E-Paper
Advertisement

CM Revanth Reddy: పండుగ వేల రైతు భరోసా నిధుల పై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి..!

CM Revanth Reddy: పండుగ వేల రైతు భరోసా నిధుల పై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి..!
Advertisement

CM Revanth Reddy: హైదరాబాద్‌ రవీంద్రభారతిలో పంచాంగ శ్రవణంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంత్సరం రైతునామ సంవత్సరమని సీఎం అన్నారు. ఉగాది పండుగ అనేది వ్యవసాయ రైతులకు ఇదొక గొప్ప పండుగని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజును చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు. రాష్ట్రంలో పండించిన పంటలను కొనడానికి ముదుకు రాని సందర్బంలో వ్యవసాయానికి సంభందించిన అన్నీ పంటలకు గిట్టుబాటు ధరకు కొంటూ.. రైతులకు భోనస్ ఇస్తున్న ఎకైక ప్రభుత్వం మాదని సీఎం రేవంత్ అన్నారు.

రైతుకు 2 లక్షల రుణమాఫీ..

గతంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటనలో దేశంలోనే అతి తక్కువ రుణభారం కలిగిన రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించడం మనందరికి ఎంతో గర్వకారణం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 70 శాతం అందరు వ్యవసాయాదారిత కుటుంబాలే అని అన్నారు. రాష్ట్రంలో ఐటి, పరిశ్రమలు ఎన్నివచ్చిన మన ప్రధాన జీవనాదారం మాత్రం వ్యవసాయమని అన్నారు. 25 లక్షల 35 వేల మందికి గాను 20వేల 616 కోట్ల రూపాయలతో ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసి రైతులందరిని రుణ విముక్తులను చేసి, వారిని గౌరవంగా బ్రతకడాని తెలంగాణ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం 12000 రూపాయలను అందిస్తుందని తెలిపారు. దాదాపుగా ఈ రోజు వరకు 18వేల కోట్ల రూపాయలను రైతులకు రైతు భరోసా పథకం కింద ఖర్చు పెట్టామని అన్నారు.

Advertisement

Also Read: Rajya Sabha: రాజ్యసభ సీట్ల కేటాయింపులపై విభేదాలు.. గుర్రుమంటున్న సీనియర్లు

22 నుండి రైతు భరోసా కార్యక్రమం

రేపు వచ్చే 22 తేది నుండి మల్లీ రైతు భరోసా కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించబోతున్నారని అన్నారు. ఈ సందర్బంగా రైతులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఎరువులు, పండిచే పంటలకు విశ్వాసం కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతులకు మేలులు రైతుల సంక్షేమంకోసం రైతు భందు, రైతు భరోసాలాంటి పథకం, ఉచిత కరెంట్ పెట్టి వారి అభివృద్దికి సహయ పడుతున్నామని అన్నారు. ఆ నాడు గత ప్రభుత్వం ధరణి తీసుకువచ్చి రైతులకు భూతమై భాదపెడుతున్నప్పుడు భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి తమ భూమికి పూర్తి హక్కులను కల్పించామని సీఎం తెలిపారు. త్వరలో సాదాబైనామాలకు కూడా మా ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

Also Read: Moinabad Drugs Case: ఫార్మ్​ హౌస్​ డ్రగ్స్​ కేసులో మరో సంచలనం

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×