Big Stories

Itel S24 Launched : 108 MP కెమెరా స్మార్ట్‌ఫోన్ రూ. 600 లకే.. ఫ్రీగా వాచ్ కూడా!

Itel S24 Launched : ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఐటెల్ చీపెస్ట్ ఫోన్లను వరుసగా మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. దీంతో బడ్జెట్ ప్రియులకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయింది. ఇటీవలే ఐటెల్ నుంచి ప్రిమీయం ఫీచర్లతో ఫోన్ లాంచ్ చేసిన కంపెనీ మరో కొత్త ఫోన్ ఐటెల్ S24 తీసుకొచ్చించి. ఈ ఫోన్‌ను రూ.10 వేల బడ్జెట్‌ కంటే తక్కువ ధరకే  కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా ఇందులో హై క్వాలిటీ కెమెరా ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ కొనుగోలుపై ఉచితంగా స్మార్ట్‌వాచ్ కూడా అందిస్తోంది. ఐటెల్ S24 ధర, ఫీచర్లు, ఆఫర్లు తదితర విషయాలను తెలుసుకోండి.

- Advertisement -

ఐటెల్ మరోసారి సరసమైన ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ధర రూ. 12999 కాగా లాంచ్ ఆఫర్ కింద 15 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. దీంతో ఫోన్‌ను రూ. 10,999కి కొనుగోలు చేయవచ్చు. అలానే కొన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.500 వరకు తగ్గింపు అందిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద రూ.10,300 ధరను తగ్గిస్తుంది. అంటే ఫోన్‌ను రూ.600కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ అనేది మీరు ఎక్స్‌ఛేంజ్ చేస్తున్న డివైజ్ పెర్ఫార్మెన్స్, పిన్‌కోడ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇంతటితో ఆఫర్ అయిపోలేదు.. నెల ఈఎమ్ఐగా రూ. 533 చెల్లించి ఫోన్‌ను దక్కించుకోవచ్చు.

- Advertisement -

Also Read : షియోమీ నుంచి కొత్త స్మార్ట్ ‌ఫోన్.. ధర ఎంతంటే..?

ఫోన్ డిస్‌ప్లే విషయానికి వస్తే ఇందులో 720×1,612 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లేను ఉంది. ఇది 90 Hz రిఫ్రెష్‌రేట్ వరకు సపోర్ట్ చేస్తుంది. MediaTek Helio G91 SoC ప్రాసెసర్ ఉంటుంది. 8 GB RAM + 128 GB స్టోరేజ్‌తో వస్తుంది. వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. దీన్ని 16 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో 108 మెగాపిక్సెల్ Samsung HM6 ISOCELL సెన్సార్ ఉంటుంది. దీనికి f/1.6 ఎపర్చరు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) మద్దతు కూడా ఉంది. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా కటౌట్ చుట్టూ నోటిఫికేషన్‌లను చూపించే డైనమిక్ బార్‌ను కూడా చూడొచ్చు.

స్మార్ట్ ‌ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది 5 గంటల నాన్‌స్టాప్ గేమింగ్‌, 7.5 గంటల వీడియోలను బ్యాకప్ ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది. ఇది డ్యూయల్ DTS స్పీకర్లు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, కనెక్టివిటీ కోసం, Wi-Fi, బ్లూటూత్, GPS, 4G,  USB టైప్ C పోర్ట్‌లను కలిగి ఉంది.

Also Read : ఊహించని బంపర్ ఆఫర్.. సగం ధరకే సామ్‌సంగ్ ఫోన్..!

Itel S24 స్మార్ట్ ఫోన్‌ను ఆసక్తి ఉన్న కస్టమర్లు అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు రూ. 999 విలువైన స్మార్ట్‌వాచ్‌ ఉచితంగా లభిస్తుంది. ఇది ఏప్రిల్ చివరి వారంలో రిటైల్ అవుట్‌లెట్లలో అమ్మకానికి అందుబాటులోకి వస్తుంది. ఇది డాన్ వైట్, స్టార్రీ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News