E-Paper
Advertisement

IPL Auction 2026: చోటా మ‌లింగా మతీషా పతిరానాకు జాక్ పాట్‌..ఏకంగా రూ.18 కోట్లు, ఎవ‌రు కొన్నారంటే ?

IPL Auction 2026:  చోటా మ‌లింగా మతీషా పతిరానాకు జాక్ పాట్‌..ఏకంగా రూ.18 కోట్లు, ఎవ‌రు కొన్నారంటే ?
Advertisement

IPL Auction 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ( Indian Premier League 2026 Tournament ) మినీ వేలం నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు ఊహించిన ప్లేయర్లపై కోట్ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీలంక యంగ్ బౌలర్, చోటా మలింగా మతీష పతిరానాకు ( MATHEESHA PATHIRANA ) జాక్ పాట్ తగిలింది. అతన్ని ఏకంగా 18 కోట్లకు కొనుగోలు చేసింది కేకేఆర్ జట్టు. ఈ మినీ వేలంలో అత్యధిక డబ్బులు ఉన్న కేకేఆర్, ఇప్పటికే కామెరాన్‌ గ్రీన్ ను 25.20 కోట్లకు దక్కించుకోగా, ఇప్పుడు మాజీ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ మతీష పతిరానాను 18 కోట్లకు దక్కించుకుంది. ఈ యార్కర్ల స్పెషలిస్టు కోసం ఢిల్లీతో పాటు లక్నో కూడా పోటీపడ్డాయి. కానీ ఎక్కువ డబ్బులు ఉన్న కేకేఆర్, మతీష పతిరానాను సొంతం చేసుకుంది. కాగా మతీష పతిరానా గ‌తంలో చెన్నై సూపర్ కింగ్స్ కు ( CSK) ప్రాతినిధ్యం వ‌హించాడు.

Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో మార్పు…నేడే మినీ వేలం, టైమింగ్స్, ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే

విదేశీ ప్లేయ‌ర్ల‌లో కామెరాన్ గ్రీన్ స‌రికొత్త రికార్డు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) మినీ వేలంలో ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు కామెరాన్ గ్రీన్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది కేకేఆర్. ఈ మినీ వేలంలో కామెరాన్ గ్రీన్ ను 25.20 కోట్లకు దక్కించుకుంది. దీంతో కామెరాన్ గ్రీన్ ( Cameron Green ) సరికొత్త రికార్డు సృష్టించాడు. విదేశీ ప్లేయర్లలో అత్యధిక ధ‌ర‌ పలికిన ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. అంతకు ముందు మిచెల్ స్టార్క్ కు 24.75 కోట్లు పలికాడు. అయితే ఇప్పుడు ఆ రికార్డును కామెరాన్ గ్రీన్ బద్దలు కొట్టి మొదటి స్థానంలో నిలిచాడు.

 

Advertisement

 

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు

రిషబ్ పంత్ – 27 కోట్లు.
శ్రేయాస్ అయ్యర్ – 26.75 కోట్లు.
కామెరాన్ గ్రీన్ – 25.20 కోట్లు.
మిచెల్ స్టార్క్ – 24.75 కోట్లు.
వెంకటేష్ అయ్యర్ – 23.75 కోట్లు.

 

Also Read: Vaibhav Suryavanshi: 3 ఏళ్లుగా అదే చెబుతున్నావ్, వైభ‌వ్ ఏజ్ పై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్రోల్స్‌.. ఛీట‌ర్ అంటూ అరుపులు

 

 

Related News

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×