E-Paper
Advertisement

Realme P4 Power vs Realme P4 Pro: పవర్‌ఫుల్ బ్యాటరీ ఫోన్ కావాలా? అద్భుతమైన కెమెరా ఫోన్ కావాలా? ఏది బెస్టో ఇప్పుడు చూసేద్దాం!

Realme P4 Power vs Realme P4 Pro: పవర్‌ఫుల్ బ్యాటరీ ఫోన్ కావాలా? అద్భుతమైన కెమెరా ఫోన్ కావాలా? ఏది బెస్టో ఇప్పుడు చూసేద్దాం!
Advertisement

Realme P4 Power vs Realme P4 Pro: రియల్‌మీ తాజాగా మార్కెట్లోకి తీసుకొచ్చిన రియల్‌మీ P4 పవర్, రియల్‌మీ P4 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు ఫీచర్లు ప్రస్తుతం టెక్ ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.  రూ.30వేల లోపు బడ్జెట్‌లో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, భారీ బ్యాటరీ కోరుకునే వారి కోసం ఈ రెండు ఫోన్లు పోటీ పడుతున్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది మీకు మెరుగైన పనితీరును అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకట్టుకునేలా డిజైన్..

చూడగానే ఆకట్టుకునేలా ఉండే ఈ రెండు ఫోన్లలో 6.8 అంగుళాల 1.5K రెజల్యూషన్ కలిగిన AMOLED డిస్‌ప్లేను అందించారు. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ కోసం 144Hz రిఫ్రెష్ రేట్ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, Pro వేరియంట్ చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇది సన్నగా, బరువు తక్కువగా ఉండటమే కాకుండా చేతిలో పట్టుకున్నప్పుడు మంచి ఫీల్‌ను ఇస్తుంది. ఇక Power వేరియంట్ కొంచెం లావుగా అనిపించినా.. కర్డ్వ్ స్క్రీన్‌తో ఆకర్షణీయంగానే ఉంటుంది.

Advertisement

Also Read: శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్‌పై ఏకంగా రూ.30వేలు తగ్గింపు.. అమెజాన్‌లో బెస్ట్ డీల్ ఇదే!

ఛార్జింగ్ టెన్షన్ ఉండదు..

పేరుకు తగ్గట్టుగానే Realme P4 Power బ్యాటరీ విషయంలో టాప్‌లో నిలిచింది. దీనిలో ఏకంగా 10,001mAh భారీ బ్యాటరీ ఉండటంతో ఈ ఫోన్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మూడ్రోజుల వరకు నిరంతరాయంగా పనిచేస్తుంది. అలాగే P4 Proలో 7,000mAh బ్యాటరీని అందించారు. ఈ రెండూ కూడా 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

సెల్ఫీలకు 50 మెగాపిక్సల్ కెమెరా..

Advertisement

ఇకపోతే స్పీడ్, గేమింగ్ విషయానికి వస్తే.. Realme P4 Pro టాప్‌లో ఉంది. దీనిలో వాడిన స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ భారీ గేమింగ్‌ను కూడా సులభంగా హ్యాండిల్ చేస్తుంది. అలాగే P4 Power లోని డైమెన్సిటీ 7400 అల్ట్రా రోజువారీ పనులకు, సాధారణ గేమింగ్‌కు సరిపోతుంది. Pro మోడల్‌లో సెల్ఫీల కోసం ఏకంగా 50MP ఫ్రంట్ కెమెరా ద్వారా అద్భుతమైన ఫొటోలను అందిస్తుంది.

రెండింటిలో ఏది కొంటే బెటర్?

భారీ బ్యాటరీ బ్యాకప్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 కావాలంటే రియల్‌మీ P4 పవర్‌ను ఎంచుకోవచ్చు. ఒకవేళ స్టైలిష్ లుక్, మెరుగైన గేమింగ్ స్పీడ్, అద్భుతమైన కెమెరా క్లారిటీ కావాలనుకుంటే మాత్రం రియల్‌మీ P4 ప్రో తీసుకోవడం ఉత్తమం. ఆఫర్ల ద్వారా ఈ రెండు ఫోన్లు దాదాపు ఒకే ధరలో లభిస్తుండటం విశేషం.

Also Read: ఐకూ నుంచి రెడ్‌మీ వరకు.. రూ.30వేల బడ్జెట్‌లో పవర్‌ఫుల్ గేమింగ్ ఫోన్లు!

Related News

రూ.499కే బ్లూటూత్ స్పీకర్..పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో ట్రెండీ మోడల్

మార్కెట్‌లోకి కొత్త మోడల్.. రచ్చ చేస్తున్న ఈ టీవీ మోడల్ గురించి మీకు తెలుసా?

రూ.1648కే 3 వస్తువుల కాంబో..ఇలాంటి ఆఫర్ ఎప్పుడూ చూసుండరు

ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. మీ లొకేషన్ లీక్ అవ్వకూడదంటే.. ఈ హిడెన్ ఫీచర్‌ ఆన్ చేసుకోండి!

ఐఫోన్ vs ఆండ్రాయిడ్: డిస్‌ప్లే పగిలినా, బ్యాటరీ పోయినా.. దేనికి రిపేర్ ఖర్చు ఎక్కువ?

రూ.1,999కే రియల్‌మీ 20000mAh పవర్ బ్యాంక్..ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ అదిరిపోయాయి!

రూ.6,599కే బెస్ట్ టీవీ..ఆఫర్ పూర్తవకముందే కొనేయండి!

వేల రూపాయల ఫీచర్లు రూ.999కే..ఆఫర్ మాములుగా లేదుగా!

Big Stories

Advertisement
×