Galaxy A07 5G: శాంసంగ్ తన స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ-లెవల్ A-సిరీస్‌ను మరింత విస్తరిస్తూ కొత్తగా గెలాక్సీ A07 5Gని విడుదల చేసింది. ఈ ఫోన్, గతంలో వచ్చిన Galaxy A07 4G మోడల్‌కు 5G వేరియంట్‌గా వచ్చింది. ఈ డివైస్ ముఖ్యంగా బ్యాటరీ బ్యాక్‌అప్, స్మూత్ డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌పై దృష్టి పెట్టింది. బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని శాంసంగ్ ఈ ఫోన్‌ను డిజైన్ చేసింది.
శాంసంగ్ గెలాక్సీ A07 5G ను ప్రస్తుతం మయన్మార్ మార్కెట్‌లో మాత్రమే విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు మెమరీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB RAM, 128GB స్టోరేజ్ మోడల్ ధర 5,499 TBH గా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.15,900 అవుతుంది.
6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 5,999 TBH గా ఉంది. భారత కరెన్సో లో దాదాపు రూ.17,500.
ఫోన్ లైట్ వయోలెట్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం భారత్‌లో ఈ ఫోన్ లాంచ్ గురించి శాంసంగ్ అధికారిక ప్రకటన చేయలేదు.
గెలాక్సీ A07 5G లో పెద్ద 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే PLS LCD ప్యానెల్‌ను ఉపయోగిస్తుంది. HD+ రిజల్యూషన్ రోజువారీ వినియోగానికి సరిపోతుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ ఉండడం ప్రత్యేకం. దీంతో స్క్రోలింగ్‌ను చాలా స్మూత్‌గా చేస్తుంది. డిస్‌ప్లే గరిష్టంగా 800 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. ఇది బయట వెలుతురు ఉన్నా స్పష్టంగా కనిపిస్తుంది. ఫోన్‌లో వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్ ఉపయోగించారు.
ఈ ఫోన్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ రోజువారీ పనులు మరియు మల్టీటాస్కింగ్‌కు సరిపోతుంది. ఫోన్ 4GB లేదా 6GB RAM ఆప్షన్లలో లభిస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ 128GB గా ఉంటుంది. microSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు. ఫోన్‌లో డ్యుయల్ ఫిజికల్ SIM స్లాట్‌లు ఉన్నాయి. గెలాక్సీ A07 5G Android 16 తో వస్తుంది. ఇది Samsung One UI ఆధారిత ఇంటర్‌ఫేస్‌పై నడుస్తుంది. శాంసంగ్ ఈ ఫోన్‌కు ఆరు ప్రధాన Android అప్‌డేట్స్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ ఫీచర్ బడ్జెట్ సెగ్మెంట్‌లో చాలా అరుదుగా కనిపిస్తుంది.
Also Read: నిజ జీవితంలో జేమ్స్ బాండ్ గాడ్జెట్స్.. ఈ టెక్నాలజీ మీకూ కావాలా?
గెలాక్సీ A07 5G లో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రధానంగా 50MP ప్రైమరీ కెమెరా అందించారు. ఇది పగటివేళ ఎండలో కూడా మంచి ఫోటోలను తీస్తుంది. 2MP డెప్త్ సెన్సార్ పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీకి సహాయపడుతుంది. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది వీడియో కాల్స్, సోషల్ మీడియాకు సరిపోతుంది. వీడియో రికార్డింగ్ 1080p 30fps వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్‌లో భారీ 6,000mAh బ్యాటరీ ఉంది. ఇది ఒక రోజు కంటే ఎక్కువ బ్యాటరీ బ్యాక్‌అప్ ఇస్తుంది. ఫోన్ ఎక్కువగా వినియోగించే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. IP54 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కూడా అందించారు. 5G Sub-6, డ్యుయల్‌బ్యాండ్ Wi-Fi, USB Type-C సపోర్ట్ ఉన్నాయి.