E-Paper
Advertisement

Vastu Tips: రోడ్డు మీద నాణెం దొరికితే అదృష్టమా? ఇందులో నిజమెంత, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

Vastu Tips: రోడ్డు మీద నాణెం దొరికితే అదృష్టమా? ఇందులో నిజమెంత, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Advertisement

Vastu Tipscoins: మనలో చాలామందికి ఏదోఒక సందర్భంలో ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా నాణెం లేదా కరెన్సీ నోటు కనిపించడం. అయితే, కొందరు ఆ నాణేన్ని తీసుకుంటారు.. మరి కొందరు ఇలా తీసుకోవడం అశుభం ఏమో అని డబ్బును తీసుకోకుండానే వెళ్లిపోతుంటారు. కానీ వాస్తు శాస్త్రం, జ్యోతిషశాస్త్రం ప్రకారం.. రోడ్డుపై డబ్బు కనిపించడం అంత చెడు సంకేతం కాదట. రోడ్డు మీద నాణెం దొరకడం అనేది అదృష్ట ద్వారం తెరుచుకుంటుందనే సంకేతం అని నిపుణులు చెబుతున్నారు.

పూర్వీకుల ఆశీర్వాదం:

మనం నడుస్తున్నప్పుడు రోడ్డు మీద డబ్బు కనిపించడం అనేది.. యాదృచ్ఛికంగా జరిగేది కాదు. అది పూర్వీకుల ఆశీర్వాదం, విశ్వం నుంచి వస్తున్న సానుకూల శక్తి అని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా నాణెం కనిపిస్తే.. అది దేవుని ఆశీర్వాదం రూపంలో మన జీవితంలో శుభ పరిణామాలు రానున్నాయన్న సూచన అంటారు.

Advertisement

Read Also: జాగ్రత్త సుమీ.. ఇంట్లో ఈ మొక్కలు పెంచారో అంతే సంగతులు!

వాస్తు నిపుణుల ప్రకారం:

రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నాణెం లేదా కరెన్సీ నోటు కనిపిస్తే వెంటనే తీసుకోవాలి. అలా తీసుకున్న డబ్బు రాబోయే రోజుల్లో మీ అదృష్టాన్నిపెంచుతుందంటారు వాస్తు నిపుణులు. అయితే, అలా దొరికిన డబ్బును వెంటనే ఖర్చు పెట్టకూడదట. జాగ్రత్తగా పర్సులో లేదా ఇంట్లో దేవుడి గదిలో ఉంచాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన సమృద్ధి పెరుగుతుందని చెబుతున్నారు.

శుభఫలితాలు కలుగుతాయి:

Advertisement

ఎక్కడికైనా ముఖ్యమైన పనిమీద వెళ్తున్నప్పుడు రోడ్డు మీద డబ్బు కనబడితే.. ఆ రోజు మనం అనుకున్న పని విజయవంతంగా పూర్తవుతుందని నమ్మకం. ఆ డబ్బును తీసుకోవడం ద్వారా ఆర్థికంగా లాభం, మానసిక ప్రశాంతత, శుభఫలితాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. అయితే, కొందరు ఇది నాది కాదు.. అని భావించి తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు దాన్ని దేవాలయం హుండీలో వేసేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.

అదృష్టానికి సంకేతం:

నిజానికి ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే.. రోడ్డు మీద దొరికే డబ్బు యాదృచ్ఛికం కాదు. అది ప్రపంచం మనతో ఒక సంకేతం పంచుకుంటోంది. అలా కనిపించిన డబ్బును తీసుకోవడం అనేది ఈ విశ్వం ఇచ్చే శుభఫలితాలను అంగీకరించడం లాంటిది. అందుకే.. మీకెప్పుడైనా రోడ్డు మీద నాణెం లేదా కరెన్సీ నోటు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా తీసుకోవాలి. అది దేవుడు మన వైపుకు పంపిన ఒక చిన్న అదృష్ట సంకేతంగా భావించాలని చెబుతున్నారు వాస్తు నిపుణులు.

Read Also: ఇంటి అందానికి మాత్రమే కాదండోయ్.. ఈ ప్లాంట్ వెనుకున్న అసలు కారణాలు ఇవే!

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×