E-Paper
Advertisement

షియోమీ షాకింగ్ నిర్ణయం.. ఒకేసారి Redmi K100, Xiaomi 18 సిరీస్ లాంచ్?!

షియోమీ షాకింగ్ నిర్ణయం.. ఒకేసారి Redmi K100, Xiaomi 18 సిరీస్ లాంచ్?!
Advertisement

Redmi K100: గతేడాది అక్టోబర్‌లో వచ్చిన రెడ్‌మీ K90 సిరీస్‌కు కొనసాగింపుగా ఈ ఏడాది చివర్లో రెడ్‌మీ K100 మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. షియోమీ అనుబంధ సంస్థ అయిన రెడ్‌మీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ఈ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన ఫీచర్లు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్‌లోని బేస్ వేరియంట్ (స్టాండర్డ్ మోడల్) లోనే కంపెనీ మునుపెన్నడూ లేని కొన్ని అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ లీక్స్‌ను పంచుకున్నారు.

మెరుగైన పనితీరు:

తాజా లీక్స్ ప్రకారం.. రెడ్‌మీ K100 ఫోన్ ఫ్లాట్ డిస్‌ప్లేతో రానుంది. మొబైల్ హిస్టరీలోనే అత్యధికంగా దీని స్క్రీన్ 185Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండబోతుండటం విశేషం. దీనివల్ల ఫోన్ వాడుతున్నప్పుడు స్క్రోలింగ్, గేమింగ్ అనుభూతి చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం క్వాల్కమ్ కంపెనీకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను దీనిలో వాడుతున్నట్లు సమాచారం.

ర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌:

Advertisement

ఈ ఫోన్ 8500mAh భారీ బ్యాటరీతో వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఛార్జింగ్ విషయానికొస్తే.. 100W వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు రెడ్‌మీ కే-సిరీస్ చరిత్రలోనే మొదటిసారిగా స్టాండర్డ్ మోడల్‌లో 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇస్తున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: ఐఫోన్ లవర్స్‌కు ఊహించని షాక్.. ఈ ఏడాది iPhone 18 లాంచ్ లేనట్టేనా? యాపిల్ అసలు ప్లాన్ లీక్!

ప్రీమియం డిజైన్.. మరెన్నో ఫీచర్లు:

Advertisement

లుక్ పరంగా కూడా రెడ్‌మీ K100 చాలా క్లాస్‌గా ఉండబోతోంది. వెనుకవైపు గ్లాస్ ప్యానల్, చుట్టూ మెటల్ ఫ్రేమ్‌తో ఈ ఫోన్‌ను ప్రీమియం క్వాలిటీతో డిజైన్ చేస్తున్నారు. వీటితో పాటు అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, సిమెట్రికల్ స్టీరియో స్పీకర్లు, దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ దీనిలో ఉండనున్నాయి. మరోవైపు, ఈ సిరీస్‌లోని హైఎండ్ మోడల్ ‘రెడ్‌మీ K100 ప్రో’లో 200MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

లాంచ్ ఎప్పుడంటే?

ఈ రెడ్‌మీ K100 సిరీస్ చైనాలో సెప్టెంబర్ నాటికి లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. షియోమీ 18 సిరీస్‌తో పాటే ఈ ఫోన్లను కూడా ఒకేసారి విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ సిరీస్‌లో K100, K100 ప్రో మోడల్స్‌తో పాటు రెడ్‌మీ K100 ప్రో మాక్స్ అనే మరో మోడల్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకేసారి రెండు పెద్ద సిరీస్‌లను మార్కెట్లోకి తెస్తుండటంతో.. షియోమీ బ్రాండ్ల మధ్యే గట్టి పోటీ ఉండేలా కనిపిస్తోంది.

Also Read: iOS 27 వచ్చేసింది.. iPhone 11 నుండి iPhone 17 Pro Max వరకు.. ఏయే ఫోన్లకు సపోర్ట్ చేస్తుందంటే?

Related News

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌తో కాకుండా.. మెటల్‌‌ తోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

Big Stories

Advertisement
×