BigTV English

Himaja: తెలుగమ్మాయిలు కమిట్ మెంట్ ఇచ్చినా.. అవకాశాలు రావడం లేదు

Himaja: తెలుగమ్మాయిలు కమిట్ మెంట్ ఇచ్చినా.. అవకాశాలు రావడం లేదు

Himaja: కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే కామెడీ సీరియల్ ద్వారా పరిచయమైన నటి హిమజ. ఈ సీరియల్ తో ఆమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఈ ఒక్క సీరియల్ ఆమె జీవితాన్ని మార్చేసింది. సినిమాలు, షోస్ అంటూ బిజీగా మారిపోయింది. హైదరాబాద్ లోనే సొంత ఇల్లు, కారు కొనుక్కొని మంచిగా సెటిల్ అయిపోయింది.


ప్రస్తుతం ఈ చిన్నది స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. తాజాగా హిమజ ఒక ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా టాలీవుడ్.. కేవలం ముంబై నుంచి వచ్చిన హీరోయిన్స్ ను మాత్రమే గుర్తిస్తుందని ఆవేదన వెళ్లగక్కింది.


తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఎందుకు రావడం లేదు అన్న ప్రశ్నకు హిమజ మాట్లాడుతూ.. ” తెలుగు అమ్మాయిలు.. చాలా రిజర్వడ్ గా ఉంటారు. కమిట్ మెంట్ కు ఒప్పుకుంటూనే ఛాన్స్ లు వస్తాయని ఒకప్పుడు అనుకునేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. ఈ మధ్య కమిట్ మెంట్ ఇచ్చిన తెలుగు అమ్మాయిలకు కూడా ఛాన్స్ లు రావడం లేదు. అలా అని అందరూ కమిట్ మెంట్స్ ఇస్తున్నారని చెప్పడం లేదు. ఇప్పుడు ముంబై నుంచి వచ్చిన హీరోయిన్స్ కు మాత్రమే ఇక్కడ ఆఫర్స్ దక్కుతున్నాయి.

ఇక తెలుగు అమ్మాయిలు కూడా తప్పు చేస్తున్నారు. మాకు హీరోయిన్ ఛాన్స్ వస్తేనే చేస్తామని చెప్పుకొస్తున్నారు. అది తప్పు. మొదట ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చినా చేయడం నేర్చుకోవాలి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. నా మటుకు నేను అలాగే చేసుకుంటూ వస్తున్నాను. మొదట నాకు పనిమనిషి క్యారెక్టర్ వచ్చింది. చేశాను.. ఇలా ఏ క్యారెక్టర్ వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హిమజ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×