E-Paper
Advertisement

Lord Anjaneya Swamy: ఆంజనేయ స్వామికి ఆ ఒక్క పూజ చేస్తే చాలు – అష్టైశ్వర్యాలు వరిస్తాయట

Lord Anjaneya Swamy: ఆంజనేయ స్వామికి ఆ ఒక్క పూజ చేస్తే చాలు – అష్టైశ్వర్యాలు వరిస్తాయట
Advertisement

Lord Anjaneya Swamy: ఆంజనేయ స్వామికి ఒక్క పూజ చేస్తే చాలు మీ జీవితంలో అష్టైశ్వర్యాలు వస్తాయట. అంతే కాదు ఎన్నో కష్టాలు, నష్టాల నుంచి గట్టెక్కాలంటే కూడా హనుమంతుడిని పూజించడం ద్వారానే సాధ్యమవుతుంది అంటున్నారు పండితులు. శాస్త్రం ప్రకారం హనుమంతుడిని ఎలా పూజిచాలో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

రామబంటు హనుమంతుడిని పూజించడం ద్వారానే మనుషుల తమ జీవితంలో ఎన్నో కష్టాలను దూరం చేసుకోవచ్చని పండితులు చెప్తున్నారు అయితే ఆంజనేయ స్వామిని పూజించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు.  ఒక సారి శనీశ్వరుడు తన శక్తితో ఆంజనేయస్వామిని వశపరచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని అడగ్గా.. స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు కూడా శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుందని పండితులు సూచిస్తుంటారు. అయితే ఆంజనేయస్వామిని మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా పూజించవచ్చని స్వామికి ఇష్టమైన పూలతో పూజ చేస్తే త్వరగా కరుణిస్తాడని చెప్తున్నారు.

ఆంజనేయస్వామికి ఇష్టమైన పువ్వులు:

Advertisement

తమలపాకుల దండ: ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట.. దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు. తమలపాకుల దండతో స్వామిని పూజిస్తే సకల సంపదలు ఇస్తాడని నమ్ముతారు భక్తులు.

మల్లెపూలు: ప్రతి గురువారం ఆంజనేయస్వామికి మల్లెపూలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టమట. జీవితంలో ఎలాంటి కష్టాలున్నా దూరమవుతాయట.

Advertisement

పారిజాతం పువ్వులు: ఆంజనేయస్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ఇష్టమట. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తే ఆ స్వామి త్వరగా కరుణిస్తాడట.

తులసిమాల: తులసి మాల అంటే శ్రీరాముడికి చాలా ఇష్టం. అందుకే తులసి మాల అంటే ఆంజనేయస్వామికి కూడా చాలా ఇష్టమట. తులసి మాలతో హనుమంతుడిని పూజిస్తే వెంటనే కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.

కలువ పూలు: కలువ పువ్వులు కూడా శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన పూలు. కేరళలోని ఇరింజలకుడలో భరతునుకి ఒక దేవాలయం వుంది. అందులో అతనికి కలువపూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాముల వారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాలతో పూజ చేస్తారట.

ఇక హనుమంతుడిని పలు రూపాలలో ఆరాధించడం వల్ల కూడా కష్టాలు దూరమై మనుషుల జీవితంలో శాంతి, సుఖాలు వస్తాయని చెప్తుంటారు. అలాగే పంచముఖాలు కలిగిన హనుమంతుడిని పూజించడం చాలా శ్రేష్టం అంటున్నారు. పంచముఖిలో ఏ ముఖాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

తూర్పుముఖ హనుమంతుడు: ఈ హనుముంతుడిని పూజిస్తే.. పాపాలను హరించి, చిత్త శుద్దిని కలుగ చేస్తాడట.

దక్షిణ ముఖ కరాళ ఉగ్ర నరసింహ స్వామి: ఈ ముఖ హనుమంతుడిని పూజిస్తే.. శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడట.

పడమర ముఖ మహావీర గరుడ స్వామి: ఈ హనుమంతుడిని ఆరాదిస్తే.. దుష్ట ప్రభావలను పోగొట్టి.. శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడట.

ఉత్తరముఖ లక్ష్మీ వరాహమూర్తి: ఈ ముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే  గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడట.

ఊర్ధ్వ ముఖ హయగ్రీవస్వామి: ఈ హనుమంతుడిని పూజిస్తే..  జ్ఞానాన్ని.. జయాన్ని.. మంచి జీవన సహచరిని.. బిడ్డలను ప్రసాదిస్తాడట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: చనిపోయిన తర్వాత ఆత్మ ఎటు ప్రయాణిస్తుంది – అసలు గరుడ  పురాణం ఎం చెప్తుంది

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×