E-Paper
Advertisement

Nita Ambani: అంబానీ ఫ్యామిలీని దేవుడు కూడా కాపాడ‌లేదు…RCB ట్రీట్ మెంట్ తో దూల తీరిందిగా

Nita Ambani: అంబానీ ఫ్యామిలీని దేవుడు కూడా కాపాడ‌లేదు…RCB ట్రీట్ మెంట్ తో దూల తీరిందిగా
Advertisement

Nita Ambani: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Womens Premier League 2026 )  నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ప్రారంభ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Mumbai Indians Women vs Royal Challengers Bengaluru Women) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగగా స్మృతి మందాన ( Smriti Mandhana) జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ లో 4 బంతుల్లో 18 ప‌రుగులు కావాల్సిన స‌మ‌యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయ‌ర్ డిన్ డి క్లర్క్ ( Nadine de Klerk ) అద్భుతంగా రాణించి, ముంబైని ఓడించాడు. ఆ స‌మ‌యంలో నీతా అంబానీ దేవుడికి మొక్కినా, మ్యాచ్ ఓడింది ముంబై ఇండియ‌న్స్‌.

Also Read: Tilak Varma Surgery: తెలుగోడు తిల‌క్ వ‌ర్మ‌కు ఘోర అవ‌మానం..ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు పెట్టి దారుణం ?

అంబానీ ఫ్యామిలీని దేవుడు కూడా కాపాడ‌లేదు

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Womens Premier League 2026 ) భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన ఆల్రౌండర్ నాడిన్ డి క్లర్క్ ( Nadine de Klerk ) అద్భుతంగా రాణించింది. ఏబీ డివిలియర్స్ తరహాలో ఇరగదీసింది. ముంబై ఇండియన్స్ విధించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తడబడిన సంగతి తెలిసిందే. కానీ బెంగళూరుకు చెందిన నాడిన్ డి క్లర్క్ అద్భుతంగా రాణించింది. ఈ మ్యాచ్ లో 44 బంతులలో 63 పరుగులు చేసింది.

అంతేకాదు చివరి ఓవర్ లో 4 బంతులలో 18 పరుగులు బెంగళూరు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో నీతా అంబానీ ( Nita Ambani ) ప్రత్యేక పూజలు చేసింది. తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న లార్డ్ ఫోటో తీసి మరీ మొక్కింది. అయినప్పటికీ నీతా అంబానీ జట్టు ఓడిపోయింది. ఆ 18 పరుగులను అవలీలగా నాడిన్ డి క్లర్క్ చేదించడం జరిగింది. ఈ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది చూసినా క్రికెట్ అభిమానులు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఎన్ని కోట్లు ఉన్నా.. నీతా అంబానీ ఎన్ని మొక్కులు మొక్కినా ముంబై మాత్రం ఓడిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తడాఖా అంటూ మరి కొంతమంది సెటైర్లు కూడా పేల్చుతున్నారు. ఇది ఇలా ఉండగా ఇదే మ్యాచ్ లో బౌలింగ్ లో కూడా అదరగొట్టింది నాడిన్ డి క్లర్క్. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసింది ఈ లేడీ ఏబీ డివిలియర్స్. ఇందులో 26 పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టడం జరిగింది. అటు మరో ప్లేయర్ లారెన్ బెల్ కూడా ఈ మ్యాచ్ లో ఇరగదీసింది. ఆమె నాలుగు ఓవర్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఇందులో ఒక వికెట్ తో పాటు ఒక మేడిన్ కూడా ఉంది.

Advertisement

 

Also Read: Ind vs NZ ODI Series: గంభీర్ బౌలింగ్ లో చిత‌క‌బాదిన విరాట్ కోహ్లీ..న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్‌ షెడ్యూల్

 

 

 

 

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×