E-Paper
Advertisement

పూర్తిగా డిజైన్ మార్చేసిన శాంసంగ్.. కొత్త Galaxy S26 FE లుక్ చూస్తే ఐఫోన్‌ను మర్చిపోతారు!

పూర్తిగా డిజైన్ మార్చేసిన శాంసంగ్.. కొత్త Galaxy S26 FE లుక్ చూస్తే ఐఫోన్‌ను మర్చిపోతారు!
Advertisement

Samsung Galaxy S26 FE: శాంసంగ్ ప్రతి ఏటా తమ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌కు కొనసాగింపుగా ఫ్యాన్ ఎడిషన్ (FE) మోడళ్లను తీసుకువస్తుంటుంది. ఈ క్రమంలోనే రాబోయే Galaxy S26 FEకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. వైర్‌లెస్ పవర్ కన్సార్టియం (WPC), గీక్‌బెంచ్ సైట్లలో ఈ ఫోన్ కనిపించడంతో దీని డిజైన్, స్పెసిఫికేషన్లపై ఒక అంచనా వచ్చేసింది.

సరికొత్తగా మారనున్న డిజైన్:

ఈసారి డిజైన్ పరంగా శాంసంగ్ పెద్ద మార్పే చేయబోతున్నట్లు తెలుస్తోంది. గత మోడళ్లలా విడివిడిగా కాకుండా.. కెమెరాలన్నింటినీ కలిపి ఒకే పిల్ షేప్ మాడ్యూల్‌లో నిలువుగా అమర్చినట్లు లీకైన ఫొటోలను బట్టి అర్థమవుతోంది. ఇది గెలాక్సీ జెడ్ ఫోల్డ్ లుక్‌ను గుర్తుచేస్తోంది. ఫోన్ చుట్టూ ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్, బ్యాక్ ప్యానెల్‌కు భిన్నమైన రంగులతో ఈ డిజైన్ చాలా ప్రీమియంగా ఉండనుంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్, పనితీరు:

Advertisement

గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం.. ఈ కొత్త ఫోన్ ఎగ్జినోస్ 2500 ప్రాసెసర్‌తో రానుంది. గత ఏడాది వచ్చిన S25 FEతో పోలిస్తే దీని పర్ఫార్మెన్స్ స్కోర్‌లు చాలా మెరుగ్గా ఉన్నాయి. 8GB RAM, ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే ఈ ఫోన్.. గేమింగ్‌, మల్టీటాస్కింగ్‌కు అద్భుతంగా పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు.

Also Read: iPhone Fold Leaks.. యాపిల్ తొలి మడత ఫోన్ ఇలా ఉండబోతుందా? డిజైన్ చూస్తే ఆశ్చర్యపోతారు!

బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

Advertisement

ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల పెద్ద OLED స్క్రీన్‌ను అందించే అవకాశం ఉంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 4900mAh బ్యాటరీని అమర్చినట్లు తెలుస్తోంది. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. అయితే వైర్‌లెస్ ఛార్జింగ్ ఉన్నప్పటికీ, దీనిలో యాపిల్ తరహా మాగ్నెటిక్ ఫీచర్ ఉండే అవకాశం లేదు.

ధర ఎంతంటే?

ఈ Samsung Galaxy S26 FE ఫోన్ వెనుక వైపు 50MP ప్రధాన కెమెరాతో పాటు, 12MP అల్ట్రావైడ్, 8MP టెలిఫోటో కెమెరాలు ఉండనున్నాయి. ఇక సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరాను ఇవ్వబోతున్నారు. ఈ ఫోన్ ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విడిభాగాల కొరత వల్ల దీని ధర గత మోడల్ (రూ.59,999) కంటే కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.

Also Read: 90W ఛార్జింగ్, 50MP సోనీ కెమెరాతో Vivo V70 Lite లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

Related News

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌తో కాకుండా.. మెటల్‌‌ తోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

Big Stories

Advertisement
×