E-Paper
Advertisement

Sankranthiki Vasthunnam Remake : రీమేక్‌కి హీరో సెట్…. హీరోయిన్లను కూడా పట్టేశారు.

Sankranthiki Vasthunnam Remake : రీమేక్‌కి హీరో సెట్…. హీరోయిన్లను కూడా పట్టేశారు.
Advertisement

Sankranthiki Vasthunnam Remake : ఒక భాషలో ఎంతో మంచి విజయం అందుకున్న సినిమాలను మరొక భాషలోకి రీమేక్ చేయడం అనేది సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరుగుతుంది. ఇలా ఇప్పటికే ఎన్నో హిందీ, ఇతర భాష సినిమాలను తెలుగులో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. అదేవిధంగా తెలుగులో సూపర్ సక్సెస్ అందుకున్న సినిమాలను కూడా ఇతర భాషలలో రీమేక్ చేస్తే అక్కడ కూడా విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇక గతేడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలలో “సంక్రాంతికి వస్తున్నాం” (Sankranthiki Vastunnam)సినిమా ఒకటి.  2024 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

హీరోగా అక్షయ్ కుమార్..

అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోయిన్  నటించిన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా హిందీ రీమేక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా అక్షయ్ కుమార్ (Akshya Kumar)నటించబోతున్నట్టు ఇదివరకు వెల్లడించారు. అయితే హీరోయిన్లుగా ఎవరు నటించబోతున్నారు అనే విషయంపై ఇన్ని రోజులు సందిగ్గం నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమాకు హీరోయిన్లు కూడా దొరికారని తెలుస్తోంది.

హిందీ రీమేక్ లో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్..

Advertisement

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కు జోడిగా మీనాక్షి చౌదరి(Menakshi Chaudary) ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)నటించబోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ తెలుగులో నటించిన సంగతి తెలిసిందే అదే విధంగా బాలీవుడ్ రీమేక్ లో కూడా ఈ ఇద్దరు హీరోయిన్లుగా ఎంపికయ్యారని సమాచారం. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతుంది. ఇక ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఇక సంగీతం బీమ్స్ అందించబోతున్నారు.

సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం…

Advertisement

ఇక త్వరలోనే ఈ సినిమా హిందీ రీమేక్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. తెలుగులో ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. తెలుగులో ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సినిమా సీక్వెల్ పనులపై బిజీగా ఉన్నట్టు సమాచారం. ఈ సీక్వెల్ సినిమాకు “సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం” అనే టైటిల్ తో 2027 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

Also Read: Yellamma Movie: దేవిశ్రీ ఎల్లమ్మ కోసం మరోస్టార్ హీరో .. పక్కాగా ప్లాన్ చేస్తున్న వేణు!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×