E-Paper
Advertisement

Jagitial District: వేధింపుల తట్టుకోలేక, ఇంటికి వచ్చి టీచర్ సూసైడ్, అసలేం జరిగింది?

Jagitial District: వేధింపుల తట్టుకోలేక, ఇంటికి వచ్చి టీచర్ సూసైడ్, అసలేం జరిగింది?
Advertisement

Jagitial District: ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు భర్త చేసిన అప్పుల నేపథ్యంలో టీచర్ ఆత్మహత్యకు పాల్పడింది. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి తీవ్ర మనస్థాపానికి గురైంది. సంచలనం రేపిన ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో వెలుగుచూసింది. మృతురాలి పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

జగిత్యాల జిల్లాలో దారుణం

Advertisement

వరంగల్ జిల్లా రాయపర్తిలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది రమ్య సుధా. విద్యాబుద్ధులు నేర్పే వృత్తిలో ఉంటూ ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలవలేకపోయింది. జీవితంలో ఎదురైన సమస్యలకు తలవంచడం అందరినీ కలిచి వేసింది. సంక్రాంతి పండుగ వేళ కుటుంబంతో గడపాలని ఆశతో రెండు రోజుల కిందట కోరుట్లలోని తన నివాసానికి వచ్చింది. పండుగ వెలుగులు నిండాల్సిన ఆ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

రమ్యసుధా టీచర్ కాగా, భర్త శ్రీధర్ కోరుట్లలో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల్లో భారీగా అప్పులు చేశాడు. భార్య ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమె పేరిట అప్పులు తీసుకున్నాడు. కొంతకాలంగా అప్పులు తీర్చాలంటూ శ్రీధర్, తన భార్యపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు వడ్డీ వ్యాపారులు. దీంతో టీచర్ ఇంట్లో తరచూ గొడవలు జరగడం మొదలయ్యాయి.

Advertisement

భర్త వ్యవహారం.. టీచర్ సూసైడ్

ఇలాంటి కారణాలతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యింది ఆమె. గౌరవప్రదమైన వృత్తిలో ఉండి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడం మరింత కుంగిపోయింది. పండుగ సెలవులకు ఇంటికి వచ్చింది. అప్పుల విషయమై దంపతుల మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. భర్త వేధింపులు అధికం కావడంతో తన పేరు మీదున్న అప్పులు ఎలా తీర్చాలో తెలియని స్థితిలో పడింది రమ్య సుధా.

సోమవారం గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. కళ్ల ముందు కూతురు మరణం చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. విద్యావంతురాలు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటం ఆ కాలనీ వాసులు దిగ్భ్రాంతికి గురిచేసింది.

ALSO READ:  కత్తి కన్నా డేంజర్.. పీకలు కోస్తున్న చైనా మాంజా

మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త శ్రీధర్ వేధింపుల వల్ల తన కూతురి మరణానికి కారణమని అందులో ప్రస్తావించారు. ఆ స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీధర్ ఆర్థిక లావాదేవీలు ఎంత మేరా ఉన్నాయి? సుధా పేరుతో ఎక్కడెక్కడ అప్పులు చేశాడు? అనే కోణంలో లోతుగా ఆరా తీస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి ఫ్యామిలీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×