BigTV English

Viral Video: నా రూటే సెపరేటు.. నామినేషన్ ఫైల్ చేసేందుకు ఒంటెపై వెళ్లిన ఎంపీ అభ్యర్థి

Viral Video: నా రూటే సెపరేటు.. నామినేషన్ ఫైల్ చేసేందుకు ఒంటెపై వెళ్లిన ఎంపీ అభ్యర్థి

Viral Video: లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైన విషయం తెలిసిందే. ఈ తరుణంలో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు భారీ ఊరేగింపులతో వెలుతుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా మంది నేతలు నామినేషన్ల కోసం పెద్ద పెద్ద ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు వేశారు. మంచి ముహుర్తం చూసుకుని తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధువులు, మిత్రులు ఇలా ఎంతో మందిని వెంట పెట్టుకుని వెళ్లి మరి నామినేషన్లు వేస్తుంటారు. తాజాగా ఓ ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థి కూడా వినూత్న ర్మాలీగా వెళ్లి నామినేషన్ వేసిన ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.


మహారాష్ట్రకు చెందిన ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఏకంగా ఒంటేపై వెళ్లి నామినేషన్ వేశారు. ఛత్రపతి సంభాజీనగర్ లో ఈ ఘటన వెలుగుచూసింది. ఔరంగాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సాహెబ్ ఖాన్ పఠాన్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థి తన సన్నిహితులు, పార్టీ నేతలతో కలిసి ఒంటెపై ర్యాలీగా నామినేషన్ వేసేందుకు వెళ్లారు.

Also Read: నోట్లో నిప్పు పెట్టుకుని స్టంట్స్.. కొంచెంలో తప్పిన పెను ప్రమాదం


ఒక్కసారిగా రోడ్డుపై ఒంటె దర్శనమివ్వడంతో స్థానికులు, వాహనదారులు చూసి అవాక్కయ్యారు. ఇదెక్కడి వెరైటీ అంటూ కొంత మంది కాసేపు ఆగి మరి చూస్తూ ఉండిపోయారు. ఈ తరుణంలో ఖాన్ కు పలువురు పూలదండలు వేసి స్వాగతం పలికారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Big Stories

×