E-Paper
Advertisement

జియో బంపరాఫర్.. రూ.448 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. మరెన్నో బెనిఫిట్స్!

జియో బంపరాఫర్.. రూ.448 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. మరెన్నో బెనిఫిట్స్!
Advertisement

Jio Plan: టెలికాం రంగంలో తనదైన ముద్ర వేసిన రిలయన్స్ జియో.. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లను తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం వాలిడిటీ కోరుకునే వారి కోసం జియో రూ. 448 ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. 84 రోజుల పాటు నిరంతర సేవలను అందించే ఈ ప్లాన్ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రూ.448 ప్లాన్ బెనిఫిట్స్

తక్కువ బడ్జెట్ లో ఎక్కుల రోజుల పాటు వాయిస్ కాల్స్ మాట్లాడుకోవాలని భావించే వారి కోసం జియో ఈ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద వినియోగదారులకు 84 రోజుల పాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ లభిస్తాయి. దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా మాట్లాడుకోవచ్చు. దీంతో పాటు ప్లాన్ మెుత్తం కాలానికి 1000 ఎస్ఎంఎస్ ఉచితంగా చేసుకోవచ్చు.

మరి డేటా సంగతేంటి?

Advertisement

ఈ ప్లాన్ కేవలం వాయిస్ కాల్స్ కోసం మాత్రమే జియో తీసుకొచ్చింది. కాబట్టి దీనిలో ఎలాంటి డేటా బెనిఫిట్స్ యూజర్లకు లభించవు. ఒక వేళ డేటా కావాలని భావిస్తే.. ఈ ప్లాన్ తో పాటు అదనంగా యాడ్ ఆన్ డేటా ప్యాక్స్ ను సెపరేటుగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని జియో వర్గాలు పేర్కొన్నాయి.

జియో కంటెంట్ ఫ్రీ

రూ.448 ప్లాన్ లో అదనపు ప్రయోజనాల కింద జియో కంటెంట్ ను ఫ్రీగా వీక్షించవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి జియో ప్రీమియం యాప్స్‌ను యాక్సెస్ లభించనుంది. అయితే ఈ ప్లాన్ కింద జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ మాత్రం అందుబాటులో ఉండకపోవడం గమనార్హం.

Advertisement

Also Read: BSNL సూపర్ హిట్ ప్లాన్.. రోజూ 3GB డేటా, ఫ్రీ కాల్స్.. ఏడాదంతా జాతరే!

ప్లాన్ ఎలా పొందాలంటే?

ఈ ప్లాన్‌ను చాలా సులభంగా రీఛార్జ్ చేసుకునే వెసులుబాటును జియో కల్పిస్తోంది. ఇందుకోసం ఫోన్ లోని మై జియో యాప్ ఓపెన్ చేసి రీఛార్జ్ సెక్షన్‌లోకి వెళ్లి ‘రూ. 448’ ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే అధికారిక జియో (Jio.com) వెబ్‌సైట్‌కి వెళ్లి నంబర్ ఎంటర్ చేసి ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. మరోవైపు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా ఈ ప్లాన్‌ను సులువుగా పొందొచ్చు.

Also Read: ఎండలు కాదు కదా..ఎంత ఉక్కపోతనైనా.. ఉఫ్ అని ఊదేసే 5 బెస్ట్ ఏసీలు ఇవే

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×