E-Paper
Advertisement

Smartphone Comparison: రెడ్‌మీ నోట్ 15 ప్రో+vs గెలాక్సీ S24 FE vs పిక్సెల్ 9a.. ప్రీమియం మిడ్-రేంజ్‌లో ఏది బెస్ట్?

Smartphone Comparison: రెడ్‌మీ నోట్ 15 ప్రో+vs గెలాక్సీ S24 FE vs పిక్సెల్ 9a.. ప్రీమియం మిడ్-రేంజ్‌లో ఏది బెస్ట్?
Advertisement

Redmi Note 15 Pro+ vs Galaxy S24 FE vs Pixel 9a Smartphone Comparison| చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్‌మీ ఇటీవలే రెడ్‌మీ నోట్ 15 ప్రో+ 5Gని భారత్‌లో లాంచ్ చేసింది. ప్రీమియం మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్‌కు పోటీగా శాంసంగ్ గెలాక్సీ S24 FE, గూగుల్ పిక్సెల్ 9a ఉన్నాయి. మూడు ఫోన్లు బలమైన పెర్ఫామెన్స్, మోడరన్ డిజైన్, గొప్ప కెమెరాలు కలిగి ఉన్నాయి. మీ అవసరాలకు ఏ ఫోన్ బెస్ట్ అనేది ఈ కంపారిజన్‌తో తెలుసుకోవచ్చు.

ధరలు, స్టోరేజ్ ఆప్షన్లు

రెడ్‌మీ నోట్ 15 ప్రో+ 5G 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999.
గూగుల్ పిక్సెల్ 9a 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999.
శాంసంగ్ గెలాక్సీ S24 FE 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999.
ధర పరంగా రెడ్‌మీ చవక ఆప్షన్. కానీ పిక్సెల్ డబుల్ స్టోరేజ్‌తో బెస్ట్ ఆప్షన్.

డిస్‌ప్లే, రిజల్యూషన్

Advertisement

రెడ్‌మీ నోట్ 15 ప్రో+ 5Gలో 6.83 ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఉంది. 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి.
గూగుల్ పిక్సెల్ 9aలో 6.3 ఇంచ్ ఆక్టువా pOLED డిస్‌ప్లే ఉంది. 1080×2424 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ S24 FEలో 6.7 ఇంచ్ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. మూడు ఫోన్లలోనూ స్మూత్ స్క్రోలింగ్, వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి.

ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్

రెడ్‌మీ నోట్ 15 ప్రో+ 5G ఆండ్రాయిడ్ 15తో హైపర్‌ఓఎస్ 2 ఉంది.
గూగుల్ పిక్సెల్ 9a ప్యూర్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది (కస్టమ్ ఇంటర్‌ఫేస్ లేదు).
శాంసంగ్ గెలాక్సీ S24 FE ఆండ్రాయిడ్ 14తో వన్ UI సాఫ్ట్‌వేర్ ఉంది.
పిక్సెల్ ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. రెడ్‌మీలో ఎక్కువ కస్టమైజేషన్ ఉంటుంది.

ప్రాసెసర్, పెర్ఫామెన్స్

Advertisement

రెడ్‌మీ నోట్ 15 ప్రో+ 5Gలో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్ ఉంది.
గూగుల్ పిక్సెల్ 9aలో టెన్సర్ G4 ప్రాసెసర్ ఉంది.
శాంసంగ్ గెలాక్సీ S24 FEలో ఎక్సినోస్ 2400e ప్రాసెసర్ ఉంది.
మూడు ఫోన్లు రోజువారీ పనులు సులభంగా హ్యాండిల్ చేస్తాయి. పిక్సెల్ AI ఫీచర్లు, ఫోటోగ్రఫీలో మెరుగ్గా ఉంటుంది.

కెమెరా సెటప్

రెడ్‌మీ నోట్ 15 ప్రో+ 5Gలో 200MP మెయిన్ కెమెరా (OIS సపోర్ట్), 8MP అల్ట్రా-వైడ్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 32MP.
గూగుల్ పిక్సెల్ 9aలో 48MP మెయిన్ కెమెరా (OIS), 13MP అల్ట్రా-వైడ్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 13MP.
శాంసంగ్ గెలాక్సీ S24 FEలో 50MP మెయిన్ కెమెరా (OIS), 8MP టెలిఫోటో (3x ఆప్టికల్ జూమ్), 12MP అల్ట్రా-వైడ్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 10MP.
శాంసంగ్ జూమ్‌లో మెరుగ్గా ఉంటుంది. ఇమేజ్ ప్రాసెసింగ్‌లో పిక్సెల్ బెస్ట్.

బ్యాటరీ, చార్జింగ్

రెడ్‌మీ నోట్ 15 ప్రో+ 5Gలో 6500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.
గూగుల్ పిక్సెల్ 9a, శాంసంగ్ గెలాక్సీ S24 FE రెండింటిలోనూ 5100mAh బ్యాటరీ ఉంది. శాంసంగ్ 25W మాత్రమే చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
చార్జింగ్ స్పీడ్‌లో రెడ్‌మీ భారీ ఆధిక్యంలో ఉంది.

Also Read: జొమాటోలో ఫ్రీ ఆర్డర్.. పౌష్టికాహారం కోసం రివార్డ్స్.. ఎలా చేయాలంటే?

కనెక్టివిటీ ఫీచర్లు

రెడ్‌మీ నోట్ 15 ప్రో+ 5Gలో వై-ఫై, బ్లూటూత్, NFC, USB Type-C ఉన్నాయి.
పిక్సెల్ 9aలో 5G, వై-ఫై 6E, బ్లూటూత్ 5.3, NFC, USB 3.2 ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ S24 FEలో 5G, వై-ఫై 6E, బ్లూటూత్ 5.3, USB Type-C ఉన్నాయి.
పిక్సెల్, శాంసంగ్ అడ్వాన్స్ కనెక్టివిటీ స్టాండర్డ్స్ ఇస్తాయి.

రెడ్‌మీ నోట్ 15 ప్రో+ 5G ధరకు తగిన బెస్ట్ విలువ ఇస్తుంది. పిక్సెల్ 9a ప్యూర్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్, గొప్ప కెమెరాలు ఇష్టపడేవారికి బాగుంటుంది. శాంసంగ్ గెలాక్సీ S24 FE జూమ్ ఫోటోగ్రఫీ, బ్రాండ్ నమ్మకం కావాలనుకునేవారికి సరిపోతుంది.

Related News

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

Big Stories

Advertisement
×