చైనీస్ టెక్ దిగ్గజం రియల్ మీ తన స్మార్ట్ టీవీలను తక్కువ ధరకే వినియోగదారులకు అందిస్తుంది. అందులో భాగంగానే realme TechLife 32 ఇంచుల LED HD Ready స్మార్ట్ Google TVపై బెస్ట్ డీల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 2025 ఎడిషన్ కు సంబంధించిన 32HDGQRDDAQ మోడల్ మీద 60 శాతానికి పైగా తగ్గింపు అందిస్తుంది. ఈ బడ్జెట్ QLED TV మంచి కలర్, సౌండ్, Google TV ఫీచర్లతో వస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం హాట్ డీల్ గా కొనసాగుతోంది.
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ టీవీ మీద ఏకంగా 60 శాతం తగ్గింపు అందిస్తుంది. అసలు ధర రూ. 23, 999 ఉండగా, స్పెషల్ ప్రైస్ లో భాగంగా రూ. 9,499కే అందిస్తుంది. ఇక బ్యాంక్ ఆఫర్లలో భాగంగా 10% ఆఫ్ అప్ టు, SBI, ICICI, Canara Bank క్రెడిట్ కార్డ్ EMIలపై రూ. 1,500 వరకు తగ్గింపు ఇస్తుంది. Axis Bank కార్డ్ పై 5% క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. నో కాస్ట్ EMI సౌకర్యాన్ని అందిస్తుంది. 3-12 నెలలరే EMI కట్టుకోవచ్చు. నెలకు రూ. 3000 వరకు చెల్లించుకునే అవకాశం ఉంటుంది. ఎక్స్ ఛేంజ్ ఆఫర్ లో భాగంగా టీవీ మోడల్ ఆధారంగా రూ. 3000 నుంచి రూ. 5000 తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. ఫ్రీ డెలివరీ, ఇన్‌స్టాలేషన్ 30 డేస్ రీప్లేస్‌మెంట్ గ్యారంటీ, యాక్సిడెంటల్ డ్యామేజ్ కవర్ లాంటివి అందిస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ Google TV OSతో రన్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్ సహా 30కి పైగా OTT యాప్‌లను కలిగి ఉంటుంది. Quad Core ప్రాసెసర్ తో 1GB RAM, 8GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ల్యాగ్ లేని స్ట్రీమింగ్ అందిస్తుంది.
⦿ డిస్ ప్లే: 32 ఇంచుల స్క్రీన్ ను కలిగి ఉంటుంది. QLED, HD Ready 1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. 60Hz రిఫ్రెష్ రేట్, HDR10, Dolby Vision, వైడ్ కలర్ గ్యాముట్, బెజెల్ లెస్ డిజైన్ ను కలిగి ఉంటుంది.
Read Also: రూ. 50 వేల స్మార్ట్ టీవీ జస్ట్ రూ. 30 వేలకే, అమెజాన్ అదిరిపోయే ఆఫర్!
⦿ ఆడియో : 26W డౌన్ ఫైరింగ్ స్పీకర్లు 2 ఉంటాయి. Dolby Audio, DTS Virtual:X, సరౌండ్ సౌండ్ ను అందిస్తుంది.
⦿ స్మార్ట్ ఫీచర్లు: Google TV OS, 7000+ యాప్‌లు, కిడ్స్ మోడ్, స్మార్ట్ రికమెండేషన్స్. ఐ కేర్ మోడ్ ఉంటుంది.
⦿ కనెక్టివిటీ: 3x HDMI, 2x USB, Dual Band Wi-Fi, Bluetooth 5.0, Ethernet, Optical Audio Out ఉంటుంది.
⦿ ఈ స్మార్ట్ టీవీ 1 సంవత్సరం కాంప్రెహెన్సివ్ + 1 సంవత్సరం ప్యానెల్ వ్యారెంటీని కలిగి ఉంటుంది. 71.6 x 46.8 x 18.3 cm స్టాండ్ తో ఉచితంగా లభిస్తుంది.
Read Also: తక్కువ బ్యాటరీ కెపాసిటీ గల ఫోన్లకు ఫాస్ట్ ఛార్జర్ వాడొచ్చా? ఏమవుతుంది?