E-Paper
Advertisement

Realme Narzo 70 5G : రేపే రియల్ మీ ఎర్లీ బర్డ్ సేల్.. 2 గంటలు మాత్రమే!

Realme Narzo 70 5G : రేపే రియల్ మీ ఎర్లీ బర్డ్ సేల్.. 2 గంటలు మాత్రమే!
Advertisement

Realme Narzo 70 5G : మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ కంపెనీల మధ్య పెద్ద వార్ జరుగుతుందనే చెప్పాలి. కంపెనీలు బడ్జెట్ ఫోన్ల మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని వరుసగా ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో టెక్ దిగ్గజం రియల్ మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. నార్జో సిరీస్ కింద ఈ రియల్ మీ నార్జో 70 5G ఫోన్ విడుదల చేసింది. 15000 వేల రూపాయల కంటే తక్కువ ధరతో ఈ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ బడ్జెట్ మీరు 5జీ మొబైల్ కొనాలనుకుంటే ఇది మంచి ఆప్షన్ కావచ్చు. ఇందులో పవర్‌‌పుల్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ ఎర్లీ బడ్ సేల్ రేపు అంటే ఏప్రిల్ 25న మధ్యాహ్నం ప్రారంభం కాబోతుంది. ఫోన్ ధర, ఫీచర్లు తదితర విషయాలను తెలుసుకోండి.

రియల్ మీ నార్జో 70 5G ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ నార్జో సిరీస్ అత్యంత చౌకైనా ఫోన్ అని కంపెనీ వెల్లడించింది. రూ.15 వేల కంటే తక్కువ బడ్జెట్‌లో మంచి 5G స్మార్ట్‌ఫోన్ దక్కించుకోవచ్చు. ఈ ఫోన్ MediaTek Dimensity 7050 చిప్‌సెట్‌తో వస్తుంది. నార్జో 70 5G ఫోన్‌ను 120hz AMOLED డిస్‌ప్లేతో కంపెనీ తీసుకురానుంది. ఈ ఫోన్‌ 6GB + 128GB, 8GB + 128GB వంటి స్టోరేజ్ వేరియంట్లు చూడొచ్చు.

Advertisement

Also Read : 108 MP కెమెరా స్మార్ట్‌ఫోన్ రూ. 600 లకే.. ఫ్రీగా వాచ్ కూడా!

ఈ కొత్త రియల్ మీ ఫోన్ 50 మెగాపిక్సెల్ కలర్ AI కెమెరాతో తీసుకొస్తున్నారు. ఫోన్ 2MP పోర్ట్రెయిట్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. పవర్ కోసం 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌ ఉంటుంది. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో పాటు అతిపెద్ద 4356mm VC కూలింగ్ టెక్నాలజీతో తీసుకొచ్చారు. ఐస్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ రంగులలో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Advertisement

ఇక రియల్ మీ నార్జో 70 5G ధర విషయానికి వస్తే  6GB + 128GB బేస్ వేరియంట్‌ ధర రూ. 15,999గా ఉంది.  8GB + 128GB టాప్ వేరియంట్‌ ధర 16,999 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. అయితే కూపన్ ఆఫర్ కింద రూ.1000 తగ్గింపు అందిస్తుంది. ఈ ఆఫర్ కారణంగా కొత్త ఫోన్ బేస్ వేరియంట్ రూ.14,999కి, టాప్ వేరియంట్ రూ.15,999కి కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Also Read : ఊహించని బంపర్ ఆఫర్.. సగం ధరకే సామ్‌సంగ్ ఫోన్..!

మీరు ఈ నార్జో ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఎర్లీ బర్డ్ సేల్‌లో ఈ కొత్త ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఎర్లీ బర్డ్ సేల్ రేపు అంటే 25 ఏప్రిల్ 2024 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Tags

Related News

ఈ స్మార్ట్‌వాచ్ దెబ్బకు మార్కెట్ షేకవ్వాల్సిందే.. భారీ అప్‌గ్రేడ్‌తో Galaxy Watch 9!

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

Big Stories

Advertisement
×