E-Paper
Advertisement

Robot Sense Pain: మనిషిలా స్పర్శను తెలుసుకోగల రోబోలు.. కొత్త టెక్నాలజీ చర్మాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

Robot Sense Pain: మనిషిలా స్పర్శను తెలుసుకోగల రోబోలు.. కొత్త టెక్నాలజీ చర్మాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
Advertisement

Robot Sense Pain With Electronic Skin| అన్ని రంగాల్లో ఇప్పుడు రోబోలు, ఏఐ టెక్నాలజీదే హవా. ఈ రోబోలు కాలంతోపాటు మనిషిలాగా అన్ని పనులు చేయగలుగుతున్నాయి. అయితే ఇంతవరకూ మనుషులకు, రోబోలకు అతిపెద్ద ఉన్న అతిపెద్ద తేదా భావోద్వేగాలు (ఫీలింగ్స్), మనిషిలాగా స్పర్శను అనుభూతి చేయడం. మనుషులు ఇవి చేయగలరు. కానీ రోబోలు ఇవి చేయలేరు.

కానీ తాజాగా శాస్త్రవేత్తలు రోబోలు నొప్పి లాంటి అనుభూతి పొందేలా చేసే బ్రేక్‌త్రూ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ రోబోలు టచ్, ప్రెషర్, హానికరమైన ఫోర్స్‌కు సురక్షితంగా రియాక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. భద్రత, మనుషులతో రోబోల ఇంటరాక్షన్ మెరుగుపరచడానికి ఈ సిస్టమ్ రూపొందించారు.

మనిషి నాడీ వ్యవస్థను కాపీ చేసే టెక్నాలజీ

Advertisement

ఈ కొత్త టెక్నాలజీని హాంకాంగ్ సిటీ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. మనుషుల నాడీ వ్యవస్థ (నరాలు) ను అనుకరించే ప్రత్యేక ఎలక్ట్రానిక్ స్కిన్ (చర్మాన్ని) డిజైన్ చేశారు. ఈ స్కిన్ రోబోలు మెత్తని టచ్, ప్రమాదకరమైన ప్రెషర్‌ మధ్య తేడాలతో గుర్తించడానికి సహాయపడుతుంది.

సాధారణ స్పర్శ, నొప్పి వేర్వేరుగా ఫీలింగ్

మనుషుల శరీరంలో సాధారణ టచ్, నొప్పి ఈ రెండు భిన్న నరాల ద్వారా ప్రాసెస్ అవుతాయి. మెత్తని టచ్ బ్రెయిన్‌కు సిగ్నల్స్ పంపి అవగాహన, రెస్పాన్స్ ఇస్తుంది. నొప్పి కలిగించే ప్రెషర్ శరీరాన్ని రక్షించడానికి వేగవంతమైన రిఫ్లెక్స్ యాక్షన్‌ను ట్రిగ్గర్ చేస్తుంది. రోబో స్కిన్ డిజైన్‌లో మనుషి శరీరంలోని ఈ బయోలాజికల్ ప్రాసెస్‌ను కాపీ చేశారు. ఎలక్ట్రానిక్ స్కిన్ ఇంటెన్సిటీ, ప్రెషర్ లెవల్స్ ఆధారంగా సిగ్నల్స్ ప్రాసెస్ చేస్తుంది. దీంతో రోబోలు తమ పరిసరాలకు ఇంటెలిజెంట్‌గా స్పందిస్తాయి.

ఈ ఎలెక్ట్రానిక్ స్కిన్ ఎలా పనిచేస్తుంది?

Advertisement

సాంప్రదాయ రోబోటిక్ స్కిన్స్ కేవలం ప్రెషర్ లెవల్స్‌ను మాత్రమే కొలుస్తాయి. ఫ్రెండ్లీ టచ్, ప్రమాదకరమైన ఇంపాక్ట్‌ను వేరు చేయలేవు. కొత్త ఎలక్ట్రానిక్ స్కిన్ ఈ లిమిట్ సమస్యను పరిష్కరిస్తుంది. ఫిజికల్ టచ్‌ను ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌గా మారుస్తుంది. ఈ సిగ్నల్స్ మనుషుల నరాల సిగ్నల్స్‌కు చాలా దగ్గరగా పోలి ఉంటాయి. బలమైన ప్రెషర్ కలిగితే బలమైన, భిన్న సిగ్నల్ ప్యాటర్న్స్ సృష్టిస్తుంది. రోబోలు సేఫ్ టచ్, హానికరమైన ఫోర్స్‌ను తక్షణం గుర్తిస్తాయి.

