E-Paper
Advertisement

Ysrcp : అంతా అయిపోయాక మీరు చేసేది ఏముంది?

Ysrcp : అంతా అయిపోయాక మీరు చేసేది ఏముంది?
Advertisement

వైఎస్సార్‌సీపీ నేతలపై పంచులు పేలుతున్నాయి.చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉంది వారి లెక్క అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. రాష్ట్ర రాజధాని అంశంలో వారు ఆలస్యంగా స్పందిస్తున్నారని, ఒకవేళ వారి వల్ల కాదు అని తెలిసినప్పుడు మౌనంగా ఉంటే కదా? అని పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు.ఎందుకంటే పార్లమెంటులో వైసీపీకి బలం లేదు. ఆ పార్టీకి మద్దతు ఇచ్చేవారూ లేరు.ఏపీలో అధికార కూటమి సర్కార్ కొలువుదీరింది.గతంలో తెలుగుదేశం సర్కారు ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసింది. అక్కడ రాజధానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిర్మాణాలు చేపట్టింది. తాత్కాలిక అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణం చేపట్టింది.

జగన్ సర్కార్ రాకతో..

2019లో జగన్ సర్కార్ రాకతో అమరావతి సీన్ మారిపోయింది. రాజధానిగా అప్పటివరకు ఏపీ ప్రజలు భావించారు. కానీ,జగన్ మాత్రం రాజధానిగా అమరావతిని అంగీకరించలేదు.అక్కడ అంతా రియల్ఎస్టేట్ వ్యాపారం జరిగిందని, టీడీపీ నేతలు జోరుగా భూములు కొన్నారంటూ కొత్తగా తెరపైకి మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారు. ఆ తర్వాత ఐదేండ్ల పాటు ఏపీకి సరైన రాజధాని ఎంపిక లేకుండానే వైసీపీ పాలన కొనసాగింది.తీరా 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక జగన్ తెచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం పక్కనబెట్టింది.మరోసారి అమరావతినే ఏపీ రాజధానిగా నిర్ణయించింది. 2019కు ముందు ఎక్కడి వరకు నిర్మాణాలు జరిగాయో వాటిని పరిశీలించి అక్కడ శరవేగంగా నిర్మాణ పనులను మొదలెట్టింది.

మళ్లీ మార్పు ఉండొద్దని..

Advertisement

ఈసారి సీఎం చంద్రబాబు కాస్త దూరదృష్టితో ఆలోచించారు. రాష్ట్రంలో ఒకవేళ అధికార మార్పిడి జరిగినా అమరావతినే రాజధానిగా కొనసాగించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.దానికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం సహాయం తీసుకున్నారు. కూటమి సర్కార్ కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో కీలక భాగస్వామిగా ఉన్నందున.. అసెంబ్లీలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపగా.. మోడీ సర్కారు పార్లమెంటులో బిల్లుపెట్టింది.ఇప్పటికే లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందగా.. రాజ్యసభలో పొందాల్సి ఉన్నది. అయితే, ఎన్డీయే సర్కారుకు ఫుల్ మెజార్టీ ఉన్నది. అక్కడ ఎలాగూ బిల్లు పాస్ అవుతుంది. బిల్లు చట్టం దాల్చడం ఖాయం. అయితే, ఈ సమయంలో వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఉపరాష్ట్రపతిని కలిశారు.

రూ.225 కోట్లతో బాసర టెంపుల్ అభివృద్ధి.. మాస్టర్ ప్లాన్ రెడీ, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Advertisement

తమకు రాజ్యసభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని వారంతా రాజ్యసభ చైర్మన్ (ఉపరాష్ట్రపతి)కి విన్నవించారు. వారు ఇలా ఎందుకు చేశారని ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతున్నది. తమకు ఎక్కువ సమయం కేటాయించాలని బిల్లు చర్చకు రాకముందే అనుమతి తీసుకోవాల్సిందని సూచిస్తున్నారు.ఇప్పుడు వైసీపీ ఏం చేసినా అమరావతికి చట్టబద్ధత రాకుండా ఆపలేదని.. ఒకవేళ మరల వైసీపీ అధికారంలోకి వచ్చినా కేంద్రంలో ఉండే సర్కారు అమరావతికి చట్టబద్ధత తొలగిస్తుందా? వైసీపీ ప్రతిపాదనను పట్టించుకుంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండ్రోజుల కిందట జగన్ కొత్తగా ‘మావిగన్’ (విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం) కేంద్రంగా రాజధానిని అభివృద్ధి చేయాలని ఆయన ప్రతిపాదించారు. దానిని కూటమి సర్కార్ పట్టించుకోలేదు. మరల జగన్ అధికారంలోకి వస్తే దీనిని ప్లాన్ -బిగా అమలు చేస్తామని ముందే ప్రకటించారు. ఏం చేస్తారో మరి వేచిచూడాల్సిందే.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×