Shahid Afridi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 80% మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. మరో 20% మ్యాచ్ లు జరిగితే టోర్నమెంట్ కూడా ఫినిష్ కానుంది. ఇలాంటి క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీని (virat Kohli) ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అతన్ని టార్గెట్ చేసి రెచ్చిపోతున్నారు. లేటెస్ట్ గా విరాట్ కోహ్లీని ఉద్దేశించి షాహిద్ అఫ్రిది (Shahid Afridi) కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ఫాలోవర్లను (Hindu followers) సంపాదించుకునేందుకు గుల్లకు వెళ్లి విరాట్ కోహ్లీ ప్రత్యేక పూజలు చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. ఈ పూజలన్నీ ఇన్ స్టాగ్రామ్ లో (Instagram) ఫాలోవర్ల కోసం మాత్రమే అంటూ బాంబు పేల్చాడు. అంతేతప్ప విరాట్ కోహ్లీకి హిందూ దేవుళ్ళు అంటే పెద్దగా ఇష్టం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు షాహిద్ ఆఫ్రిది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు లో అద్భుతంగా రాణిస్తున్న విరాట్ కోహ్లీ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అతని హిందుత్వ భావాలను దెబ్బతీసేలా కించపరుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ హిందుత్వం పైన ఇంజమామ్, తన్వీర్ అహ్మద్ వ్యాఖ్యలు చేయగా.. ఇందులోకి షాహిద్ ఆఫ్రిది కూడా వచ్చాడు. విరాట్ కోహ్లీ నిత్యం హిందూ దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు అన్న సంగతి తెలిసిందే. లండన్ లో ప్రస్తుతం ఉంటున్న విరాట్ కోహ్లీ దంపతులు… ఇండియాకు వచ్చినప్పుడు అల్లా నార్త్ ఇండియా లో ఉన్న దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ విరాట్ కోహ్లీ దంపతుల పైన షాహిద్ ఆఫ్రిది హాట్ కామెంట్స్ చేశారు. హిందూ దేవాలయాలలో పూజలు చేస్తూ భారతీయులను విరాట్ కోహ్లీ దంపతులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
విరాట్ కోహ్లీ దంపతులు దొంగ పూజలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో హిందువులను ఫాలోవర్లుగా సంపాదించుకునేందుకుగాను ఇలా ప్రత్యేక పూజలు చేస్తూ ఫోజులు కొడతారని మండిపడ్డారు. ఎవరైనా దేవాలయాలకు వెళితే సీక్రెట్ గా వెళ్లి పూజలు చేస్తారని షాహిద్ అఫ్రిది తెలిపారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఏ దేవాలయానికి వెళ్లిన సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యేలా తన టీం తో కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. తద్వారా హిందువులందరూ విరాట్ కోహ్లీని ఫాలో అయ్యేలా స్కెచ్ వేస్తున్నాడని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. అంతేతప్ప విరాట్ కోహ్లీకి హిందుత్వం పైన పెద్దగా నమ్మకం లేదని.. అందుకే క్రైస్తవ దేశమైన లండన్ లో సెటిల్ అయ్యాడని ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా భారతదేశంలో ఉన్న హిందువులు విరాట్ కోహ్లీ మోసాల నుంచి బయటపడాలన్నారు షాహిద్ అఫ్రిది.