E-Paper
Advertisement

హోటళ్లలో QR కోడ్ స్కాన్ చేస్తున్నారా? జాగ్రత్త సుమీ.. ఈ ఒక్క తప్పుతో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వొచ్చు!

హోటళ్లలో QR కోడ్ స్కాన్ చేస్తున్నారా? జాగ్రత్త సుమీ.. ఈ ఒక్క తప్పుతో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వొచ్చు!
Advertisement

Restaurant QR Code Scams: సాధారణంగా ఏదైనా హోటల్‌కో, రెస్టారెంట్‌కో వెళ్తే అక్కడ టేబుల్‌పై ఒక QR కోడ్ కనిపిస్తోంది. ఫోన్ తీసి దాన్ని స్కాన్ చేస్తే చాలు.. మెనూ మొత్తం స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. చూడటానికి ఇది చాలా సులువుగా, ఆధునికంగా అనిపించినా, దీని వెనుక పెద్ద ముప్పే దాగుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల పూణేలో ఒక మహిళకు ఎదురైన చేదు అనుభవం దీనికి ఒక ఉదాహరణ. ఆమె ఒక రెస్టారెంట్‌లో మెనూ కోసం QR కోడ్ స్కాన్ చేయగా, ఆమె మొబైల్ నెంబర్ అక్కడి సిబ్బందికి చేరింది. ఆ తర్వాత ఆమెకు తెలియని నెంబర్ల నుండి వేధింపుల కాల్స్, మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. ఈ ఘటన డిజిటల్ భద్రతపై అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది.

థర్డ్ పార్టీ యాప్‌ల వల్లే ముప్పు:

చాలా రెస్టారెంట్లకు స్వంతంగా డిజిటల్ మెనూ సిస్టమ్స్ ఉండవు. వారు బయటి కంపెనీల (థర్డ్ పార్టీ) సాఫ్ట్‌వేర్‌లను వాడుతుంటారు. మనం QR కోడ్ స్కాన్ చేసినప్పుడు, ఆయా ప్లాట్‌ఫారమ్‌లు మన ఫోన్ వివరాలు, లొకేషన్, కాంటాక్ట్స్ వంటివి సేకరించే అవకాశం ఉంది. అక్కడ భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేకపోతే, మన వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంది.

నకిలీ కోడ్‌లతో జాగ్రత్త:

Advertisement

ఇంకొక పెద్ద ప్రమాదం ఏమిటంటే.. కేటుగాళ్లు ఒరిజినల్ QR కోడ్‌ల పైన సరిగ్గా సరిపోయేలా నకిలీ స్టిక్కర్లను అంటిస్తున్నారు. వీటిని స్కాన్ చేయగానే, అవి మనల్ని వేరే దొంగ వెబ్‌సైట్లకు తీసుకెళ్తాయి. అక్కడ మన బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు అడగడం లేదా ఫోన్లలోకి హానికరమైన యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం వంటివి జరుగుతాయి.

Also Read: ఈ ఫోన్‌తో రీల్స్ చేస్తే వ్యూస్ రాకెట్‌లా దూసుకెళ్తాయ్.. 4K ఫ్లాష్ రికార్డింగ్‌తో Honor 600 సంచలనం!

పబ్లిక్ Wi-Fiతో మరింత రిస్క్:

Advertisement

చాలామంది హోటళ్లకు వెళ్లినప్పుడు అక్కడి ఫ్రీ వైఫై వాడుతుంటారు. ఈ ఉచిత ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యి QR కోడ్‌లు స్కాన్ చేయడం, ఆన్‌లైన్ పేమెంట్లు చేయడం చాలా ప్రమాదకరం. ఇలాంటి ఓపెన్ నెట్‌వర్క్‌లను హ్యాక్ చేయడం సైబర్ నేరగాళ్లకు చాలా తేలిక.

వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు:

సాధారణంగా హోటల్ మెనూ చూడటానికి మన ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీ అవసరం లేదు. కానీ కొన్ని వెబ్‌సైట్లు లాగిన్ అవ్వమని అడుగుతుంటాయి. అలాంటప్పుడు అనుమానం వస్తే వెంటనే ఆ సైట్‌ను క్లోజ్ చేయడం మంచిది. అలాగే టేబుల్‌పై ఉన్న స్టిక్కర్ ఏమైనా చిరిగిపోయి, దానిపై ఇంకో స్టిక్కర్ అంటించినట్టు ఉంటే అస్సలు స్కాన్ చేయవద్దు.

అప్రమత్తతే ఏకైక మార్గం:

టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేస్తున్న మాట నిజమే అయినా, కాస్త అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. హోటల్ యాజమాన్యాలు కూడా తమ కస్టమర్ల డేటా దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. కస్టమర్లు కూడా కేవలం మెనూ కార్డుల కోసమే కాకుండా, డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు కూడా QR కోడ్‌లను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవడం మంచిది.

Also Read: టెక్ లవర్స్‌కు పూనకాలే.. Xiaomi 18 కంటే ముందే మార్కెట్లోకి Redmi K100, ఇక విధ్వంసమే!

 

 

 

 

Related News

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×