Big Stories

Realme Narzo 70x 5G: రూ.11 వేలకే రియల్ నుంచి 50MP ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

Realme Narzo 70x 5G Mobile: చైనీస్ టెక్ కంపెనీ రియల్‌ మీ గ్యాప్ లేకుండా స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. టాప్ టెక్ కంపెనీలకు గట్టి పోటీని ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ భారత మార్కెట్‌లో ఇటీవల రియల్ మీ పి1 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచే చేసింది. అయితే తాజాగా నార్జో లైనప్ మరొక కొత్త వేరియంట్ ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రియల్ మీ నార్జో 70x 5Gని ఏప్రిల్ 24న దేశీయ మార్కెట్‌లోకి తీసుకురానుంది.

- Advertisement -

రియల్ మీ నార్జో 70x 5G స్మార్ట్‌ఫోన్లో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు ఉన్నాయి. ఈ ఫోన్ పవర్‌ఫుల్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఏప్రిల్ 24 మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ ఈవెంట్ ద్వారా లాంచ్ కానుంది. సంస్థ అఫిషియల్ వెబ్‌సైట్ ద్వారా ఈవెంట్‌ను చూడవచ్చు. అమెజాన్‌లో ఫోన్ సేల్‌కు రానుంది.

- Advertisement -
Realme Narzo 70x 5G
Realme Narzo 70x 5G

Also Read: Top Mobiles Under Rs 8000: మైండ్ బ్లోయింగ్ వర్మ.. రూ. 8000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ ఇదే..!

రియల్ మీ Narzo 70x 5G స్పెసిఫికేషన్‌లు..
Realme కొత్త 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఇంటర్నెట్‌ ఉన్న సమాచారం ఆధారంగా రియల్ మీ నార్జో 70x 5G 6.78 ఇంచెస్‌ బిగ్ డిస్‌ప్లేతో రానుంది. ఇది IPS LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. డిస్‌ప్లే అధిక రీఫ్రెష్‌కు సపోర్ట్ చేస్తుంది. అలానే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఈ ఫొన్ డ్యూయల్ 5G కనెక్టివితో వస్తుంది.

రియల్ మీ నార్జో 70x 5G స్మార్ట్‌ఫోన్ ధర విషయానికి వస్తే.. రూ. 12,000 కంటే తక్కువ ధరకే ఫోన్ లాంచ్ అయే అవకాశం ఉంది. అంటే ఫోన్ బేసిక్ వేరియంట్ ధర రూ. 11,999గా ఉండొచ్చు. అయితే కంపెనీ ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. దీంతో ఫోన్ ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లో లాంచ్ కావచ్చు.

Also Read: వివో నుంచి చీపెస్ట్ ఫోన్.. 50MP, 6000mAh బ్యాటరీ దీని సొంతం!

ఇక రియల్ మీ Narzo 70x 5Gలో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అంతేకాకుండా 5000mAh బ్యాటరీ ఉంది. ఫోన్ కి 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఛార్జ్ కూడా వేగంగా చేయవచ్చు. ఇందులో Android 14 ఆధారిత RealmeUI సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ నార్జో లైనప్‌లో వస్తుంది కాబట్టి ఇందులో బెస్ట్ ఫీచర్లు చూసే అవకాశం ఉంది. నార్జో సిరీస్ ఎంతో సక్సెస్‌ఫుల్‌గా దేశంలో సేల్ అవుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News