త్వరగా ఆత్మరక్షణ చేసుకోగల రోబోలు

ఈ ఎలక్ట్రానిక్ స్కిన్‌లో నాలుగు ఫంక్షనల్ లేయర్లు ఉన్నాయి. ప్రతి లేయర్ బయోలాజికల్ నరాల రోల్‌ను పోషిస్తుంది. ఈ లేయర్లు కలిసి టచ్‌ను సమర్థవంతంగా ప్రాసెస్ చేస్తాయి. మెత్తని కాంటాక్ట్ సిగ్నల్స్ రోబో సెంట్రల్ ప్రాసెసర్‌కు పంపుతుంది. ఇది మనుషులు, ఆబ్జెక్టులతో సురక్షిత ఇంటరాక్షన్‌కు సహాయపడుతుంది. ప్రెషర్ నొప్పి థ్రెషోల్డ్ దాటితే సిస్టమ్ ప్రవర్తన మారుతుంది. సిగ్నల్స్ మెయిన్ ప్రాసెసర్ బైపాస్ చేసి నేరుగా మోటార్లకు చేరతాయి. దీంతో ఆలస్యం లేకుండా తక్షణ మూవ్‌మెంట్ జరుగుతుంది. మనుషుల రిఫ్లెక్స్ లాగా రోబో వెంటనే వెనక్కి తగ్గుతుంది.

ఈ డైరెక్ట్ సిగ్నల్ పాత్ రియాక్షన్ టైమ్‌ను గణనీయంగా తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అంటే వేగవంతమైన రెస్పాన్స్‌లు రోబోలు డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. దగ్గరలో ఉన్న మనుషులు కూడా సురక్షితంగా ఉంటారు. రోబో లోపల లోకల్ పెయిన్ రెస్పాన్స్ సృష్టిస్తుంది. కాంప్లెక్స్ ప్రాసెసింగ్ అవసరం లేకుండా సహజంగా భద్రత మెరుగవుతుంది.

Also Read: ఇక లాయర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. వాట్సాప్‌లో ఉచిత న్యాయ సలహా

రోబోలు తమ ఆరోగ్యాన్ని అంచనా వేయగలవు

ఈ ఎలక్ట్రానిక్ స్కిన్ సాయంతో రోబోలు తమ ఆరోగ్య స్థితిని నిరంతరం మానిటర్ చేయగలవు. ప్రతి సెన్సార్ సాధారణంగా చిన్న సిగ్నల్ పంపుతుంది. ఇది స్కిన్ సరిగా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది. స్కిన్ చిరిగిపోతే లేదా బ్రేక్ అయితే సిగ్నల్ ఆగిపోతుంది. రోబో వెంటనే డ్యామేజ్ లొకేషన్‌ను గుర్తిస్తుంది. ఇది వేగవంతమైన మెయింటెనెన్స్, సేఫ్టీ చెక్స్‌కు సహాయపడుతుంది.

రిపేర్ చేయడం ఈజీ.. సమస్యకు వెంటనే పరిష్కారం

ఎలక్ట్రానిక్ స్కిన్ స్వయంగా రిపేర్ కాలేదు. కానీ రిపేర్ ప్రాసెస్ సింపుల్, వేగవంతమైనది. స్కిన్ మాగ్నెటిక్ మాడ్యులర్ కంపోనెంట్లతో ఉంటుంది. ఇవి బిల్డింగ్ బ్లాక్స్ లాగా కనెక్ట్ అవుతాయి. డ్యామేజ్ అయిన పార్ట్స్‌ను సెకన్లలో మార్చేయవచ్చు. మొత్తం రోబో భాగాలను విడదీయాల్సిన అవసరం ఉండదు. ఇది టైమ్, శ్రమ, మెయింటెనెన్స్ ఖర్చులను ఆదా చేస్తుంది.

ఈ టెక్నాలజీ రోబోలను మరింత సురక్షితంగా, స్మార్ట్‌గా చేస్తుంది. వర్క్‌ప్లేస్‌లు, ఇళ్లలో మనుషులు-రోబోట్ల ఇంటరాక్షన్ మెరుగవుతుంది. భవిష్యత్తు రోబోలు మరింత సహజంగా, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాయి. ఈ ఇన్నోవేషన్ రోబోటిక్స్‌ను మార్చివేస్తుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

Related News

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

Big Stories

Advertisement
×