E-Paper
Advertisement

BSNL సూపర్ హిట్ ప్లాన్.. రోజూ 3GB డేటా, ఫ్రీ కాల్స్.. ఏడాదంతా జాతరే!

BSNL సూపర్ హిట్ ప్లాన్.. రోజూ 3GB డేటా, ఫ్రీ కాల్స్.. ఏడాదంతా జాతరే!
Advertisement

BSNL Plan: ప్రైవేట్ టెలికాం కంపెనీల రీఛార్జ్ ధరల బాదుడుతో విసిగిపోయిన కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సరికొత్త ప్లాన్లతో దూసుకుపోతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం వాలిడిటీ కోరుకునే వారి కోసం బీఎస్ఎన్ఎల్ రూ.2799 వార్షిక ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ బెనిఫిట్స్, ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.

రూ.2799 ప్లాన్ బెనిఫిట్స్

బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే దేశంలోని ఏ నెట్ వర్క్ కు అయినా అన్ లిమిటెడ్ గా కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ప్రతీ రోజూ 3 GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. డైలీ లిమిట్ అయిపోయిన తర్వాత కూడా 64 Kbps వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. ఇవే కాకుండా రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ లను నచ్చిన వాళ్లకు చేసుకోవచ్చు.

అదనపు ప్రయోజనాలు

Advertisement

కేవలం డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా ఈ ప్లాన్‌తో మరికొన్ని అదనపు ప్రయోజనాలు కూడా బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. వినియోగదారులకు ఉచితంగా బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ యాక్సెస్ పొందొచ్చు, దీని ద్వారా నచ్చిన కాలర్ ట్యూన్‌ను సెట్ చేసుకోవచ్చు. అలాగే ప్లాన్ యాక్టివేషన్‌లో ఉన్నంత కాలం కొన్ని లాయల్టీ రివార్డ్ పాయింట్లు, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసుల ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా పొందే అవకాశం ఉంది.

ఎవరికి ఉపయోగం?

ప్రతి నెలా రీఛార్జ్ చేయించుకునే ఇబ్బంది లేకుండా, ఏడాది పొడవునా నెట్‌వర్క్ యాక్టివ్‌గా ఉండాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారితి, ఆన్ లైన్ క్లాసులు వినే విద్యార్థులకు రోజుకు 3GB సరిగ్గా సరిపోతుంది. మరోవైపు తక్కువ బడ్జెట్ తో ఆల్ రౌండ్ బెనిఫిట్స్ తో ఏడాది పొడవునా మంచి ప్యాక్ కోరుకునే వారికి సైతం ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ప్రయోజనకరంగా ఉండనుంది.

Advertisement

Also Read: వాషింగ్ మెషీన్ కొంటున్నారా? మెటల్ బాడీ కంటే ప్లాస్టిక్ బాడీనే ఎందుకు బెస్ట్ ?

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

ఈ ప్లాన్ ను పలు మార్గాల్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. మొబైల్‌లోని MyBSNL యాప్ లేదా బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్ లోనూ ప్లాన్ అందుబాటులో ఉంది. ఆయా యాప్స్ లోని బీఎస్ఎన్ఎల్ మెుబైల్ నెంబర్ ఎంటర్ చేసి.. వార్షిక ప్లాన్స్ సెక్షన్ లోకి వెళ్తే.. రూ.2,799 ప్లాన్ కనిపిస్తుంది. లేదంటే సమీపంలోని రిటైల్ షాపుల్లోకి వెళ్లైనా ప్లాన్ ను పొందొచ్చు.

Also Read: హైబ్రిడ్ SUV సెగ్మెంట్‌ లో BYD ఎంట్రీ.. ఏకంగా 1200 కి.మీ రేంజ్ కారు రెడీ!

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×