E-Paper
Advertisement

గుండ్ల పోచంపల్లిలో బయటపడ్డ నయా భూ దందా.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్..!

గుండ్ల పోచంపల్లిలో బయటపడ్డ నయా భూ దందా.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్..!
Advertisement

Land Encroachment: స్వేచ్చ బ్యూరో: గుండ్లపోచంపల్లి–మైసమ్మగూడ శివార్లలో ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన భూముల కబ్జా వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. కబ్జాకు గురైన 49 ఎకరాల 20 గుంటల భూములను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం పరిశీలించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళిత విద్యార్థుల భవిష్యత్తు కోసం 1991లో సర్వే నంబర్ 509లో 49 ఎకరాల 20 గుంటల భూమిని ఎస్సీ కార్పొరేషన్‌కు కేటాయించారని గుర్తు చేశారు.

మంత్రి గరం గరం..

అయితే గత పాలకుల అండదండలతో కొందరు ప్రభావశీలులు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను ఆక్రమించి కోట్ల రూపాయల సామ్రాజ్యాలు నిర్మించుకున్నారని విమర్శించారు.”కబ్జా చేసిన వారి పేర్లు చెప్పి నా స్థాయిని తగ్గించుకోను. కానీ దళితుల హక్కులను హరించిన వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దళితుల కోసం కేటాయించిన భూములను ఆక్రమిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేసిన మంత్రి.. గుండ్లపోచంపల్లిలోని 49.20 ఎకరాల భూమిని వెంటనే సర్వే చేసి ఎస్సీ కార్పొరేషన్‌కు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

Advertisement

Also Read: ఆ డాక్యుమెంటరీ చూసి ఎమోషనల్ అయిన ధనుష్.. ‘ఎప్పటికీ నువ్వే GOAT’ అంటూ..’

అక్రమార్కులపై ఉక్కుపాదం..

ప్రభుత్వ భూములు, రైతుల భూములను కబ్జా చేయాలని చూసే భూ బకాసురులపై ఉక్కుపాదం మోపుతామని, ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నా ఉపేక్షించబోమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. మంత్రి వెంట మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, జిల్లా కలెక్టర్ మనూ చౌదరి, మాజీ డీసీసీ హరివర్ధన్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు, గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సాయి పేట శ్రీనివాస్,మండల అధ్యక్షుడు రమణ రెడ్డి,మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: ఇలాంటి ఇల్లు ఉంటే.. లైఫ్‌లో ఏసీ, కూలర్ అక్కర్లేదు.. 40 ఏళ్లుగా 10°C ఉష్ణోగ్రత!

Related News

సికింద్రాబాద్ టూ సిద్దిపేట రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్!

జెన్-జీలకు మంత్రి పదవులు ఇవ్వాలి.. సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ డిమాండ్!

సోషల్ మీడియా రీల్స్ నమ్మితే అంతే సంగతులు.. రాంచందర్ రావు!

కర్ణాటక అక్రమ గేట్ల వెనుక కాంగ్రెస్ సైలెంట్ డీల్: శ్రీనివాస్ గౌడ్!

జూరాల రైతులకు సర్కార్ బిగ్ షాక్.. సాగునీటి విడుదలపై నీలినీడలు!

‘మీ వీపు మీరు చూసుకోండి’.. రాహుల్ గాంధీకి డీకే అరుణ ఘాటు సెటైర్లు!

ఐఎస్ఎమ్ 2.0లో తెలంగాణకు చోటేది? కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు కీలక విజ్ఞప్తి!

కాంగ్రెస్ సర్కార్‌కు కవిత బిగ్ షాక్.. అసలు విషయం చెప్పండి అంటూ ఫైర్!

Big Stories

Advertisement
×