BigTV English

Song from Harom Hara: ‘హరోం హర’ నుంచి సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ‘కనులెందుకో’ పాట..!

Song from Harom Hara: ‘హరోం హర’ నుంచి సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ‘కనులెందుకో’ పాట..!

“Kanulenduko” Song Released from Sudheer Babu’s ‘Harom Hara’: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం మంచి హిట్ కోసం తహతహలాడుతున్నాడు. వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నా పెద్దగా ఫలితం దక్కడం లేదు. ఎప్పుడో ‘ప్రేమ కథా చిత్రం’ తో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో వచ్చినా ఎటువంటి ప్రయోజనమూ లేకపోయింది. అయినా సుధీర్ బాబు ఎక్కడా సహనం కోల్పోలేదు.


ఇందులో భాగంగానే గతేడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. హంట్, మామా మాశ్చింద్ర అనే సినిమాలతో వచ్చాడు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలు ఆడియన్స్‌ను నిరాశ పరిచాయి. ముఖ్యంగా హంట్ మూవీ కోసం సుధీర్ బాబు చాలా కష్టపడ్డాడు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇక మామా మాశ్చింద్ర కోసం మరింతగా శ్రమించినా ప్లాప్‌గానే మిగిలింది.

ఇక ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ‘హరోం హర’ మూవీ చేస్తున్నాడు. ఇది సుధీర్ బాబు కెరీర్‌లో 18వ మూవీగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి ‘సెహరి’ ఫేం జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.


Also Read: ‘హరోం హర’ టీజర్.. అంచనాలు పెంచేస్తున్న సుధీర్ బాబు.

వీటితో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్‌ను అందించారు. ఇందులో భాగంగా నిన్న ఈ మూవీ లోని కనులెందుకో అంటూ సాగే సెకండ్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ అయింది. వెంగి సుధాకర్ ఈ సాంగ్‌ను రాశారు. చేతన్ భరద్వాజ్ కంపోజిషన్‌లో నిఖిత శ్రీవల్లి పాడారు.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం 1989 బ్యాక్ డ్రాప్‌లో చిత్తూరులోని కుప్పం నేపథ్యంలో సాగే స్టోరీగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో త్వరలో రిలీజ్ కానుంది.

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×