E-Paper
Advertisement

Samsung Galaxy S24 FE: ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై క్రేజీ ఆఫర్.. ట్రిపుల్ కెమెరా, ప్రీమియం ఫీచర్లతో అదిరిపోయే డీల్!

Samsung Galaxy S24 FE: ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై క్రేజీ ఆఫర్.. ట్రిపుల్ కెమెరా, ప్రీమియం ఫీచర్లతో అదిరిపోయే డీల్!
Advertisement

Samsung Galaxy S24 FE: బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లు ఉన్న శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ ‘Samsung Galaxy S24 FE’ స్మార్ట్‌ఫోన్ మీకోసమే. ప్రస్తుతం ఈ ఫోన్ భారీ ఆఫర్‌తో రూ.30,000 లోపు ధరకే అందుబాటులో ఉంది. ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ పనితీరు, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఈ హ్యాండ్ సెట్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ డీల్‌లో బ్యాంక్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో ఇలాంటి శాంసంగ్ ఫోన్‌ను బడ్జెట్‌లో కొనుగోలు చేసే మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు.

బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు:

రూ.30వేల లోపు కొత్త ఫోన్ కోసం చూస్తున్నవాళ్లకి శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్‌ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ప్రీమియం డిజైన్, ట్రిపుల్ కెమెరా, మెరుగైన పెర్ఫార్మెన్స్ వంటి ఫీచర్లు ఉండటం వలన ఈ ఫోన్‌ను చాలామంది యూజర్లు ఇష్టపడవచ్చు.

Advertisement

Read Also: అమెజాన్‌లో మోటోరొలా ఎడ్జ్ 50 ప్రోపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.18,650 ధర తగ్గింపు!

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే:

ఈ శాంసంగ్ గెలాక్సీ S24 FE.. 6.7 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో లభిస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ద్వారా స్మూత్ విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది శాంసంగ్ ఎక్సినోస్ 2400e ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్ 8GB RAM, 256GB స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంది. 4,700mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రోజువారీ వాడకానికి సరిపోతుంది. ఇక ఫొటోగ్రఫీ కోసం అయితే, ఈ ఫోన్ 50MP ప్రైమరీ, 12MP అల్ట్రావైడ్, 8MP టెలిఫొటో రియర్ కెమెరా సెటప్‌, ఫ్రంట్‌లో 10MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

డిస్కౌంట్ వివరాలు:

Advertisement

ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 FE ధర ప్రస్తుతం రూ33,999. అయితే Axis బ్యాంకు లేదా SBI క్రెడిట్ కార్డ్ ద్వారా అదనంగా రూ4వేలు తగ్గింపు పొందొచ్చు. దీంతో ఈ ఫోన్ ఫైనల్ ధర రూ30వేల లోపు తగ్గుతుంది. అలాగే EMI ద్వారా ఈ ఫోన్‌ను కొనాలనుకుంటే.. నెలకు రూ.2,834 చెల్లించుకోవచ్చు. అలాగే మరింత ధర తగ్గింపు కోరుకుంటే పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.31,350 వరకు వాల్యూ పొందొచ్చు. అదనంగా, ఎక్స్‌టెండెడ్ వారంటీ, మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఉత్తమ డీల్:

ఈ హ్యాండ్ సెట్ ఇప్పుడు బడ్జెట్‌లో ఫ్లాగ్‌షిప్ లెవల్ ఫీచర్లతో అందుబాటులో ఉంది. ట్రిపుల్ కెమెరా, ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ చిప్‌సెట్, భారీ బ్యాటరీతో ఇది రూ.30వేల లోపే లభించడం అనేది ఉత్తమ డీల్ అని చెప్పవచ్చు.

Read Also: ప్రీమియం మార్కెట్‌ను కుదిపేయనున్న వన్‌ప్లస్ 15R.. విడుదలకు ముందే ధర, ఫీచర్స్ లీక్!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×