప్లాన్ గడువు ముగిసిన తర్వాత ఇన్ కమింగ్ కాల్స్ నిలిపివేతపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం.

Also Read: LPG Gas: గంటపాటు వంట చేస్తే.. ఖర్చయ్యే LPG ఎంత? గ్యాస్ ఆదాకు ఏ బర్నర్ బెస్ట్!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×